వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి 2019: పండగ లక్ష్మి పూజలు ఏ రోజు.. ఎప్పుడు జరుపుకోవాలంటే

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు.

ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలో అమవాస్య రోజున దీపావళి వస్తుంది.దీపావలి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశిగా జరుపుకుంటారు.ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు.హారతులు తీసుకుంటారు.ఈ పండగకు కూతుళ్ళను ,అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు,వారికి కానుకలు ఇచ్చి గౌరవిస్తారు.

దీపావళి పండుగ కేవలం హిందువులే కాకుండా అన్ని మాతల వారు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రథమ స్థానం ఉంది.దక్షిణాది ప్రాంతాలకంటే ఉత్తర భారత దేశాల్లో ఈ పండుగను అంత్యంత వైభవంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.

Lakshmi Pooja at Deepawali festival

ఈ సంవత్సరం నరక చతుర్దశి - హారతులు

అక్టోబర్ 27 ఆదివారం రోజు చతుర్దశి ఘడియలు మధ్యాహ్నం 12 :23 నిమిషాల వరకు ఉన్నాయి.

శాస్త్ర ప్రకారం సూర్యోదయానికి పూర్వం 4 గంటల నుండి 6 లోపు హారతులు తీసుకోవాలి. వీలు పడని వారు ఉదయం 7:30 నిమిషాలలోపు తీసుకోవచ్చును.

( దీపావళి లక్ష్మీ పూజలు )

దీపావళి లక్ష్మి పూజలు ఆశ్వీయుజ అమావాస్య రాత్రి వేల ఉన్న ఘడియలలో మాత్రమే లక్ష్మి పూజలు జరుపుకోవాలి.

అదేరోజు అనగా 27 అక్టోబర్ ఆదివారం 2019 రోజున మధ్యాహ్నం 12 :24 నిమిషాల నుండి ప్రారంభం అయ్యి మరుసటి రోజు అనగా 28 సోమవారం ఉదయం 9 :08 వరకు మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి దీపావళి లక్ష్మి పూజలు ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి జరుపుకోవాలి.

తేదీ 28 సోమవారం రోజు కేదారవ్రతము జరిపించుకోవచ్చును

గమనిక :- ఈ సంవత్సరం "విశాఖ కార్తె" పండగకు లేదు కాబట్టి కొత్త అల్లుళ్ళను కూతుళ్ళను పండగకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ పిలుసుకోవచ్చును.

English summary
Most of the Hindu people celebrates deepawali as a with good belief. Lakshmi Pooja is the part of Deepawali festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X