వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దానధర్మాల విషయంలో ధర్మరాజుకు అహంకారం.. కృష్ణుడి రియాక్షన్ ఏమిటంటే!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి జూదం ద్రౌపది వస్త్రాభరణం కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన నీతికథలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఇది పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది.

అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని ఒకరోజు వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి పాలిస్తూ వచ్చారు అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.

 Lord Krishna preachig Dharma Raju about Donations

ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు.

కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు. రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు కృష్ణా మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నదీ అందరి దగ్గర సంపద బాగా ఉన్నదీ నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు ఇక్కడ స్థలం లేదు.

ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటె నేను సిగ్గుపడుతున్నాను అన్నారు, తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.

ఇక్కడ గమనించవలసిన నీతి ఏమిటనగా దానం ఇవ్వడం పుచ్చుకోవడంలో కుడా ఓ పరమార్ధం దాగి ఉంది. శ్రమ లేకుండా వచ్చిన ఆహారమే కానీ వస్తువే కానే ఎవరైతే ఉపయోగిస్తారో వారు శరీర అవయవాలు ఉండికుడా లేనివానితో సమానం, అంతే కాదు మహారోగితో సరి సమానం .... ఎవరి దగ్గరనైనా ఏది ఉచితంగా తీసుకున్న వారికి ఋణగ్రస్తులం అవుతాము. కాబట్టి నీకు కావలసిన వస్తువు నీ శారీరక శ్రమతో సంపాదించుకుని అనుభవించే వాటికి ఎవ్వరికి రుణపడి ఉండవలసిన ఆవసరం ఉండదు, పైగా మానసిక సంతృప్తి. ఈ దర్మనీతిని గ్రహించిన వారు ఎవ్వరు ఎవ్వరి దగ్గర ఏది ఉచితంగా ఆశించరు.

English summary
Dharma Raju is wel known for Donations in Mahabharatam era. Lord Krishna preached about the Donations to Dharma Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X