• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ‌న‌వ‌రి 10వ తేదీన చంద్ర‌ గ్ర‌హ‌ణం.. మనపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జ‌న‌వ‌రి 10వ తేదీన శుక్ర‌వారం చంద్ర‌ గ్ర‌హ‌ణం అనేది మనకు వర్తించదు. మన భారతీయ సంస్కృతిలో మహర్షులు ఛాయా గ్రహణములే మానవాళిని ప్రభావితం చేస్తాయి. గ్రహణ ప్రభావం ఉన్న వాటినే పాటించాలి అని తెలియజేసారు. గ్రహణాల వలన భూమిపై ఏ ప్రాంతంలో కనబడుతుందో ,ఏ నక్షత్రంలో సంభవిస్తుందో వారికి ఆక్కడి ప్రజలకు ప్రభావం చూపిస్తాయి అని వారి పరిశోధన అనుభవంతో యోగ దృష్టితో కేవలం ఛాయా గ్రహణములనే పరిఘనలోకి తీసుకుని పాటించాలి అని తెలియజేసారు. ప్రతి ఛాయాగ్రహణాలు ఎలాంటి హానికరమైన ఫలితాలు ఇవ్వవని నిర్ధారించారు.

భారతీయులకు ఎందుకు వర్తించదంటే

భారతీయులకు ఎందుకు వర్తించదంటే

ప్రస్తుతం 10 తేది రోజున ఏర్పడే చంద్ర గ్రహణం మనకు ఎందుకు వరించదు అనే వివరణలోకి వెళితే ఈ గ్రహణం "ప్రతి ఛాయాగ్రహణం" అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతి ఛాయాలో చంద్రుడు ప్రవేశించినప్పుడు వచ్చే గ్రహణం 10 జనవరి 2020 శుక్రవారం నాడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్ర గ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ గ్రహణానికి మనకు ఏలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఎవరూ భయందోళనలు చెందనవసరం లేదు, గ్రహణ నియమాలు వర్తించవు, రోజు ఎలా మాములుగా ఉన్నట్టే ఆ రోజు కుడా అలానే ఉండవచ్చును, ఇది ఋషులు నిర్ధారించిన నిర్ణయం.

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయంటే

గ్రహాణాలు ఎలా ఏర్పడతాయంటే

సూర్యునికి ,భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. రవి చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగానీ, కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పూర్తీ చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సూర్యుని కాంతి చంద్రునిపైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ, కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.

గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుత సంవత్సరం జ‌న‌వ‌రి 10వ తేదీ రాత్రి 10.39 జ‌రిగే చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని "వోల్ఫ్ మూన్ ఎక్లిప్స్" అని అంటారు. ఈ గ్రహణం యూరోప్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుండి ఈ చంద్ర గ్ర‌హ‌ణాన్ని వీక్షించ‌వ‌చ్చును. భారతదేశ కాల మానం ప్రకారం ఖగోళంలో ఈ ప్రతి ఛాయాగ్రహణం భూమిపై కాకుండా భూమి నీడపై పడుతుంది కాబట్టి మనకు ఎంత మాత్రం వర్తించదు. ఉదాహరణకు కరెంట్ వైర్ మన మీద పడితే షాక్ కొడుతుంది అది మనకు వర్తిస్తుంది. కానీ మన నీడ ( ఛాయా ) పై కరెంట్ తీగ పడుతే మనకు షాకు ఎలా తగలదో, వర్తించదో ఈ గ్రహణం మనకు అంతే కాబట్టి గర్భిణి స్త్రీలు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. భారత దేశ ద్వీపములలో పాక్షిక ప్రతి ఛాయా కనబడుతుంది అని కొందరు మనకు వర్తిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఏ పంచాంగాలలో గ్రహణం గురుంచి ఇది మనకు వరిస్తుందని రాయలేదు కాబట్టి నిస్సందేహంగా ఉండవచ్చు. లేనిపోని అనుమానాలు వద్దు.

ప్రత్యేక సూచనలు

ప్రత్యేక సూచనలు

ప్రత్యేక సూచన :- భారత దేశంలో చంద్ర గ్రహణం లేదు కాబట్టి భారత దేశములో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం పైన తెలిపిన దేశాలలో ఏయే ప్రాంతాలలో కనిపిస్తుందో అయా దేశ, ప్రాంతాల నివసించే వారికి మాత్రమే గ్రహణ నియమాలు వర్తిస్తాయి మనకు కాదు ఇది గమనించ గలరు.

English summary
lunar eclipse 2020 will be happening on January 10th. This story deals with precautions of the event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X