• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంక్రాంతి వేళ స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయా? జనవరిలోనే ఎందుకు జరుపుకోవాలి?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సంక్రాంతి లేదా సంక్రమణము:- అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందు వలన సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో హేమంత ఋతువులో అతి చల్లని గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణలో అడుగు పెడతాడు. ఈ రోజు నుండే స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి.

ఉత్తరాయణం:- మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము అనబడుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము అంటారు.

 Makara Sankrati Festival significance: Why its called Makara Sankranti

మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.

ఖగోళ పరంగా :- మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడై తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటచేత సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి అంటేనే పాతను వదిలి క్రొత్త దనానికి స్వాగతం పలుకే రోజు. ఈ రోజు సూర్యుని చుట్టూ పరిభ్రమించు భూమి దిశను సంక్రాంతితో సూర్యుడు కోంత ఉత్తరం వైపు మారును కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు. ఈ కాలంలో సూర్యుని సంక్రమణముతో పాటు మానవ శరీరంలో భౌతిక పరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ దృష్టిచేతనే ఈ పండగను సాంస్కృతిక పరమైన అద్భుత మహత్యము గల పర్వదినంగా మనకు పెద్దలు నిర్ధేశించినారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారంగా :- సూర్యభగవానుడు ఏ రోజైతే మకరరాశిలో ప్రవేశిస్తాడో ఆ పుణ్య ఘడియలను ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ ఖగోళ ప్రకారం సూర్యుడు తేది 15 జనవరి 2020 బుధవారము రోజు రాత్రి 2 : 08 ని॥లకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణ సమయం అయ్యే సరికి రాత్రి కావడం చేత మరసటి రోజు బుధవారం 15 తేదీ నాడు సూర్యోదయం నుండే మకర సంక్రాతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలి చలిగా ఉంటుంది. నెల రోజులు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా కనబడతాయి. హరిదాసులు, బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు, రకరకాల జానపద కళాకారులు వినోద ప్రజలకు వినోదాన్ని అందిస్తారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందు నుండే ప్రతీ రోజు ఇళ్ళ ముందు అందమైన ప్రత్యేక గీతల అల్లిక ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు.

ఈ పండగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు ( నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అని అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.

English summary
As per Hindu Calender, Makara Sankrati dedicated to deity Surya. Sun marks the first day of the sun's transit into Capricorn (Makara), marking the end of the month with the winter solstice and the start of longer days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X