వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయం నిద్రలేవగానే ఈ అలవాట్లు పాటించాలి.. అప్పుడే జీవితంలో శుభం కలుగుతుంది..!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అన్నింటిలో కెల్లా మనిషి భిన్నంగా జీవిస్తున్నాడు. ప్రకృతికి అనుగుణంగా కాకుండా తనకు నచ్చినట్లుగా జీవించడంలో కొన్ని అపశృతులు కుడా చవిచూడాల్సి వస్తుంది. అలాంటి వాటికి తరునోపాయాలు కొన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతున్నది. మానవుడి జీవితంలో అలవాట్లు అనేవి ముఖ్య భూమికను పోషిస్తాయి. ముఖ్యంగా సనాతన భారతీయ ధర్మం ప్రకారం ప్రతీ రోజు వేకువజాముననే నిద్ర లేచి కొన్ని పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఉదయాన్నే ఆవును సేవించడం, దైవారదన చేయడం లాంటి మంచి పనుల వల్ల ఎలాంటి అశుభాలు జరుగవు.

దైనందిన జీవితంలో అలవాట్లవి కీలక పాత్ర

దైనందిన జీవితంలో అలవాట్లవి కీలక పాత్ర

మనిషి దైనందిన జీవితంలో అలవాట్లు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మన అలవాట్లపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చి కష్టాలను సులభంగా ఎదుర్కునే అవకాశముంటే... చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదముంది. అంతేకాదు ఒక్క మంచి పని వ్యక్తిని ఉన్నత హోదాలు తీసుకెళ్తే.. అదే చెడు అలవాటు మనిషిని అదః పాతాళానికి తొక్కేస్తుంది. అందుకే మన శాస్త్రాలు, పురాణాల్లో చెప్పిన ప్రకారం ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలని అంటారు. జీవితం శుభంగా.. సమస్యలు లేకుండా ఉండేందుకు ముఖ్యంగా ఐదు అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిద్రలేవగానే ఈ మంత్రం పటించాలి

నిద్రలేవగానే ఈ మంత్రం పటించాలి

ఉదయాన్ని ఈ మంత్రాన్ని జపించాలి... సాధరణంగా వేకువ జామునే నిద్రలేవడం ఎంతో మంచి అలవాటు. ఈ అలవాటును ఎప్పుడూ పాటించేవారికి ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. ఉదయాన్నే కళ్లు తెరవగానే రెండు చేతులను జోడించాలి. అరచేతులు చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. "కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం" అనే మంత్రాన్ని పఠించాలి. అరచేయి పై భాగాన లక్ష్మి , మధ్యభాగములో సరస్వతి, చివరి భాగంలో గౌరీ ( పార్వతి ) దేవి. ఈ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవాలి. పై మంత్రాన్ని చదువుకుని చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూ కళ్ళను తెరచి అరచేతులను చూడాలి, ఈ విధంగా చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు వృద్ధిని సాధిస్తారు.

 భూమికి నమస్కరించడం మరువకూడదు

భూమికి నమస్కరించడం మరువకూడదు

మనల్ని మోస్తూ , మనం ఎం చేసినా భరిస్తూ అమ్మలాంటి భూమాతకు కృతజ్ఞతగా ఉదయాన్నే నిద్రనుండి లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు. ధర్మ శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుండి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు. ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని ఎంతో మంది నమ్ముతారు. అందుకే ఉదయాన్నే లేవగానే భూమికి నమస్కారం చేయడం మరువకూడదు.

పడక గదిలో ఫోన్ ఉండకూడదు

పడక గదిలో ఫోన్ ఉండకూడదు


ఉదయం లేవగానే పాత పద్దతిలో చాలా మంది చేసే మొదటి పని అద్దంలో ముఖాన్ని చూసుకోవడం. కానీ ప్రస్తుత కాలంలో నిద్రనుండి లేవగానే పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ ను చూడటం ఎక్కువ మంది చేస్తున్నారు. వాస్తవానికి ఫోన్ అనేది పడక గదిలో ఉండనే కూడదు. కళ్ళకు మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిదికాదు. జ్ఞాపక శక్తిని హరించి వేస్తుంది. ఈ అలవాటుకు ఎంత దూరముంటే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేసినప్పుడు నెగటీవ్ ఎనర్జీ మనల్ని తన నియంత్రణలో పెట్టుకుంటుంది. ఇందుకు బదులు ఉదయాన్నే లేచి ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లో ఉన్న భగవంతుడి రూపాన్ని చూడాలి.

ఆవును పూజించడం వల్ల ఎంతో మంచిది

ఆవును పూజించడం వల్ల ఎంతో మంచిది

"గో" సేవ. ఆవుకు ఆహారం " గ్రాసం" పెట్టాలి. గోమాత ప్రదక్షిణ వలన ముక్కోటి దేవతలను కొలిచిన పుణ్య ఫలం వస్తుంది. ఆవును పూజించడం వలన ఎన్నో విధాల మంచిదని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆవును సేవిస్తే శ్రీ మహాలక్ష్మీని కొలిచినట్లేనని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. మనం తీసుకునే ఆహారంలో కొంత భాగంగా భావించి, గోమాత మన కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తిగా తలచి ఆవుకు కొంత గ్రాసం తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పేడతో కల్లాపి చల్లితే క్రిమి కీటకాలు రావు, ఇంట్లోకి దేవతలను ఆహ్వానం పలికినట్లే అని ప్రతీతి. ఫలితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. అలాగే ఓ పాత్రలో కొంత ధాన్యాన్ని, నీళ్ళను కాకులు లేదా పక్షులకు పెట్టాలి. ఇలా చేయడం వలన జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే కుడా తొలగిపోతాయి. ఎలాంటి శత్రుభయాలు ఉండవు.

వీరిని ఎప్పుడూ తలుచుకోవాలి

వీరిని ఎప్పుడూ తలుచుకోవాలి


​ప్రాత:స్మరామి. మన ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు తలిదండ్రులు, విద్యనేర్పిన గురువులు, కులదైవం, జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే జ్యోతిష పండితున్ని, ఆపదలో ఆదుకున్న వారిని, మనస్సుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకుని వారి పేర్లను తలచుకోవాలి. వారి యోగ క్షేమాలను కోరుకోవాలి. ఇలా తలచుకోవడం వలన ఆ రోజంతా శుభంగా ఉంటుంది. అంతే కాకుండా ఆ రోజు ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. జాతక చక్రాల్లో ఎలాంటి దోషాలు, పాపాలు ఉన్న ఈ అలవాటు వలన నశిస్తాయి.

English summary
Man needs to cultivate good habits. With good habits alone he can lead a good life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X