వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని రకాల వైరస్ నివారణలకు మసాజ్ మంచి ఔషధం.. ఆయుర్వేదం కూడా అదే చెబుతోంది

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

భారతీయ ప్రాచీన పద్ధతులను అనుసరించిన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవేమిటో పరిశీలిద్దాం. శరీరం దృఢంగా, ఆరోగ్యగంగా కావాలంటే తైల మర్దన కావాలి దానినే అభ్యంగనం అంటారు 'మసాజ్' వలన ఉపయోగాలు శరీరానికి ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది. ఇది ఒక రకమైన వ్యాయామం వంటిది. దీనివలన ముసలితనం త్వరగా దరిచేరదు. ఒళ్లునొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం వస్తుంది. శరీరానికి నునుపుదనం , బలం కలుగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. శ్రమని తట్టుకొనే శక్తి పెరుగును .

శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకొనుటకు వినియోగించే నువ్వుల నూనె , కొబ్బరినూనే,ఆలివ్ ఆయిల్ మొదలగు నూనెలతో మాసాజ్ చేసుకునే ముందు ఆయిల్ లో చిటికెడు పచ్చ కర్పూరం పొడి కలిపి శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వలన కరోనా వైరస్ ను ఎక్కువ శాతం నివారించుటకు ఉపయోగపడుతుంది.

Massage is a good remedy for all kinds of virus, This is how ?

ఉపయోగాలు :-

* కరోనా వైరస్ ను ఎక్కువ శాతం నివారించవచ్చును.

* ఆవు నెయ్యిలో చిటికెడు పచ్చ కర్పూరం కలిపి చేతులకు బాగా మర్దన చేసుకున్నా కరోనా వైరస్ ను అరికట్టవచ్చును. చేతులకు మర్దన చేసుకున్న ఆవునెయ్యి, కర్పూరం వాసనను తరచూ పిల్చుకుంటే అద్బుతమైన వైరస్ నకు నివారణ మందు అవుతుంది.

* తైలముతో శరీరానికి మసాజ్ చేయడం వలన చర్మానికి కాంతి వచ్చును.

* కండరాలు బలంగా తయారగును.

* కండరాలకు , టిష్యులకు మంచి పోషణ అందుతుంది.

* రక్త ప్రసరణ బాగా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరగడం వలన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది .

* శరీరంలో వ్యర్ధాలు బయటకి వస్తాయి.

* శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగును .

* శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది.

* శరీరంలోని అన్ని జాయింట్లలో పట్టుకుపోవడం తగ్గి అన్నివైపులకు తిరగడానికి వీలుగా ఉంటుంది.

* మసాజ్ శరీరంలో దృఢత్వాన్ని పెంచుతుంది.

* వెన్నుముక కు చాలా మంచిది. వెన్నుముక నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ కు సంబంధించిన అవయవాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది.

* శరీరంలోని ఎలక్ట్రో మ్యాగ్నటిక్ శక్తి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది.

పైన చెప్పిన విధముగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మసాజ్ చేసుకొనే సమయములో అరికాళ్ళు మర్దన చేసుకోవడం మర్చిపోవద్దు. మహమ్మారి కరోనా వైరస్ నివారణకు పై తెలిపిన ఆయుర్వేద చిట్కా వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. సనాతన సంప్రాదాయాలు పాటిస్తే చక్కటి ఆరోగ్యంతో జీవించవచ్చును.

English summary
There are many benefits to those who have followed the ancient practices of India. Ayurveda states that massage is a must for every day oil massage. It’s like a kind of exercise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X