• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెహెర్ బాబా జీవిత చరిత్ర

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

మెహెర్ బాబా (1894 ఫిబ్రవరి 25 - 1969 జనవరి 31) భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు.

మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగా ఐదుగురు ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు.

జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అందులో చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు.

Meher Baba is a prominent spiritual teacher from India

1931లో మొదటిసారి విదేశాల్లో పర్యటించి అనేకులను అనుచరులుగా చేసుకున్నాడు. 1940వ దశకమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి పనిచేశాడు. వీరందరూ ఆయన్ను చూడగానే తమ ఆధ్యాత్మిక చేతనత్వాన్ని కనుగొన్నారని మెహెర్ బాబా పేర్కొన్నాడు. 1949 మొదలుకొని ఎంపిక చేసిన బృందంతోనే భారతదేశమంతా అనామకుడిలా పర్యటించాడు. ఈ సమయమంతా తన జీవితంలో నూతన నిగూఢ అధ్యాయంగా పేర్కొన్నాడు.

మెహెర్ బాబా తన జీవితంలో రెండు సార్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఒకటి 1952లో అమెరికాలో జరగ్గా మరొకటి 1956లో భారతదేశంలో జరిగింది. దానితో ఆయన సరిగ్గా నడవలేక పోయాడు.

1962లో, ఆయన తన పాశ్చాత్య శిష్యులనంతా భారతదేశానికి వచ్చి మూకుమ్మడిగా దర్శనం చేసుకోమన్నాడు. దీన్ని ది ఈస్ట్-వెస్ట్ గ్యాదరింగ్ అన్నాడు. విచ్చలవిడిగా మందుల వాడకం వలన పెద్దగా ఉపయోగం ఉండదని 1966లో పేర్కొన్నాడు. ఆరోగ్యం సహకరించకున్నా, ఉపవాసం, ఏకాంతం లాంటి సార్వత్రిక కార్యక్రమాలను 1969, జనవరి 31న ఆయన మరణించే వరకూ కొనసాగిస్తూనే వచ్చాడు. మెహరాబాద్‌లోని ఆయన సమాధిని విదేశాలకు చెందిన భక్తులు కూడా సందర్శిస్తున్నారు.

మెహెర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని బోధించాడు. అంతేకాకుండా చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సాధకులకు అనేక సలహాలిచ్చాడు. కచ్చితమైన గురువు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆయన బోధనలు డిస్కోర్సెస్ మరియు గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి.

అవతార్ మెహెర్ బాబా ట్రస్ట్, పాప్-కల్చర్ కళాకారులపై ఆయన చూపిన ప్రభావం, డోంట్ వర్రీ బీ హ్యాపీ లాంటి చిన్న చిన్న చమక్కులు ఆయన వదిలి వెళ్ళిన వారసత్వ సంపద. మెహెర్ బాబా మౌనం ఆయన అనుచరుల్లోనే గాక బయటి ప్రపంచానికి కూడా ఒక రహస్యంగా మిగిలిపోయింది.

* మెహర్ బాబా బోధనలు*

మెహెర్ బాబా మనిషి లోని స్వార్థభూతాన్ని తరిమికొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అందులో భాగంగానే అన్ని బంధాలకూ, పతనానికి హేతువైన నేనూ, నాథనే స్వార్థాన్ని వీడండి. నిన్ను నేవు ప్రేమింటుకున్నట్టే తోటి మనిషినీ ప్రేమించమని, అప్పుడే పరమాత్మకు మనం చేరువవు తామని చాటిచెప్పాడు. ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతమైన మార్గానికి తీసుకువెళ్ళే ఆలంబన కావాలని దిశానిర్దేశనం చేశాడు.

పరవారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందన్నాడు. ఇతరులకు చెడు చెయ్యకపోవడమే మనం చేయగలిగే మంచి అన్నాడు. భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించాడు మెహెర్ బాబా. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పణం చేసుకోగలిగే నిజాయతీ గుణాలున్న వారంటేనే దైవం మెచ్చు కుంటాడన్నారు.

మనమేదైతే పూర్తిగా విశ్వసిస్తామో దాన్నే ఆచరించాలని, పరులమెప్పు పొందాలనో, తన గొప్పతనం ఇతరులు గుర్తించాలనో ఆర్భాటాలకూ, అట్టహాసాలు ప్రదర్శించేవారికి పరమాత్మ ఎప్పుడూ దూరంగానే ఉంటాడని చెప్పారు బాబా.

మెహెర్ బాబా 1969 జనవరిలో పరమపదించాడు. ఆయన భౌతికసమాధి మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్‌ దగ్గర మెహరాబాద్‌లో ఉంది.

ప్రేమ సాగరుడు శీర్షికన బాబా భక్తుడు నిట్టా భీమశంకరం 8 భాగాలకు పైగా మెహెర్ బాబా జీవిత చరిత్రను గ్రంథస్థం చేసి ప్రచురించారు. 8వ భాగాన్ని మెహెర్ బాబా మౌనదీక్షలో భాగంగా రాసి భావాలను తెలిపేందుకు ఉపయోగించిన అక్షర ఫలకను కూడా విసర్జించి పూర్తి సమాధిలోకి వెళ్ళిన సంఘటనకు వార్షికోత్సవమైన 7-10-1982న ప్రచురణ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Meher Baba (February 25, 1894 - January 31, 1969) is a prominent spiritual teacher from India. His birth name Mervyn Sheriar Irani. He has declared himself an Goddes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more