• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిరిధాన్యాల్లో ఔషధ గుణాలు: కొర్రలు, రాగులు తింటున్నారా? అయితే మీ కోసం..

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఈ సిరి ధాన్యాలు అంటే చిరు ధాన్యాలు కావు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు. వీటిని వాడుతూ ఉంటే ఎవరైనా కానీ ఆరు నెలల నుండి రెండు సంవత్సరాలలో వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగ కారకాలను శరీరంలో నుండి తొలగించి దేహాన్ని శుద్ధి చేయును.

ఏ ఆహార పదార్ధ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్ , కార్భో హైడ్రేట్ ల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడుతుంది. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉండే పదార్ధాలు రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క ఈ సిరిధాన్యాలు ఈ నిష్పత్తి 5.5 నుండి 8.8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడి బియ్యం , గోధుమలలో కుడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా ఉండదు. మనిషికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, పిండి పదార్ధం, పీచుపదార్ధం సిరిధాన్యాలలో సమతుల్యంగా ఉన్నాయి.ఈ సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా ఒక్కోదాన్ని వేర్వేరుగా కొన్ని రోజులు వరుసగా తీసుకుంటే జబ్బులు పోతాయి. కొత్త జబ్బులు రావు.

Millets food: how Benefit for human body

కొర్రలు యొక్క ఉపయోగాలు - కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

* నరాల శక్తి , మానసిక ద్రుడత్వం ,అర్ర్డయిటిస్, పార్మిన్ సన్, మూర్చ రోగాల నుండి విముక్తి కలిగిస్తుంది.

* జీర్ణశక్తిని పెంచును.

* రక్తమును వృద్దిచేయును.

* కొర్రలు విరిగి పోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

* శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

* శరీరం నందు వేడిని కలిగించును.

* జ్వరమును, కఫమును హరించును .

* నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

* అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

* గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

* కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుండో మానని మొండి వ్రణాలు సైతం మానేలా చేస్తుంది.

* కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్త ,పైత్య రోగం మానును .

* కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

* కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

* కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

* కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

- సామలు వాటి ఉపయోగాలు -

* అండాశయము, వీర్యకణ సమస్యలు ,పిసిఒడి, ధైరాయిడ్, సంతానలేమి సమస్యల నివారాణ చేయును.

* సామలతో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును.

* చలవ , వాతమును చేయును .

* మలమును బంధించును .

* శరీరము నందు కఫమును , పైత్యమును హరించును .

* ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

* గుండెలో మంటకు మంచి ఔషదం.

* కీళ్ల నొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం .

- రాగుల వాటి ఉపయోగాలు -

* వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు .

* రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.

* మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును .

* రాగులను జావలాగ చేసిన అంబలి అని అంటారు. దీనిని త్రాగడం వలన మేహరోగాన్ని అణుచును.

* రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచో ఎక్కువ ఫలితం ఉండును.

* శరీరానికి చలువ చేయును .

* శరీరంలో పైత్యం వలన కలిగే నొప్పులను పొగొట్టును.

* ఆకలి, దప్పికలను పోగొట్టును .

* మలబద్ధకం నివారణ చేయును.

* శరీరంలో ,రక్తంలో వేడిని తగ్గిస్తుంది .

* రాగుల్లో పిండి పదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంస కృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

* రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లే విధముగా చేయును .

* మెరకభూముల్లో పండే రాగులు మంచి రుచిని కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

* రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతి మూత్రవ్యాధి హరించును .

* రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

- అరికలు -

* రక్త శుద్ధిని చేస్తాయి.

* రక్త హీనతను తొలగిస్తుంది.

* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

* డయబిటిస్ కు మంచిది.

* మలబద్ధకం నివారణ చేస్తుంది.

* నిద్ర లేమిని పోగొడుతుంది, మంచి నిద్ర వస్తుంది.

- ఊదలు -

* లివర్ సంబంధిత వ్యాధులకు మంచిది.

* కిడ్ని సంబంధిత వ్యాధులకు మంచిది.

* నిర్ణాల గ్రంధులు ( ఎండోక్రేయిన్ గ్లాండ్స్ ) సంబంధిత వ్యాధులకు మంచిది.

* కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది .

* కామెర్లు రాకుండా కాపాడుతుంది.

- అడ్డు కొర్రలు -

* జీర్ణాశయ సంబంధిత వ్యాధులకు మంచిది.

* అర్ధయిటిస్ సంబంధిత వ్యాధులకు మంచిది.

* బి.పి ని అదుపులో ఉంచుటకు ఉపయోగ పడుతుంది.

* కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

* శరీరం ఊబకాయం రాకుండా కాపాడుతుంది.

పై తెలిపిన సిరిధాన్యాలతో షుగర్ ( డయాబెటిస్ ) బిపి , ఊబకాయం, కీళ్ళ నొప్పులు, రక్తహీనత మొదలగు 45 రకాల వ్యాధులు , 14 రకాల క్యాన్సర్లను ఈ సిరిధాన్యాలతో జయించవచ్చును. పూర్వకాలంలో మన పెద్దలు ఇలాంటి ఆహారం తినే ఏ రోగాలు లేకుండా 90 ఏళ్ల వయస్సులో కుడా వ్యవసాయ,ఇతర శారీరక శ్రమ కలిగే పనులు చేసుకున్నారు. ఆడవారైతే అధిక సంతానం కని కుడా అన్ని పనులు చేసుకునేవారు. అప్పటి కాలంలో చాలా మట్టుకు కంటికి అద్దాలు లేవు. జుట్టు ఊడేది కాదు తెల్లబడేది అంతకంటే కాదు. సర్వ సాధారణంగా ఆరోగ్య సమస్యలు అనేవి వారికి ఉండేవి కాదు. దీన్నిబట్టి మనం ప్రస్తుతం తింటున్న ఆహరం ఎలాంటిదో మన శరీర ద్రుడత్వం ఎలాంటిదో గమనిస్తే చాలు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. జై శ్రీమన్నారాయణ

English summary
Millets are a group of highly variable small-seeded grasses, widely grown around the world as cereal crops or grains for fodder and human food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X