వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ఈ నాలుగు ఉంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం పక్కా..!

|
Google Oneindia TeluguNews

చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొన్ని పను చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో కుటుంబానికి ఎప్పుడూ డబ్బు, ఆహారం కొరత ఉండదని చెబుతారు. ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందట. అందుకే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మూడు రకాల వస్తువులు ఇంట్లో ఉంచినప్పుడు లక్ష్మీ దేవి ఉంటుందని వాస్తునిపుణులు చెబుతున్నారు.

తామర పువ్వు

తామర పువ్వు

మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మీదేవి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది. శుక్రవారం రోజు మా లక్ష్మీదేవి పాదాల వద్ద తామరపూలను సమర్పిస్తే ఆ తల్లి ఆశీస్సులు మొత్తం కుటుంబ ఉంటాయట. దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం కూడా ఉండదట.

చీపురు

చీపురు

చిపురు ఇంట్లో దుమ్మును ఉడవడానికి ఉపయోగపడుతుంది. చిపురుతో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవచ్చు. అయితే చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురు ఉన్న గదిలో తల్లి లక్ష్మి నివాసం ఉంటుందట. కానీ రాత్రిపూట ఎప్పుడూ ఇల్లు ఉడవద్దట. చిపురును మురికి ఉన్న ప్రదేశంలో ఉంచవద్దట.

తులసి

తులసి

హిందువులు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కు ఉంటుంది. ఈ తులసి మొక్కకు పవిత్రమైన స్థానం ఉంటుంది. తల్లి లక్ష్మి ఈ చెట్టులో నివసిస్తుందని నమ్ముతారు. కావున లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించాలంటే ఇంట్లో తులసి మొక్కను నాటుకోవాలట. అలాగే ప్రతిరోజూ సాయంత్రం తులసి చెట్టుకు దీపం వెలిగించాలట.

శంఖం

శంఖం

సముద్ర మథనం సమయంలో లక్ష్మీ దేవి మరియు శంఖం కలిసి ఉద్భవించాయి. కాబట్టి కొందరు శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. శంఖం ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం.

Note: ఈ సమాచారం కేవలం వాస్తు నిపుణులు అభిప్రాయం మాత్రమే. దీన్ని వన్ ఇండియా ధృవీకరించలేదు.

English summary
Many people are struggling with financial problems. Vastu experts say that by doing some work such people can get the blessings of Goddess Lakshmi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X