వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ దేహంలో మూలధారచక్రం: గణపతితో దాని సంబంధం?..

|
Google Oneindia TeluguNews

యోగాశాస్త్రంలో షట్ చక్రాలలో మూలాధార చక్రం ప్రధానమైనది.అసలు ఈ మూలాధారము అంటే ఏమిటి.? మానవుని దేహం పంచభూతాత్మకమైనది.ఈ పంచ భూతలలో మూలాధార చక్రం భూమి స్థానం కలిగి ఉంటుంది.వెన్నుపూస చిట్టచివరి మలద్వారానికి ఒక అంగుళం పైన మూత్రకోశానికి ఒక అంగుళం క్రింద మూలధారము ఉంటుంది.మూలాధార చక్రమునకు గణపతి అధిదేవడు. అక్కడ ఆతడు ఎర్రనిరంగుతో తేజోవంతమైన స్వరూపము కలిగి ఉంటాడు.

మూలాధారచక్రం నాలుగు దళములు కలిగిన కమలం లాంటిది.అందులోనే కేంద్రమందు ఒక సూక్ష్మమైన లింగమును- తేజోలింగమును-కుండలిని మూడున్నర సార్లు చుట్టుకుని ఉంటుంది. కేవలం భక్తిశ్రద్ధలతో యోగముద్రలో గణపతి మంత్రం జపిస్తే ఆతడిని ఆ నాలుగు దళాల కమలంలో మధ్యస్థితునిగా ధ్యానిస్తే అంటే ప్రాణాయామం చేసినవారికి ప్రధమంగా గణపతి దర్శనం కలిగి క్రమంగా యోగానుభూతిని పొందుతారు.

Muladhara: The Importance Of The Root Chakra

విఘ్నములను తొలగించువాడు వినాయకుడు.విఘ్నం అంటే మన అజ్ఞానం. అంటే కొన్ని కాలమాన పరిస్థితులలో విఘ్నాన్ని తప్పించుకోలేం. మన తెలివితేటలు ఉన్నను కొన్ని సందర్భాలలో అవి పనికి రావు,మనకున్న సంపద వాటిని నుండి తప్పించలేదు.

'శ్రేయాంసి బహు విఘ్నాని' శ్రేయస్కరమైన కార్యాలకు అనేక విఘ్నాలు కలుగుతాయని అంటారు.

యోగ శాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడు పృధ్వీ తత్త్వంతో కుండలినీ శక్తికి కాపుగా ఉంటాడు.''షట్చక్రములందు కుండలినీ జాగరణ యోగులు సాధించే ముందు మొదటగా మూలాధారచక్రంలో సుషుప్తియందున్న కుండలిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఇందులో యోగి గణపతి అనుగ్రహం కోసం ప్రార్థించి విజయాన్ని పొందుతాడు.మూలాధారచక్ర అధిష్టాన దేవత "సిద్ధవిద్యాదేవి" సాకిణీ రూపములో ఉంటుంది.

ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక,న్యాస మంత్రాలన్నీ"స" కార సంబంధముగా ఉంటాయి.మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము.షట్చక్రాలలో మొదటిది.ఇది నాలుగు దళాల పద్మము.ఈ మూలాధార చక్రములో 'సాకిన్యాంబ' నివసిస్తుంది.ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి.గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది.

శ్రేయస్సు అంటే జ్ఞానప్రాప్తి.దానికోసం చేసే ప్రయత్నం సులభంగా కొనసాగవు.జ్ఞానాన్ని కోరేవారు అరుదు.యోగమో, ధ్యానమో, జపమో ఏదో ఆధ్యాత్మిక సాధన ప్రారంభించవచ్చు. కాని అది కొనసాగటానికి బాహ్యమైన అవరోధాలకంటే వ్యక్తిలోపల ఉండే అవరోధాలు ఎక్కువ.కొన్ని సంవత్సరాలు యోగసాధన చేసినవారికికూడా లోపల ఉన్న శత్రువులు,కామమో, అహంకారమో, ధనాశ, కీర్తి కాంక్ష మొదలగు దౌర్భల్యము.ఇందులో ఏదో ఒకటి మనిషి పతనానికి కారణం అవుతాయి.

ఒకనాడున్న జిజ్ఞాస, వైరాగ్యము మరొకనాడు ఉండకపోవచ్చు. అందువల్ల సాధకులు కూడా విఘ్నం లేని సాధనకొరకు భగవంతుని దయను కోరుతారు. ఈ విషయంలో ఒక్క విఘ్నరాజు మాత్రమే గట్టెక్కించగలడు. మన అజ్ఞానాన్ని తొలగించి విజయాలను ప్రసాదించగలడు.

వేద ప్రమాణాన్ని అనుసరించి వర్ష ఋతువులో సంవత్సరం ఆరంభమవుతుంది.అంటే సృష్టి ప్రసాదించే సహజ జలంతో ప్రారంభం.మన కాలగమనంలో మొదట దక్షిణాయనం వస్తుంది.ఇక్కడ మళ్లీ మొదటగా వినాయక పూజ చేసుకోవాలని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి.ఈ యోగా సాధనలో మూలబంధన ప్రక్రియ ద్వార మనిషి యొక్క మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది,మృత్యువును జయించి ఆయుషును పెంచుతుంది,చిరకాల యవ్వనాన్ని ప్రసాదిస్తుంది.

-డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" ,
ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,
ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Muladhara: The Importance Of The Root Chakra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X