వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భం ధరించిన స్త్రీలకు విషయంలో.. గ్రహాలు, జ్యోతిష్యం ఏం చెబుతున్నదంటే..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గర్భం ధరించిన స్త్రీ తన కడుపులో పిండోత్పత్తి ప్రారంభమయిన దగ్గర నుండి శిశు జననం వరకు తల్లి గర్భములో పిండం ప్రతి మాసం మార్పులు చెందుతూ ఉంటుంది. జ్యోతిష పరంగా ఆ మార్పుల ఆధారంగా ప్రతి మాసమునకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు.

Navagrahas fall under the the Hindu Astronomy

1 వ మాసం శుక్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక శోణితాలు ద్రవ రూపంలో ఉంటాయి.

2 వ మాసం కుజ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శుక్ర శోణితాలు గట్టిపడుతుంటాయి.

3 వ మాసం గురుగ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో జీవం ప్రారంభమవుతుంది. అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

4 వ మాసం రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ఎముకలు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

5 వ మాసం చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో ద్రవ పదార్ధాలు ఏర్పడతాయి. చర్మం ఏర్పడటం ఆరంభమవుతుంది.

6 వ మాసం శని గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు కేసాలు ఏర్పడతాయి.

7 వ మాసంలో బుధ గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు స్పర్శ జ్ఞానం ప్రారంభమవుతుంది.

8 వ మాసంలో తల్లి లగ్నాధిపతి ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది. .

9 వ మాసలో చంద్ర గ్రహం ప్రాదాన్యత వహిస్తూ పిండంలో శిశువుకు ఆహారం తీసుకోవటం తెలుస్తాయి.

10 వ మాసంలో రవి గ్రహం ప్రాదాన్యత వహిస్తూ ఉంటుంది.

పై గ్రహాలు అవి సూచించు మాసాలలో గర్భంలోని శిశువుపై ప్రభావాన్ని సూచిస్తాయి. గర్భవతిగా స్త్రీకి ఎన్నవ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసములో గోచారంలో బలహీనపడరాదు. అదే విధంగా ఒక స్త్రీ జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహం సూచించు మాసములో గర్భములోని శిశువుకు ఇబ్బందులు ఏర్పడటం లేదా గర్భస్రావం జరగటం లేదా గర్భవతికి గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం జరుగుతాయి.

ఉదహరణకు :- గర్భవతి జాతకంలో రవి బలహీనపడిన నాల్గవ నెలలో ఇబ్బందులు కలగటం లేదా ప్రసవ సమయంలో కష్టాలు కలుగుతాయి. ఏ విధంగా స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో మరియు గర్భవతిగా ఉన్నప్పుడూ ఏ మాసం జరుగుతుందో ఆ మాసాధిపతి ఆ మాసంలో గోచారంలో బలంగా ఉన్నాడో లేదో ముందుగానే పరిశీలించి ఆ గ్రహానికి శాంతి ప్రక్రియలు చేయించుకున్న గర్భ రక్షణ జరుగును.దీనితో పాటు గర్భరక్ష యత్రం దగ్గర పెట్టుకున్న చాలా మంచింది. గర్భిని స్త్రీ రోజు కనీసం ఐదు తులసి ఆకులు తింటే శిశువునకు,తనకు చాలా మంచి జరుగుతుంది. ఏ చింత చెందకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరం దైవనామ స్మరణతో ఉంటే తల్లికి బిడ్డకు ఇద్దరికీ మంచింది.

English summary
Navagrahas fall under the the Hindu Astronomy and play a major part in the Hindu astronomical sphere. The Hindu astronomy whose origin dates back to the time of Vedas is concerned with the placement of nine planets and their influence on the world and on an individual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X