వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

navratri 2022: దుర్గా శరన్నవరాత్రులలో నేడు శైలపుత్రిగా అమ్మవారు.. ప్రాముఖ్యత, పూజావిధానం, పరిహారమిదే!!

|
Google Oneindia TeluguNews

దేవి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి ని తొలిరోజు భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం శైలపుత్రి అయిన సతీదేవి శివుని భార్య, సతీదేవి తండ్రి ఆయన దక్ష ప్రజాపతి యాగం చేస్తూ పరమశివుని ఆహ్వానించకుండా అవమానిస్తే, సతీదేవి తన భర్తను అవమానించినందుకు యాగ మంటల్లోనే దూకి కాలిపోతుంది. ఇక మరుసటి జన్మలో సతీదేవి శైలపుత్రి రూపంలో కనిపించి శివుని మళ్ళీ వివాహం చేసుకుంటుంది.

navratri fast: దుర్గా శరన్నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండిnavratri fast: దుర్గా శరన్నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి

 శైలపుత్రిని పూజించటం వల్ల కలిగే ఫలితమిదే

శైలపుత్రిని పూజించటం వల్ల కలిగే ఫలితమిదే


పురాణాలలో, ధర్మ శాస్త్రాలలో శైలపుత్రిని పూజించడంవల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని సూచించబడింది. శైలపుత్రి పూజ వలన ప్రతికూల శక్తులు నశిస్తాయి అని చెప్పబడింది. తమలపాకుపై లవంగాన్ని ఉంచి, దానిపై పంచదార మిఠాయి శైలపుత్రి కి నైవేద్యంగా పెట్టడం ద్వారా మీ జీవితంలోని ప్రతి కోరిక నెరవేరుతుందని కూడా సూచించబడింది. అమ్మవారు అత్యంత మహిమాన్విత కావటంతో ఆమె అన్ని కోరికలను నేరవేరుస్తారని సూచించబడింది.

శైలపుత్రి పూజా విధానమిదే

శైలపుత్రి పూజా విధానమిదే


నవరాత్రులలో అమ్మవారి మొదటి రూపం అయిన శైలపుత్రికి ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా పూజ నిర్వహించాలి. నవరాత్రుల లో భాగంగా మొదటి రోజు ఒక పీఠం పై ఎరుపు లేదా తెలుపు వస్త్రాన్ని పరిచి శైలపుత్రి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. తెలుపు శైలపుత్రి కి అత్యంత ప్రీతికరం కావడంతో శైలపుత్రి కి తెల్లని బట్టలు లేదా తెల్లని పువ్వులను సమర్పిస్తే మంచిదని సూచించబడింది. పూజలో భాగంగా తమలపాకుపై 27 లవంగాల నుంచి పూజిస్తే మంచిదని సూచించబడింది.

అమ్మవారికి లవంగాల మాల.. కలిగే ఫలితాలివే

అమ్మవారికి లవంగాల మాల.. కలిగే ఫలితాలివే


శైలపుత్రి ముందు నెయ్యి దీపం వెలిగించి ఉత్తరం వైపున ఉన్న ఆసనంపై కూర్చొని, ఓం శైలపుత్రీ యే నమః అంటూ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపం చేసిన తర్వాత లవంగాలను మాలగా కట్టి అమ్మవారికి దండగా సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు కూడా శాశ్వతంగా దూరమవుతాయి అని సూచించబడింది. అమ్మవారికి రెండు పూటలా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చెయ్యటం సత్ఫలితాలను ఇస్తుందని సూచించబడింది.

 దసరా శరన్నవరాత్రులలో తొలిరోజు అమ్మవారి పూజతో పాటు చెయ్యాల్సిన పరిహారం ఇదే

దసరా శరన్నవరాత్రులలో తొలిరోజు అమ్మవారి పూజతో పాటు చెయ్యాల్సిన పరిహారం ఇదే


ఇక నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని పూజించే క్రమంలో మధ్యాహ్నం ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి ఎర్రటి పువ్వులను, ఎర్రటి పండ్లను సమర్పించండి. దీనితో పాటు ఒక రాగి నాణెం ను కూడా సమర్పించండి దీని తరువాత ఓం దుర్గాయై నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అంటూ మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత సూర్యమంత్రాన్ని కనీసం మూడు సార్లైనా జపించండి. ఇలా పూజలు చేసిన తర్వాత మీ చేతికి రాగి ఉంగరాన్ని ధరించండి .ఈ పరిహారం చేయడం వల్ల జాతకం లో సూర్యుడు బలంగా ఉండి, మీకు కావలసిన శక్తిని ఇస్తాడు. ఎటువంటి రోగాలు రాకుండా, చిరాకును కలగకుండా మీరు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గా నవరాత్రుల లో భాగంగా తొలిరోజు శైలపుత్రి గా ఉన్న అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజించండి. తగిన ఫలితాలను పొందండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
During Durga navratri Amma is giving darshan today as Sailaputri. If you know the importance of Sailaputri, the method of worship and the remedies to be done, you can get good results by worshiping the Goddess.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X