• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

navratri fast: దుర్గా శరన్నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి

|
Google Oneindia TeluguNews

నవరాత్రులలో తొమ్మిది రోజుల ఉపవాసం సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చాలామంది సాధారణంగా పండ్లు తీసుకుంటారు. ఉపవాస సమయంలో రోజూ ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. అందులో ఎటువంటి మసాలాలు లేకుండా ఆకుకూరలు, కూరగాయలతో భోజనం చేస్తారు. ఉపవాసం ఉన్నవారు పండ్లను కూడా ఎక్కువగా తీసుకుంటారు. వారు సాధారణ రోజుల్లో కంటే ఉపవాసం ఉన్న రోజుల్లోనే ఎక్కువగా పండ్లను తీసుకోవడం ద్వారా అధిక ఆహారాన్ని తీసుకుంటారు. ఈ సమయంలో శరీరంలో, కేలరీలు, కొవ్వు మరియు చక్కెర మొత్తం ఖచ్చితంగా పెరుగుతుంది.

vastu tips: దుర్గా శరన్నవరాత్రుల ముందే ఇంట్లో ఈ వస్తువులు, పదార్ధాలు బయటపడేయ్యండి!!vastu tips: దుర్గా శరన్నవరాత్రుల ముందే ఇంట్లో ఈ వస్తువులు, పదార్ధాలు బయటపడేయ్యండి!!

ఉపవాసం సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్త

ఉపవాసం సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్త


నవరాత్రుల తొమ్మిది రోజులలో ఉపవాసం చేస్తారు కాబట్టి, ఆహారం తీసుకునే ఒక్కసారి ఆకలి అయిన దానికంటే ఎక్కువగా తింటారు. ఆకలి కంటే ఎక్కువగా తినడం వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు బరువు పెరగడానికి కారణమవుతుంది. నవరాత్రులలో ఉపవాసం ఉండటంతో పాటు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నవరాత్రి ఉపవాసంలో ఏయే ఆహారాలు ఆరోగ్యానికి మంచివో తెలుసుకొని వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుందని, అలా కాకుండా ఇష్టమొచ్చినట్టుగా ఉపవాసం ఉన్నామని ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని చెబుతున్నారు.

ఉపవాస సమయంలో ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోండి

ఉపవాస సమయంలో ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోండి


ఉపవాస సమయంలో శరీరం హైడ్రేషన్‌గా ఉండాలి. దీని కోసం, తగినంత నీరు త్రాగటంతోపాటు, మీరు నిమ్మరసం లేదా కొబ్బరి నీరు వంటి ఇతర ద్రవాలను త్రాగవచ్చు. ఇక పండ్ల రసాలను తీసుకుంటే ఫైబర్ ఉన్న పండ్ల రసాలను మాత్రమే తీసుకోండి. శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు ద్రవాల నుండి అందుతాయి. బయట మార్కెట్లో జ్యూస్ లను తాగడాన్ని నివారించండి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలను మాత్రమే తాగండి. ఇక నవరాత్రులలో ఉపవాస సమయంలో ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోకుండా, డబల్ టోన్డ్ పాలు తీసుకోండి. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

కొవ్వు తక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోండి

కొవ్వు తక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోండి


అదేవిధంగా కొవ్వు తక్కువగా ఉండే పెరుగు, లస్సి, మజ్జిగ ను కూడా తీసుకోవచ్చు. ఇక నవరాత్రులలో ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలను తినడం మానుకోండి. ఉపవాస సమయంలో పండ్లు మరియు కూరగాయల సలాడ్లను తీసుకోవచ్చు. ఆపిల్, దానిమ్మ, బొప్పాయి మరియు అరటి వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాలానుగుణ పండ్లను తగినంత మాత్రమే తీసుకోండి. పుచ్చకాయ, సీతాఫలం మరియు నారింజ వంటి నాన్-సీజనల్ పండ్లను తీసుకోవడం మంచిది కాదని సూచించబడింది.

 ఏది తిన్నా క్రమపద్దతిలో, మితంగా తినండి

ఏది తిన్నా క్రమపద్దతిలో, మితంగా తినండి


ఇక కూరగాయలలో దోసకాయ, టొమాటో, మొదలైన వాటిని తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో, కొంతమంది రోజంతా పండ్లు తింటారు, చాలా మంది రోజులో ఏమీ తినరు. కానీ వారు తినేటప్పుడు, వారు ఆకలి కంటే ఎక్కువగా తింటారు. అసలు తినకుండా ఉన్నా, అతిగా తిన్నా డేంజర్ అని చెబుతున్నారు. కాబట్టి నవరాత్రులలో తీసుకునే ఆహారం ఒక క్రమపద్ధతిలో లిమిట్ పెట్టుకొని తినడం మంచిదని సూచిస్తున్నారు.

ఉపవాస సమయంలో ఆహార మార్పులతో శరీరంపై ప్రభావం.. బీ కేర్ ఫుల్

ఉపవాస సమయంలో ఆహార మార్పులతో శరీరంపై ప్రభావం.. బీ కేర్ ఫుల్


ఇక అంతేకాదు నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారంలో మార్పు వస్తుంది. దీని వల్ల మనసు, శరీరంపై ప్రభావం పడుతుంది. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు నీరసంగా మరియు చిరాకుగా ఉంటారు. అందువల్ల, ఉపవాస సమయంలో, శరీరాన్ని అలసట నుండి రక్షించుకోవాలని, ఎప్పటికప్పుడు కొంత విశ్రాంతి ఇవ్వాలని చెబుతున్నారు. రాత్రి త్వరగా పడుకుని తగినంత నిద్ర పోవాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Many people fast during Durga navratri. They say that there are many dietary rules that all of them have to follow, and if they are not followed, health problems will occur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X