వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవవిధ భక్తి మార్గాలు: భగవంతుడి దరిచేరేందుకు 9మార్గాలు, వీరు ఇలా దగ్గరయ్యారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలోజర్ -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

భగవంతున్ని ప్రసన్నం చేరుకునే మార్గాలు తొమ్మిది రకాలు ఉంటాయి. ఈ తొమ్మిది మార్గాలలో మన పూర్వీకులు ఎవరు ఏ విధంగా భగవంతునికి దగ్గర అయ్యరో చూద్దాం.

1. శ్రవణం( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.

2. కీర్తనం( పాడడం ) చేత నారద మహర్షి తరించాడు.

3 స్మరణం ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లదుడు తరించాడు.

Nine routes to reach god

4 పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు.

5 అర్చణంతో పృధు చక్రవర్తి తరించాడు.

6 వందనం చేత అక్రూరుడు తరించాడు.

7 దాస్య భక్తి (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.

8 సఖ్యం భక్తి చేత అర్జునుడు తరించాడు.

9 ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి తరించారు.

మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.

జీవితంలో దైవనామాన్ని నిరంతరం తరించాలి.

జీవితంలో నీ అంతఃరాత్మకు లోబడి జీవించి తరించు.

జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు.

తత్వ విచారణ చేసి జీవించి తరించు.

యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకోని తరించు.

పూజ పారామార్దం:-పూజ అర్చన జపం.

స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన.... పూజ-పరమార్థాలు:

పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.

జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం అనగా మెళ్ళ మెళ్ళగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం.

దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేక అనగా అహం భావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాన్ని కల్గించేది.

మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అని అంటారు. మంత్ర తత్త్వం వల్ల భయాలు తోలగిపోతాయి.

English summary
The easy way to reach God’s feet is through total surrender, and this is known as saranagati. Easy way to reach God
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X