• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శరన్నవరాత్రులు: అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం, ఎలా చేయాలి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

తేదీ 10 బుధవారం అక్టోబర్ నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. భక్తులు ఎంతో నిష్ట, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులలో దేవీశరన్నవరాత్రులలో అమ్మవారు మనకు ఏ ఏ రూపంలో దర్షణం ఇస్తారు, అమ్మ కొరకు ఏ రోజు ఏ ఏ ప్రసాదములు చేస్తారు, వాటిని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.

1. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. మొదటి రోజు పొంగల్

1. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. మొదటి రోజు పొంగల్

కావలసినవి :-

పెసరపప్పు 150 గ్రాములు, కొత్త బియ్యం 100 గ్రాములు,

మిరియాలు 15 ,

పచ్చి మిరప కాయలు 6,

పచ్చి కొబ్బెర, 1 కప్పు కాచిన నెయ్యి ,1/4 కప్పు

జీడిపప్పు 15

, జీలకర్ర 1/2 టేబల్ స్పూన్,

ఆవాలు 1/4 టేబల్ స్పూన్

,ఎండుమిర్చి 3

,మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్

,కోత్తమిర , కరేపాకు, తగినంత

ఉప్పు రుచిని బట్టి ,

ఇంగువ 2 చిటికెళ్ళు.

చేయవలసిన విధానము:-

దళసరి పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి

పెసర పప్పుని దోరగా వేయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బియ్యం కూడా బాగా వేయించండి తెలుపు రంగు పోకూడదు సుమారు 5 నిమిషాలు

వేపితే చాలు పెసరపప్పు కూడ కలర్ మార కూడదు,

అదే మూకుడులో మరి కాస్త నెయ్యి వేసి

జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చి,పచ్చికొబ్బెర తురిమి , జీలకర, మిరియాలు, వేయించిన బియ్యం,

పెసరపప్పు ఇవన్నీ నాలుగు కప్పుల నీళ్ళతో

కుక్కర్లో వుంచి మూడు విజిల్స్ వచ్చాక ష్టవ్ కట్టివేయండి.

చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,

శనగపప్పు ,జీలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కర్వేపాక్ వేసి తాలింపు పెట్టి మిగిలిన నెయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదము తల్లి త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంపెట్టి

భక్తిగా పూజించి ఈ శరన్నవరాత్రులలో రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .

 2 .గాయత్రి దేవి-రెండవ రోజు పులిహోర

2 .గాయత్రి దేవి-రెండవ రోజు పులిహోర

కావలసినవి :- బియ్యం 150 గ్రాముల

చింతపండు, 50 గ్రాముల

పసుపు1/2 స్పూన్

,ఎండుమిర్చి 5

,ఆవాలు 1/2 స్పూన్

, మినపప్పు 1 స్పూన్,

శనగ పప్పు 2 స్పూన్స్,

వేరు శనగ పప్పు 1/2 కప్పు

,కరివేపాకు 2 రెబ్బలు

, ఇంగువ చిటికెడు ,నూనె 1/4 కప్పు

,ఉప్పు తగినంత

,బెల్లం కొద్దిగా

!! చేయవలసిన విధానం !!

అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి

నాన పెట్టి ,చిక్కటి గుజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్త బెల్లం వేసి బాగా ఉడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చు గుజ్జులో )

ఉడికిన గుజ్జు అన్నంలో కలిపండి .

బాణిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కర్వేపాక్ వేసి అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము

3 . అన్నపూర్ణా దేవి. మూడవ రోజు కొబ్బెరన్నం.

3 . అన్నపూర్ణా దేవి. మూడవ రోజు కొబ్బెరన్నం.

కావలసినవి:- బియ్యం 1/2 కిలో

,తురిమిన పచ్చికొబ్బెర, 1 కప్పు

పచ్చిమిర్చి, 5

కర్వేపాక్ , కొత్తిమీర , ఉప్పు ,పోపు సామాగ్రి ఎండు మిర్చి , ఇంగువ ,

జీడి పప్పు 10,

నూనె 1/4 కప్పు,నెయ్యి 1 టెబుల్ స్పూన్.

చేయవలసిన పద్ధతి అన్నం పోడి పోడిగా వండుకొని పచ్చి కొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలపండి అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చి మిరప కాయలు , కర్వేపాక్ , కొత్తిమీర అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పు కూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .

శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులగుదాం.

 4 .కాత్యాయనీ దేవి. నాల్గవ రోజు అల్లం గారెలు.

4 .కాత్యాయనీ దేవి. నాల్గవ రోజు అల్లం గారెలు.

కావలసినవి :-

మినపప్పు 2 కప్స్,

అల్లం చిన్న ముక్క

,పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

, జీలకర్ర 1/4 స్పూన్,

ఉప్పు రుచికి తగినంత,

కర్వేపాక్ , కొత్తిమీర, తగినంత

నూనె గారెలు వేయించేందుకు

.

చేసే విధానం :- మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .

నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త తినే సోడ వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .

దోరగా వేగిన వడలను , సహస్ర నామాలతో శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి

ఆశీర్వాదం పొందుదాం.

 5 . లలితా దేవి. ఐదవ రోజు దద్ధోజనం ( పెరుగన్నం )

5 . లలితా దేవి. ఐదవ రోజు దద్ధోజనం ( పెరుగన్నం )

కావలసినవి :-

బియ్యం 1/4 కిలో,

పాలు 1/2 లీటర్

చిక్కటి పెరుగు, 1/2 లీటర్

నూనె, 1/2 కప్పు

నెయ్యి, 1 స్పూన్

కొత్తమిర , కర్వేపాకు,

చిన్న అల్లం ముక్క

, పచ్చిమిర్చి

, పోపు సామాగ్రి

, జీడిపప్పు 20

,ఉప్పు , ఇంగువ, ఎండుమిర్చి

.

చేసే విధానం :- ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచిన పాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,

సన్నగా తరిగిన పచ్చిమిర్చి , కొత్తమిర ,తరిగిన అల్లం ,అన్నీరెడిగా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవి వేయండి.రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి చాలా ఇష్టం ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.

6. శ్రీ మహాలక్ష్మిదేవి ఆరవ రోజు రవ్వ కేసరి.

6. శ్రీ మహాలక్ష్మిదేవి ఆరవ రోజు రవ్వ కేసరి.

కావలసినవి :- రవ్వ 1 కప్పు,చక్కర 3/4 కప్పు, నెయ్యి 2 టెబుల్ స్పూన్స్, కేసరి కలర్ చిటికెడు.

యాలకులు 4

,ఎండు ద్రాక్షా 6,

జీడిపప్పు 10,

పాలు 1 కప్పు ( మిల్క్ మేడ్ 1 )

వాటర్ 1/2 కప్పు.

చేసే విధానం :-

ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసివుంచండి .

మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండు ద్రాక్షవేయించి తీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో

కేసరి కలర్ ,చెక్కర , రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో ద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించి నైవేద్యం పెట్టండి

 7 . మహా సరస్వతి దేవి. కదంబం ప్రసాదం ఏడవ రోజు

7 . మహా సరస్వతి దేవి. కదంబం ప్రసాదం ఏడవ రోజు

కావలసినవి:-

కందిపప్పు 1/2 కప్పు

,బియ్యం 1/2 కప్పు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

,1 వంకాయ,

1/4 సొర్రకాయ

,1 దోసకాయ

,బీన్స్ తగినన్ని,

1 ఆలుగడ్డ,

పల్లిలు 2 పిడికిళ్ళు,

2 మొక్క జొన్నలు

,1/2 క్యారెట్,

2 టోమాటో,

తగినంత కర్వేపాకు

, కొత్తిమీర

,తురిమిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

,4 పచ్చి మిర్చి

, నూనె తగినంత

, నెయ్యి చిన్న కప్పు,

చింతపండు గుజ్జు తగినంత

,కాస్త బెల్లం,ఉప్పు , పసుపు తగినంత

,3 చెంచాలు సాంబర్ పౌడర్,

పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము :-

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి

కుక్కర్లో కందిపప్పు ,బియ్యం ,పల్లీలు ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి

పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ కట్ చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి ,కర్వేపాకు ,టొమాటో ,చింతపండు గుజ్జు ,సాంబర్ పౌడర్ వేసి బాగా వుడికిన తర్వాత ఆ గ్రేవి అంతా ఉడికిన బియ్యంలోవేసి కోత్తమీర ,కర్వేపాక్ ,నెయ్యి వేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.

 8. మహిషాసుర మర్ధిని. ఎనిమిదవ రోజు బెల్లం అన్నం.

8. మహిషాసుర మర్ధిని. ఎనిమిదవ రోజు బెల్లం అన్నం.

కావలసినవి :- బియ్యం 100 గ్రాములు,

బెల్లం 150 గ్రాములు,

యాలకులు 5,

నెయ్యి 50 గ్రాములు,

జీడిపప్పు 10

.

చేసే విధానం:- ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .తర్వాత మెత్తగా ఉడికించాలి .

అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగె వరకు ఉడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయడమే .

తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించుకుని అమ్మ కృపకు పాత్రులవుదాం.

9. రాజరాజేశ్వరి దేవి. తొమ్మిదవ రోజు పరమాన్నం.

9. రాజరాజేశ్వరి దేవి. తొమ్మిదవ రోజు పరమాన్నం.

కావలసినవి :- చిక్కటి పాలు 6 కప్స్,1 టిన్ మిల్క్ మేడ్ , బియ్యం 1 కప్పు,

చక్కర 1,1/2 కప్స్

, ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్పు, ఇలాచి పౌడర్ 1/2 స్పూన్

నెయ్యి 5 టేబల్ స్పూన్స్

.

చేసే విధానం :-ముందు గట్టి వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి

. ఆ తర్వాత పాలు , ఇలాచి పౌడర్ వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు ఉంచండి.అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచి అందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి ఉడికిన అన్నానికి చెక్కరవేసి

ఒక్క 5 నిముషాలు మళ్ళీ ఉడికించి అలా ఉడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి అందులో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడి వేడిగా రాజ రాజేశ్వరి దేవికి నైవేద్యం పెట్టండి

.

10. ప్రధాన దేవతను సర్ణాభరణములతో అలంకరణ. పదవ రోజు ఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా నివేదన చేయాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nine types of Naivedyam are offered to goddes Durga during Navaratri. As the nine goddesses to worship differ from place to place and state, Naivedyam also differs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more