వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడికి నైవేధ్యాలు: వాటి ఫలితాలు.. భక్తులు ఎలాంటి ఫలాలను సమర్పించుకోవాలంటే?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

చిన్న అరటి:- నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.

అరటిగుజ్జు :- ఋణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను,
డబ్బు సైతం తిరిగి వస్తుంది.పెండ్లి తదితర శుభ కార్యాలయాలకు సకాలంలో నగదు అందుతుంది. నగదు మంజూరవుతుంది.

Offering to God: prayers with fruits and its results

కొబ్బరికాయ :- పనులు సులభ సాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు.స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి.

సపోటా పండు :- వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి.

కమలా ఫలం :- చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు.

మామిడి పండు :- ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది. ఇష్ట దైనానికి మామిడి పండు అంజూర పండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావంటారు.

అంజూర పండు :- అనారోగ్య సమస్యలు తీరతాయి. స్వల్ప రక్తపోటు ( లో బీపీ ) ఉన్న వారికి మంచిది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారు.

నేరేడుపండు :- నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు.

పనస పండు :- శతృజయం కలుగుతుంది. శత్రవులు, మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి.

యాపిల్ పండు :- సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు.

ద్రాక్షపండ్లు :- దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి.

జామపండు:- సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి.పెళ్ళికాని యువతులతో ముత్తయిదువులకు పసుపు బొట్టు పెట్టిస్తే పెండ్లి ఆటంకాలు సమసిసోతాయి. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది.

English summary
Offering to God: prayers with fruits and its results: In Indian culture, common practice to offering Naivedyam to god very worship ritual. It means fruits offered to a Hindu deity as part of a worship ritual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X