వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృదేవతల పూజ: మహాలయ పక్షము.. దాని ప్రత్యేకత..

రోమను జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృదేవతల పూజకు నిర్దిష్టమై వుండేది.

|
Google Oneindia TeluguNews

మహాలయ పక్షము (పెద్దలకి బియ్యం ఎందుకిస్తారు)

పితృపక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటూరు.

పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినము వ్యక్తులకు సంబంధించింది. మహాలయ పక్షము సాముదాయకంగా పితాళ్లను పూజించడానికి ఏర్పడింది. రోమను జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృదేవతల పూజకు నిర్దిష్టమై వుండేది.

ఆనాడు వారు రోమనగరం దగ్గర గల కొండలలో ఒక కొండ విూద పెద్ద గొయ్య తవ్వేవారు. పితాళ్లు భూమి క్రింద వుంటారని వారి నమ్మిక. కావుననే గోతుల్లో బలి అన్నం వుంచే ఆచారం వారు అవలంబించారు. వివాహాలు కాని, వ్యాపారం కాని చేయడానికి అది అశుభదినమని వారి నమిక.

Pitru Paksha 2017: Significance, tithi and all you need to know

మనలో కూడా ఈ దినాల్లో శుభ శోభనాలు జరపరు. మన శాస్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్దాలని చెప్పబడింది. ఆ తొంభైఆరు శ్రాద్దాల్లోనూ ఈ పితృపక్షం ముఖ్యం. శ్రాద్దదినం నాడు కర్మ చేసేవాడు శ్రాద్దం పూర్తి అయ్యే వరకు ఉపవసిస్తాడు.

తండ్రి బ్రతికి వుండగా తల్లిని కోలుపోయినవాడు భాద్రపద కృష్ణ పక్ష నవమినాడు తల్లిశ్రాద్ద కర్మచేస్తాడు. ఇది చేయడానికి సుమారు ఒక గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసేవాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై వుంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి.

ఇక తండ్రికి చేసే శ్రాద్ద కర్మను గురించిన వివరాలు తెలుసు కోవాలి
భూమి మిూద ధావళీ పరుచుకుంటాడు. దాని మిూద దక్షిణ ముఖంగా కూర్చుంటాడు. పట్టుగుడ్డపోచ ఉత్తరీయంగా వేసుకుంటాడు. అది ఒక అంగుళం వెడల్పూ, యజ్జోపవీతమంత పొడుగూ ఉంటుంది.
యజమానికి దగ్గరగా పురోహితుడు కూర్చుంటాడు.

పురోహితుడు యజమానికి దర్భ ఇస్తాడు. దానిని యజమాని తన వెంట్రుకకు మడివేసుకుంటాడు. కూర్చుండే ధావళీ విూద ఒక దర్బను ఉOచుకుంటాడు. దర్భతో చేసిన ఉంగరం తన అనామికకు పెట్టుకుంటాడు. దర్భలో చేసిన అట్టి వంగరమే యజ్జోపవీతానికి ఒకటి.పైన చెప్పిన ఉత్తరీయానికి ఒకటి కట్టు కుంటూడు.

తరువాత పురోహితుడు శ్రాద్ధకర్మ ప్రారంభిస్తాడు.
యజమానికి ఎదురుగా అయిదు అరిటి ఆకులు పరుస్తాడు. రాగి దర్భ పుల్ల, ఇతర వస్తువులు వుంచుతాడు. ఐదు విస్తళ్లనూ ఆఫ్రూణించడానికి ఐదు గురు పితృదేవుళ్లు వస్తారు. మొదట వచ్చేవాడు యజమాని తండ్రి, అతని తాత, ముత్తాతలు, తల్లి పూర్వీకులకు ఒక ఆకు ఇట్లే ఇతర ఆకులు.

మరి మూడు విస్తళ్లు కూడా వేస్తారు. అందులో ఒకటి విష్ణుపాదమనేది విష్ణువు కొరకు. మిగతా రెండూ విశ్వదేవుల కొరకు. ఇలా పిత్రుదేవతలకి ప్రీతిగా తద్దినం చేయలేనివారు బియ్యం బ్రహ్మనుడికి ఇస్తారు.

English summary
Pitru Paksha also spelt as Pitri Paksha is a 16-lunar day period when Hindus pay homage to their ancestors through shradh prayers and food offerings. It falls in the lunar month of Bhadrapada beginning on the full moon day or the day after full moon day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X