• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆగస్టులో గ్రహాల స్థానమార్పు - ఆదివారం అమావాస్య, పుష్యమి నక్షత్రం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆగస్టు నెలలో 4 గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. అవి 1. మేషరాశి, 2. వృషభరాశి, 3. సింహరాశి, 4. కన్యారాశి, 5. తులారాశి. ఈ ఐదు రాశులపై గ్రహ ప్రభావం చూపనున్నాయి. కొన్ని రాశులకు సానుకల ఫలితాలు ఉంటే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆగస్టు మాసం చాలా ముఖ్యమైన నెల.

* బుధుడు ఆగష్టు 8 తేది ఆదివారం రోజు రాత్రి 1:33 నిమిషాలకు మఖ నక్షత్రం మొదటి పాదం సింహంలో రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు.

* శుక్రుడు ఆగష్టు 11 వ తేదీ బుధవారం రోజున మధ్యాహ్నం 11:32 నిమిషాలకు ఉత్తర నక్షత్రం 2 పాదం, కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

Planets change their position in the month of August, Know which planet will change position

* సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలో మఖ నక్షత్రం 1 పాదంలో ఆగష్టు16 సోమవారం రోజు రాత్రి 1:17 నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశించ నున్నాడు.

* బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 2 వ పాదంలోకి ఆగష్టు 26 మధ్యాహాన్నం 11:19 నిమిషాలకు ప్రయాణం చేయనున్నాడు.

* 8 తేదీ ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రంతో కలవడం అనేదాని గురించి గమనిస్తే ...

* ఆదివారానికి అధిపతి మనకు కనిపించే ప్రత్యక్ష సూర్య నారాయణుడు 'సూర్యుడు' ఆత్మకారకుడు.

* అమావాస్య తిధికి అధిదేవత పితృదేవతలు - ( పిన్నమ్మలు ) సంతాన సౌఖ్యం.

* పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. శని సూర్యుని పుత్రుడు. రవిని శని శత్రువుగా భావిస్తాడు. కారకత్వం :- ఆయు:కారకుడు, విరోధములు, కష్ట, నష్టాలు, సేవకత్వం, దురాచారం, మూర్ఖత్వం,అవమానాలు, రాజదండనం మద్యపానం మొదలకు ఫలితాలకు ప్రేరకుడు అవుతాడు.

* గోచారరిత్య ఏలినాటి శని నడుస్తున్న ధనుస్సు, మకర, కుంభ రాశులు. అర్దాష్టమ శనితో తులారాశి వారికి, అష్టమ శని నడుస్తున్న మిధున రాశి వారికి వారి వారి వ్యక్తిగత జాతక దశాంతర్ధశలను బట్టి గ్రహాల స్థితులు, దృష్టుల బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

* ఆకాశంలో రవిమార్గంలో సంచరించే వానినన్నింటిని మనం గుర్తిస్తున్నాం. కానీ ఖగోళశాస్త్ర రిత్య అవన్నీ గ్రహాలు కాదు. వానిలో
సూర్యుడు - నక్షత్రం,
చంద్రుడు - భూమికి ఉపగ్రహం,
రాహు, కేతువులు - ఛాయాగ్రహాలు,
బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురువు, శని ఇవి గ్రహాలు.
యురేనస్ ( ఇంద్ర) , నెప్ట్యూన్ ( వరుణ), ప్లూటో ( యమ) వీటిని పాశ్చ్యాత్యులు కనుగున్నారు.

అమావాస్య రోజు రవి, చంద్రులు ఒకే డిగ్రీలో ఉండడం వలన అమావాస్య ఏర్పడుతుంది, ఆరోజు రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి అయిన అమావాస్య రోజున సూర్య గ్రహణాలు సంభవిస్తాయి. పురాతన బాబిలోనియా, గ్రీకు, భారతీయ క్యాలెండర్లలో తిథులు అని పిలువబడే 30 చంద్ర దశలను ఉపయోగించాయి. చంద్రుడు కనిపించని తిథి అంటే సూర్యుడు, చంద్రుల మధ్య 12 డిగ్రీల కోణీయ స్థానబ్రంశం లోపల (సంయోగం) ఉన్నప్పుడు సంభవిస్తుంది.

అమావాస్య అర్థం:- సంస్కృతంలో 'అమ' ఆనగా కలసి, 'వాస్య' అనగా నివసించడానికి లేదా సహవాసం అని అర్థం. వేరొక విధంగా 'న' + 'మ'+ ' అస్య' అనగా 'న' = లేదు, 'మ' = చంద్రుడు, అస్య = అక్కడ అని అర్థం. దీని ప్రకారం చంద్రుడు లేని రోజు అని అర్థం. అనగా ఆ రోజు చంద్రుడు కనబడడు.

*నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం.
నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
పుష్యమి శని దేవ స్త్రీ మేక పిప్పిలి మధ్య నీరుకాకి భృహస్పతి కర్కాటక

*పుష్యమి నక్షత్రము గుణగణలు
పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర స్వభావ రిత్య ఫలితం మానవుడు నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక మార్గములో అభ్యున్నతి సాధిస్తారు.

ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కారణంగా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కనబడతాయి.
​1. మేషరాశి
2. వృషభరాశి
3. సింహరాశి
​4. కన్యారాశి
5. తులారాశి

* ఈ ఆగస్టు మాసంలో కొన్ని గ్రహాలు రాశులు మారడం వలన కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. నాలుగు గ్రహాల రాశి పరివర్తనం వల్ల ఏయే రాశులకు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

1) * ** మేషరాశి:- మేషం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశి ప్రజలు ఆగస్టు మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు సోదరులతో విభేదాలు కలిగి ఉండే అవకాశముంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది కాకుండా మీరు ఈ నెలలో ఖర్చును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మీ చేతుల్లో డబ్బు నిలువదు. ఏదోక కారణంగా మీ మనస్సు ఈ నెలలో చంచలంగా మారుతుంది.

మనస్సు చెదిరిపోతుంది. మానసిక ప్రశాంతత లోపించవచ్చు. అధిక పని వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో మీ సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కొన్నిసార్లు మీ ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. దాన, ధర్మాలు చేస్తారు. విద్యార్థులు గొప్ప విజయాన్ని పొందుతారు. ఇంట్లో తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నిరంతరం కుటుంబ వివాదాలు కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం చెదిరిపోవచ్చు.

2) *** వృషభరాశి:- శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ జీవితంలో గందరగోళంగా గడుపుతారు. అనేక రకాల అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత మీ పని పూర్తవుతుంది. ఈ నెలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు లాభాలు పొందాలని చూస్తున్నట్లయితే ఆశిస్తున్న వస్తువులను కోల్పోయే అవకాశముంది. కష్టపడిపనిచేస్తేనే మీకు ఏదైనా లభిస్తుంది.

ఇంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడులు ఈ నెలలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తే భాగస్వాముల నుంచి వ్యతిరేకత ఉండవచ్చు. మీకు వచ్చే నూతన అవకాశాలను ఉపయోగించుకోవడానికి భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఉద్యోగులు స్వల్ప ప్రయాణాలు చేసే అవకాశముంది. ఇది మీకు సానుకూల ఫలితాలను కలిగిస్తాయి. ఈ నెలలో ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు కోసం బయటకు వెళ్లే అవకాశముంది. మీ బడ్జెట్ ను నియంత్రణలో పెట్టుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడవచ్చు. ఇది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

3) మిథునరాశి:- ఈ నెలలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నూతన కెరీర్ అవకాశాలను అన్వేషించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీరు ప్రాజెక్టులను చక్కగా నిర్వహిస్తారు. మీ బృందాన్ని సునాయసంగా నడిపిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే అనుకూలంగా ఉండదు. కొన్ని సార్లు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని కలవరపెడుతుంది. అయితే ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. ప్రశాంతంగా ఉండటానికి మీ అభిరుచులై దృష్టి పెట్టండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు బరవు పెరిగే అవకాశముంది కాబట్టి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

English summary
Planets change their position in August according to Astrology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X