వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రమణ మహర్షి జయంతి: చలం మాటల్లో ఆయన వ్యక్తిత్వం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆధ్యాత్మికవేత్త శ్రీ రమణ మహర్షి జననం 30 డిసెంబరు 1879 - నిర్యాణము 14 ఏప్రిల్ 1950. తలిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్ ఇతను ఒక భారతీయ ఋషి. రమణులవారు తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు. వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే "స్వీయ శోధన" ఉత్తమమని ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మన:స్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

Ramana Maharshi Birthday today

జననం వివరాలు :-

వెంకటరామన్ అయ్యర్
1879 డిసెంబరు 30
తిరుచుళి, విరుధు నగర్.

శివైక్యం చెందిన రోజు
14 ఏప్రిల్ 1950 ( 70 సం.రాల వయస్సు )
శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై, తమిళనాడు.

కుటుంబ నేపథ్యం :- శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం పునర్వసు నక్షత్రములో జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు నాగస్వామి, నాగ సుందరం. ఒక సోదరి అలమేలు. సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

బాల్యం:- పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు ( సుబ్బాయ్యర్ ) వెళ్ళాడు. రమణులు తన చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు,అంతటి గాఢ నిద్రావస్తాలో ఉండేవారు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది.

రమణ గారి తండ్రి చనిపోవడం వల్ల సుబ్బయ్యర్ గారు నాగస్వామి ( రమణ గారి అన్నయ్య ) రమణలను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళి వస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుండి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుండి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేసాడు.

బోధనలు:- స్వీయ - శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

శ్రీ రమణ మహర్షి శిష్యులు :- కావ్యకంఠ గణపతిముని, యోగి రామయ్య

భగవాన్ గురించి చలం :- భగవాన్ బోధించే వేదాంతమూ ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ లోకం మీద ఆయనకు ఉన్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను ఒప్పుకుంటాను. నాకు స్త్రీ ఉంది. మీకు దేవుడున్నాడు. స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ , డబ్బూ కాదు - అంతకన్న శ్రేష్టమైనవి - జీవితం మీద ఆసక్తినీ - శక్తినీ - బతకడంలో ఆనందాన్నీ పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వివేకవంతునిగా తోస్తాను.

చలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్. ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంత వరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలా మంది కనపడరు. భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు. రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది.

ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో కవి హృదయంలోనో అలావుంది లోకం నాకు ఇప్పుడు ఆశ్రమం పిశాచం వలె, ఒక కలలాగా ఉంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా ఒంటరితనం. మా వాళ్ళు 15 రోజుల కిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ ఉన్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో ఉన్నాను .

ఎవరైనా తిరువణ్ణామలై దర్శించినంత మాత్రాననే అక్కడ భూమికి ఉన్న మహాత్తరమైన ధ్యాన శక్తి వలన, ప్రతి కొండలో నుండి ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేస్తున్న భావనను మనం స్వతహాగా అక్కడ నడయాడితే తెలుస్తుంది,ఆద్యాత్మిక చింతన ,మానసిక సంతృప్తి కలుగుతుంది. అనితర సాధ్యమైన ఈ స్థలం దర్శించే యోగ్యం ఉడటం కుడా ఓ వరమే.

English summary
Ramana Maharshi Birthday today, on this occasion, Chalam view about most spiritual guru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X