వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!

రథసప్తమిని సూర్యుడి జన్మదినంగా పరిగణిస్తారు. అందుకే రథసప్తమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి, రోగ పీడ నుండి విముక్తి దొరుకుతుందని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

మానవుల జీవితంపై సూర్య భగవానుడి ప్రభావం ఎంతో ఉంటుంది. సూర్యుడి కరుణ మనపై పుష్కలంగా ఉంటేనే ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాం. అటువంటి సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో, ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

రథ సప్తమి తిధి ఇదే.. ప్రాశస్త్యం ఇదే

రథ సప్తమి తిధి ఇదే.. ప్రాశస్త్యం ఇదే

రథసప్తమిని సూర్యుడి జన్మదినంగా పరిగణిస్తారు. అందుకే రథసప్తమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి, రోగ పీడ నుండి విముక్తి దొరుకుతుందని చెబుతున్నారు. రథసప్తమిని మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. సాధారణంగా రథసప్తమి వసంత పంచమి వేడుక తరువాత వచ్చే సప్తమి నాడు వస్తుంది. ఇక ఈ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష సప్తమిలో రథసప్తమి తిధి వచ్చింది. ఈ సంవత్సరం రథసప్తమిని జనవరి 28, శనివారం నాడు అంటే రేపు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. రథసప్తమి తిధి ఈ సంవత్సరం జనవరి 27వ తేదీ ఉదయం 9:10 నిమిషాల నుండి జనవరి 28 రాత్రి 8 గంటల 43 నిమిషాల వరకు ఉంటుందని చెబుతున్నారు.

రథసప్తమి నాడు ఈ సమయంలోనే స్నానం .. పూజ ఇలా

రథసప్తమి నాడు ఈ సమయంలోనే స్నానం .. పూజ ఇలా

రథసప్తమి తిధి నాడు ఉదయం 5 గంటల 26 నిమిషాల నుండి 7 గంటల 12 నిమిషాల వరకు, ఒక గంట 46 నిమిషాల పాటు స్నానమాచరించి, సూర్య భగవానుడికి విశిష్ట పూజలు చేయాల్సి ఉంటుంది. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది సరైన సమయమని ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని ఎర్రటి పువ్వులను వేసి, సూర్యుడికి సమర్పిస్తే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు.

సూర్యుడి దయ ఉండాలంటే రథ సప్తమి నాడు ఈ పని చెయ్యండి

సూర్యుడి దయ ఉండాలంటే రథ సప్తమి నాడు ఈ పని చెయ్యండి

ఇక అంతే కాదు సూర్యుడు దానధర్మాలు చేస్తే ప్రసన్నమవుతారని, రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణుడికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని దానం చేయాలని చెబుతున్నారు. జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉండటం కోసం దానధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. రథసప్తమి ప్రాశస్త్యాన్ని చెప్పుకున్నట్లయితే రథసప్తమి నాడు సూర్యుని పూజించడం వల్ల, ఆరోజు ఉపవాసం ఉండడం వల్ల ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. శరీరం ,మనసు అన్ని పవిత్రంగా మారుతాయి.

రథ సప్తమి నాడు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఇదే

రథ సప్తమి నాడు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఇదే


సూర్యోదయానికి ముందు వచ్చే అరుణోదయ కాలంలో తల స్నానం చేసి సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి సూర్యుడు పుట్టిన ఈ రోజును ఆరోగ్య సప్తమిగా కూడా చెప్పుకుంటారు. రథసప్తమి నాడు ఇంట్లో కంటే ఎక్కడైనా నదులలో స్నానం చేస్తే, అర్ఘ్య దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.

సూర్యుడి కరుణ కోసం కచ్చితంగా ఇలా చెయ్యండి

సూర్యుడి కరుణ కోసం కచ్చితంగా ఇలా చెయ్యండి

చక్కగా స్నానం చేసి, సూర్యుడికి నీటిని నివేదించి నమస్కార ముద్ర తో సూర్య భగవానుడిని నిష్టగా పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి, సూర్యుడికి ఎర్రటి పువ్వులతో, అగరబత్తీలు కర్పూరంతో పూజలు నిర్వహించి, దానధర్మాలు చేసి, ఉపవాస దీక్షను ఆచరిస్తే దీర్ఘాయుష్షును పొందడంతో పాటు, సంతోషంగా జీవించడానికి ఆ సూర్యుడు దయ కలుగుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!

English summary
On Ratha saptami, bath, worship, donate and fasting to please the sun. Health and all success will be yours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X