వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాల నుండి గట్టెక్కించే హనుమాన్ పూజ పరిహారాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||

భావము:- మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.

Remedies for Hanuman Puja to get rid of hardships

ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా ఆరాధన చేయాలి. గుడి దగ్గర ఉన్న రావి చెట్టుకు "11" ప్రదక్షిణలు నిదానంగా తిరుగుతూ 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటూ స్మరించుకోవాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. ప్రమిద భూమిపై పెట్టకుండా రావి ఆకు వేసి దానిపై పిండితో తయారు చేసిన దీపాన్నిపెట్టి కుంకుమ, పూలతో అలంకరించి వెలిగించాలి. ఇందులో సూచించినట్లుగా పిండితో చేసిన ప్రమిదలో కొంచం బెల్లం వేసి దానిపై వత్తి వేసి నునే పోసి పూజ చేయాల్సి ఉంటుంది.

1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు ఆవనూనెతో దీపారాధన - ఆరోగ్యం

2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం - ఈ ఐదింటిని పిండి చేసి దీపప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

7. దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.

8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి.
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే, తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని యథాశక్తి శ్రీరామ నామ జపం చేయాలి.

9. ఈ పూజ చేస్తున్నన్ని రోజులు తలిదండ్రులకు, గోమాత ప్రదక్షిణ చేయడం మరువవద్దు, అలాగే పశు పక్ష్యాదులకు, పేద వారికి తోచిన సహాయం చేయాలి. శాంతంగా వ్యవహరిచాలి.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

భావము:- ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు జై శ్రీమన్నారాయణ.

English summary
Lord Hanuman should be worshiped as a rule for 41 days. The "11" circumambulations to the Ravi tree near the temple should be done by slowly turning and Chanting 'Om Namo Bhagwate Vasudevaya'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X