గ్రహదోష నివారణకు గోపూజ

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Remedies for problems: Gau Pooja for Graha Dosha Nivaran

మానవులుగా పుట్టిన జీవనం కోనసాగిస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలు, అంతరాయలు, అనారోగ్యాలు, అవమానాలు ఇలా ఎన్నో ఇబ్బందులను చవిచూసుకుంటూ జీవితం సాగుతుంటుంది. కొన్ని సందర్భములలో తట్టుకోలేని భాదలు అనుభవిస్తున్నప్పుడు మనస్సుకు జీవితాన్ని భారంగా భావించడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో గ్రహదోష నివారణకు గోపూజ అద్భుతంగా పని చేస్తుంది.

గోపూజ అంటే గోవుకు ఆహారాన్ని తినిపించటమే. ఉదాహరణకు అష్టమశని, అర్థాష్టమశని, ఏలినాటిశని, శనిదశ జరుగుతున్నవారు గోచారరిత్య గ్రహభాదలతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం లేదా వసతినిబట్టి గోవుకు ఆహారంగా కనీసం అరకిలో బెల్లం మరియు తోటకూరతో కలిపి - 19 వారాలు క్రమం తప్పకుండా సమర్పించినట్లైతే మంచి ఫలితాలు కలుగుతాయి.

గోమాత అంటే లక్ష్మీదేవితోపాటు క్షీరసముద్రంలో పుట్టినది. దత్తాత్రేయుని వెనక వైపు గోమాత ఉంటుంది.
గోమాతతో పెట్టుకుని మహావీరుడు కార్తవీర్యార్జునుడే వంశాన్ని నాశనం చేసుకున్నాడు. గోదావరి పుట్టుకకు కారణం అయింది గోమాత.
శ్రీక్రృష్ణ పరమాత్మ గోవులను కాయటాన్ని వ్రృత్తిగా ఎంచుకున్నాడు.

అత్యంత రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు గోవుల కోసం బయట పడటానికి కూడా సిద్ధపడ్డారు. గోమాత కారణంగానే మొదటగా వేంకటేశ్వరస్వామి లోకానికి తెలిసారు. శ్రీమద్ విరాట్ పోతులూరి
వీరబ్రహ్మేంద్రస్వామి వారు గోవులను కాస్తూనే మొదటిగా తన దైవత్వాన్ని,మహిమలను తెలియజేశారు.

అనేక పుణ్యక్షేత్రాల స్థలపురాణాలతో గోమాతకు బంధం ఉంటుంది. గోవు పాదం మోపనిదే గ్రృహప్రవేశానికి అర్థం లేదు. అంతెందుకు క్రృత,త్రేతా,ద్వాపర యుగాలలో క్రౄరమైన రాక్షసులు సైతం సాధారణంగా గోమాత జోలికి పోయినట్టు ఆధారాలు లేవు లోకపాలకుడు మహావిష్ణువు ఉండే చోటు వైకుంఠం అది అన్ని లోకాలలోకెల్ల ఉన్నతమైనది కాగా ఆ వైకుంఠం కన్నా పైన ఉన్నది గోలోకం అని శాస్త్రాలలో చెప్పబడినది.గోవును పూజించిన వారు వాటికి సేవ చేసిన వారు ఎంతో పుణ్యం పోందారు అని మనకు ఇతిహాసాలు తెలియ జేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+