వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనిగ్రహ దోషాలు నివారణకు ఏం చేయాలి?

|
Google Oneindia TeluguNews

2 ఫిబ్రవరి 2019 శనివారం రోజు శని త్రయోదశి. గోచారరిత్య అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నవారు శని దేవున్ని ఈ రోజు ప్రసన్నం చేసుకుంటే శుభం కలుగుతుంది. శని గ్రహ దోషాలు తొలగిపోవాలంటే కోతులకు అరటి పండ్లు ఇవ్వాలి. శనివారం నాడు శనిదేవుని మంత్రాలను జపించడం శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలి. నల్లని వస్త్రాలు, నల్లని వస్తువులు దానం చేయటం మంచిది.

తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు.శనివారం నాడు శని మంత్రాలను జపించి నీలమణిని ధరించుటవలన శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది. వస్త్రాలు ,ఇనుము,తోలుకు సంబంధించిన వస్తువులు, దానం చేయటం మంచిది.

Remedies for Shani Dosham: Shani Dosha Nivaran Puja

అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహ దోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రభావాలుంటే తప్పకుండా శనివారం రోజు శనీశ్వరునికి అర్చన చేయించాలి. శని శాంతించడానికి పేదవరికి ఏదో రూపంగా సహాయ సహకారాలు అందించాలి.శనీశ్వర ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు తొలగిపోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధన, అయ్యప్ప స్వామి దర్షనం చేయాలి. ఇవి చేస్తే శనిగ్రహ దోషం కొంత తగ్గుముఖం పడుతుంది.జాతకరిత్య మీ నక్షత్రానికి శని గ్రహ ప్రభావాన్ని బట్టి నీలం రత్నాన్ని ధరించడం ద్వారా శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు.

శని త్రయోదశి రోజు శనిదేవునుకి అభిషేకం చేయాలి.శనివారం నువ్వులనూనెను తలకు, శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి. శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి. బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్ళను కడుక్కోవాలి. ముఖ్యంగా శనివారం కోతులకు అరటిపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయని శాస్త్రసూచనలు.

శనీశ్వరుడు శాంతి చెందాలంటే పేదలకు,పెద్దలకు,అవిటి వారికి,పశుపక్షాదులకు సాటివారికి సహాయపడితే శని దేవుడు శాంతించి శుభఫలితాలు ఇస్తాడు.కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు.అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవని పెద్దలు చెబుతుంటారు.

--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151

English summary
Remedies for Shani Graha Dosham. What is Shani Dosha Nivaran Puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X