వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్మ సమస్యల్ని అరికట్టె సబ్జా గింజలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మండే ఎండాకాలములో అనేక దాహం,శరీర తాపం దీనికి పరమౌషదం సబ్జా గింజలు వీటిని నీళ్లలో వేసుకుని తాగుతే ఎన్నో లాభాలున్నాయి. ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతుంది. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది. వీటితో పాటు ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో చూద్దాం.

1. సబ్జా గింజల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా -3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

Sabja nuts that prevent skin problems

2. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు.

3. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరి నీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు.

4. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.

5. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.

6. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.

7. జిగురులా ఉండే ఈ సబ్జాగింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.

8. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

10. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.

11. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

12. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

13. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

14. బీపీ తరచూ పెరుగుతోందా..? అయితే వీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

పూర్వ కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుత కాలంలో చాలా మందికి వీటి గురించి తెలియక వాడటం లేదు, దీనికి అంతటికి కారణం మనం మన పెద్దల మాట వినక పోవడం పాశ్చ్యాత వంటలకు, ఫాస్ట్ ఫుడ్ మోజులో పడి మన ఆరోగ్యాన్ని కాపాడే వాటికి దూరమై, ఆనారోగ్యం చేసే వాటికి దగ్గరౌతున్నాం. సనాతన భారతీయ సంస్కృతిలో మానవులకు, ప్రకృతి మేలు చేసే పద్దతులే ఉన్నాయి. ఈ మే నెలలో రోహిణి కార్తె మే 25 నుండి ప్రారంభం అవుతుంది. ఎండలు ఎక్కువగా ఉంటాయి శరీర తాపం పెరిగితే అలర్జీ కలిగించే చమటకాయ, కురుపులు, మొటిమెలు, అగిర్త మొదలగునవి రాకుండా ఈ సబ్జాలు త్రాగడంతో అరికట్టవచ్చును.

English summary
Sabja nuts that prevent skin problems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X