వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరన్నవరాత్రులలో సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు

|
Google Oneindia TeluguNews

సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి. ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి.శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు

1) భారతి
2) సరస్వతి
౩) శారద
4) హంస వాహిని
5) జగతీ ఖ్యాత
6) వాగీశ్వర
7) కౌమారి
8) బ్రహ్మ చారిణి
9) బుద్ధి ధాత్రి
10) వరదాయిని
11) క్షుద్ర ఘంట
12) వీనాపాణి,పుస్తకధారిని

భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. 'విద్య వినయేన శోభతే' అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా వుండాలని దీని భావం. ఈ విద్యను ప్రసాధించే సర్వతీదేవికి హంస వాహనంగా ఉంటుంది. అలా ఉండటంలో, చదువుకు మద్య ఉన్న పరమార్థం మేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సరస్వతి దేవి వాహనం హంస- సరస్వతి దేవి వాహనం హంస- పాలు , నీరు కలపి హం ముందు పెడితే హంస నీటిని వేరుచేసి పాలను మాత్రమే తాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.

Saraswati Ashtottara Namas, puja during Devi Navaratrulu

ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి చెడును విసర్జించే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా దేవి సందేశమిస్తోంది.. నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచములో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు.

సరస్వతీదేవి అలాంటివారినే ఆదరిస్తుంది.కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది. విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునే వారు తప్పక సరస్వతీదేవిని ప్రార్ధించి అనుసరించాలి. హంస అంటే ఊపిరి, హంస అంటే ఊపిరి, మనం విశ్వాస నుంచి ''స:''అనే శబ్దం అని వెలువడుతుంది. బయటనుండి లోపలికి ప్రవేశించే ప్రాణ వాయువు ఉచ్చ్వాశం ''అహం'' అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకూ ఈ జపం జరుగుతూనే ఉంటుంది.

విద్యకు అధిదేవత సరస్వతి దేవి.సరస్వతి అన్న పదం కూడా రెండు పదాలనుండి వచ్చింది. సర: అంటే సారము అని, స్వ: అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ దేవి అయ్యింది.

ప్రత్యేకంగా సరస్వతీ పూజ విధానం గురించి చెపప్పుకుందాం :- మూలా నక్షత్రం, సప్తమినాడు వచ్చిన రోజున చేయ వలసింది ఈ పూజ. వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేని స్థితులలో ఇంటిలో సరస్వతీ అమ్మవారి పటం ఏర్పాటు చేసుకుని పూజించ వచ్చు.సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్ల వస్త్రాలు, లేదా పట్టు బట్టలు ధరించాలి. అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలు పెన్నులు పెట్టి అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలి.

చదవ వలసినవి శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వతః శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మేసర్వదా వతు ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్ ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్షః సదా వతు ఓం హ్రీం హేతి మమహస్తౌ సదావతు ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశిరక్షతు ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రోనైరృత్యాం సర్వదావతు ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాంవారుణే వతు ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధోమాం సదావతు ఓం గ్రంధబీజస్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు

సహస్ర నామాలు చదువుతూ పూజించాలి . నైవేద్యం - క్షీరాన్నం, పాలతో బెల్లం నైయ్యివంటి పదార్థాలు కలిపి చేసినవి నివేదించాలి, చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు. నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, సెనగలు వంటి పదార్తాలు చాలా మంచి ఫలితాలు ఇచ్చే నైవేద్యాలు. ప్రదక్షిణ, స్తోత్రాలు. వీలైనంత వరకు చేయాలి.

English summary
Durga Mata decorated in nine avatars during the Devi Navaratrulu. Ninth day of Maharnavami is the specialisation for devotess to celebrate Parvati devi pujas and Saraswati puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X