వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ రోజు ఏ దేవుడిని కొలవాలి ? ఐశ్వర్యప్రాప్తి కోసం ఏం చేయాలి ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

వారానికి ఏడు రోజు కధ ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం సిద్ధిస్తుంది తెలుసుకుందాం.

ఆదివారం రోజు సూర్యున్ని పూజించడం ద్వారా ఆయుర్దాయం, ఆరోగ్యం పెరుగుతుంది. వ్రతమాచరించడం ద్వారా అనారోగ్య సమస్యలు, వ్యాధులను నయం చేసుకోవచ్చు. యోగాలో సూర్య నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

select a time for praying god and pray

సోమవారం రోజు వ్రతమాచరించడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ప్రశాంతత చోటుచేసుకుంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

మంగళవారం రోజు వ్రతమాచరించేవారికి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. కుజదోషాలు తొలగిపోతాయి. మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి.

బుధవారం రోజు వ్రతమాచరించడం ద్వారా విష్ణు మూర్తిని పూజించడం ద్వారా బుద్ధి వికాసం, వాక్చాతుర్యత పెంపొందుతుంది. బుధవారం నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆయనకు పానకం, వడపప్పు సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు వుంటాయి. వ్యాధులు దూరమవుతాయి.

గురువారం రోజు వ్రతమాచరించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. గురువారం నవగ్రహాల్లో ఒకరైన గురు భగవానునికి అర్చన చేయడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆయనకు శనగలను సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం రోజు పూట అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయంలోని అమ్మవారికి పూజ చేసి, పాయసం, వడలను నైవేద్యంగా సమర్పించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం వ్రతమాచరించడం ద్వారా దంపతుల ఆయుర్దాయం పెరుగుతుంది.దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

శనివారం రోజు ఈ రోజునకు శనీశ్వరుడు అధిపతి. అందుచేత శనివారం పూట శివాలయంలోని శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించారు. శనివారం హనుమంతునికి నేతి దీపం వెలిగించవచ్చు. నారాయణునికి తులసీమాలను శనివారం సమర్పించే వారికి ఈతి బాధలంటూ వుండవని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తారు .

English summary
Let's see what the seven day story of the week reveals any god to worship any day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X