• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనిషికి మనిషే భరోసా... వీలైతే సాయం చేద్దాం.. ఆ పుణ్యం మన పిల్లలకే దక్కుతుంది

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పుట్టినప్పుడు ఏమి లేకుండానే పుడతాము. కాలం తీరి పోయేనాడు ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్న ఏమి తీసుకువెళ్ళలేము. ఎవరు ఎపుడు ఎలా పోతారో ఎవరికీ తెలియదు. ఉన్నన్ని నాల్లైన మానవత్వంలో దైవాత్వాన్ని ఇముడ్చుకుని సాటి వ్యక్తులకు వారి కష్ట సుఖాలలో భారోసానిద్దాం, బాసటగా నిలుద్దాం, చేతనైన సహాయం చేద్దాం. ఎవరో ఒకరు మనకు ఎదో ఒక సహాయం, ధైర్యాన్ని ఇవ్వనిదే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉండగలమా అనే ఆత్మవిమర్శ చేసుకుందాం.

 మనిషికి మరో మనిషి భరోసా ఇవ్వాలి..

మనిషికి మరో మనిషి భరోసా ఇవ్వాలి..

అనగనగా ఒక పిరికి వాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగి... కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు... ఇంతకీ ..ఆ రెండో వ్యక్తి కూడా వీడి కన్నా పిరికివాడట!...కాని కేవలం వాడికి వీడు.. వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.నిజ జీవితంలో కూడా మనిషికి 'ప్రతి వ్యక్తికీ' కావాల్సింది అలాంటి భరోసానే... నేను ఉన్నాను అనే భరోసా... ఒక మాట సాయం... ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు.. సాటి మనిషికి ఎంత బలం వస్తుందో.. ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు. నీవు ఇచ్చిన మనో ధైర్యాన్ని తను బ్రతికి ఉన్నన్ని నాళ్ళు గుర్తుచేసుకుంటూ..నిన్ను తన దైవంగా భావించు కుంటారు. భగవంతుడు అందరికి ఒకే లాంటి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వడు, పూర్వజన్మ పుణ్య పాప ఫలాల ఫలితంగా జీవన విధానం, శక్తి సామర్ధ్యాలు ఏర్పడతాయి. ఎప్పుడు ఎవరికీ ఏ పుణ్యం చేసామో, ఎవరి దీవెనల ఫలమో మంచి జీవితం, జ్ఞానం లభించినప్పుడు దానిని దుర్వినియోగం చేయక క్రింది స్థాయి వారికి ఉపయోగ పడేలా ఉండాలి. ఆ చేసిన పుణ్య ఫలం తిరిగి మనకు, మన పిల్లలకు దక్కుతాయి.

 ఈ చిన్న కథ ఏం చెబుతోంది..?

ఈ చిన్న కథ ఏం చెబుతోంది..?

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తుంటే కారు దారిలో ఓ బురద గుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనపడ్డాడు. పరిస్థితి చూసిన రైతు ఉండండి బాబు నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు! రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ ఎంటిరా ఆలోచిస్తున్నరూ తిన్నదంతా ఏమైంది బండిని లాగండిరా అని ఉత్సాహంగా ప్రోత్సాహాన్నిచ్చాడు. అంతే ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది ఆ ఎద్దు. పెద్దాయన ఆశ్చర్యంతో సర్ ఉన్నది ఒక ఎద్దే కదా మీరేంటీ‌ అన్ని ఎడ్లు ఉన్నట్టు పిలిచారు.

ఎవరి బలం వారికి తెలీదు

ఎవరి బలం వారికి తెలీదు

రైతు ఈ రాజు అనే ఎద్దు బక్కదే కాదండి బాబు గుడ్డిది కూడా ఐతే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది అంతే పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయవచ్చును అన్నాడు. కేవలం మనం వాటికి దైర్యాన్ని, విశ్వాసాన్ని మాత్రం అందిస్తే చాలు వాటికి కొండంత బలం అవుతుంది. ప్రతి జీవి తమ శక్తిని తాము తెలుసుకోలేవు. హనుమంతుండు ఎంతో శక్తి సంపన్నుడైనా లంకను అధిరోహించే సమయంలో తానూ అంతటి ఘనకార్యం సాధించ గలనా అని సంశయం పడుతున్న సమయలో సన్నిహితులు, హితులు అతని శక్తి సామర్థ్యాలను గుర్తుచేసి ప్రోత్సహించి నందువలననే హనుమంతుడు లక్ష్యాన్ని సాధించ గలిగాడు అని ప్రియంగా సమాధానం చెప్పాడు. రైతు తెలివికీ సమయ స్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు.

మనిషికి మనిషే భరోసా

మనిషికి మనిషే భరోసా

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా వారు ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం... కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో, పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు.. బంధువులు నీ చుట్టూ లేక పోవటం. ఎవరో ఎదో చేసారని నీవు ఇతరులకు అలా కీడు తలంచకు అది మానవ నైజం, ధర్మం కాదు. పరోపకార మిదం శరీరం. మనం మానవత్వంతో సాటి వారు కష్టంలో ఉన్నప్పుడు ఆ మనిషికి భరోసాగా నేనున్నా అనే భరోసా ఇద్దాం... అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం.. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి. ఒక కాకి ఇబ్బందులలో ఉంటే క్షణాలలో వందల కాకులు పోగై వాటికి అండగా నిలుస్తాయి. ఆలాగే చాలా ముగజీవులు ఒకటికి మరోకటి ధీమాగా ఉంటాయి. విజ్ఞత కలిగిన మనం ఎందుకు ఉండ కూడదు అని ఆలోచిద్దాం, సాటి వారికి సహాయంగా నిలబడదాం. చేతనైన సహాయ సహకారాలను అందిద్దాం.

English summary
Service to Man is service to God. This philosophy should be understood by everybody then only as a community we can grow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X