వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగద్గురు ఆది శంకరాచార్య అవతార పురుషుడా ? శివుని అంశనా ?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

విశ్వకర్మ సమారంభం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురుపరంపరాం .

శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.శంకర భగవత్పాదులు జీవిత చరిత్ర చూస్తే ఆయన మానవపుతృుడే, కానీ అలాంటి మానవుడు, ధీశాలి మరొకరు ఈ చరిత్రలోనే మళ్లీ పుట్టలేదు అని తెలుస్తుంది ! ఆయన ఒక అవతార పురుషుడు, సాక్షాత్తూ శివస్వరూపం !!!!!!!

శ్రీ శంకరులు కేరళలో కాలడి అనే గ్రామములో నంబూద్రి కుటుంబములో శివగురువు, ఆర్యామ్బ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడుకి ఐదో ఏట ఉపనయనం చేయించింది . ఆ తరువాత శంకరులు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మూడు సంవత్సరాలు సాంగోపాంగంగా వేదాలు నేర్చుకున్నారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఆ చిన్న వయసులోనే అందరూ ఆ బాల శంకరుల ప్రతిభ చూసి, ఆయనని భగవంతుని అవతారమని భావించేవారు.

Shri Shankaracharya is - Advaita - Brahma

ఒకనాడు ఆయన ఒక ఇంటికి భిక్షకు వెళ్ళగా, ఆ ఇంటి పేద బ్రాహ్మణి ఇంట్లో ఏమీ లేక, ఒక ఎండిపోయిన ఉసిరి తీసుకుని వచ్చి, బాధతో సిగ్గుపడుతూ ఆ ఉసిరిని భిక్షగా వేసింది. ఆమె దారిద్ర్యం, ధర్మబద్ధతతో హృదయం కరిగి , శ్రీ శంకరులు ఆశువుగా "కనకధారాస్తవము" అనే మహోత్తరమైన స్తోత్రాన్ని కల్పించి ఆ అమ్మవారిని స్తుతించారు.

వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట, బంగారు ఉసిరికల వర్షం కురిసింది! అదే శంకరులు చేసిన తొలి స్తోత్రం..కనకధారా స్తోత్రం ! ఎనిమిదవ ఏటనే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి, పన్నెండవ ఏటికి సర్వ శాస్త్రాలను మధించి, పదహారో ఏటికి భాష్యాన్ని రాసి, ముప్పైరెండవ ఏటికి శరీరాన్ని విడిచిపెట్టేసారు.
ఆసేతు హిమాచలం భారతదేశము అంతా మత సంక్షోభములో ఉండగా అవతరించిన శివ స్వరూపము శంకరులు! ఆయన ఒక వ్యక్తి కాదు ! ఒక వ్యవస్థ .

అద్వైత తత్వాన్ని ప్రభోదించి ఈ దేశపుటెల్లలు దాటి అవతలకి పోయేట్టు నాస్తిక వాదులను తరిమి కొట్టారు.ఈ ఆధునిక వాహనాలు, రోడ్లు ఏమీ లేని రోజుల్లో కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవన విధానాన్ని మార్చిన మహనీయులు..మనపై కరుణతో ఆ శివుడు స్వయముగా దిగివచ్చిన అవతారం శంకర భగవత్పాదులు!

అద్వైతమతం ఆదిశంకరాచార్యులు:-

అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.

బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో 'అహం బ్రహ్మాస్మి' అంటే నేనే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

శ్రీ ఆదిశంకర విరచిత ప్రాతః స్మరణ స్తోత్రమ్ :-

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |

యత్స్వప్నజాగరసషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలతమహం న చ భూతసంఘః || 1 ||

సచ్చిదానందరూపము , మహాయోగులకు శరణ్యము , మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మతత్త్వమును ప్రాతఃకాలమునందు నామదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము , జాగరణ , సుషుప్తి అనువాటిని తెలుసుకొనుచున్నదో , నిత్యమూ , భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మ నేనే. నేను పంచభూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |

యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజ మచ్యుతమాహురగ్ర్యమ్ || 2 ||

మనస్సునకు , మాటలకు అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలము నందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు '"నేతి" "నేతి"(ఇది కాదు , ఇది కాదు)అను వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో , జనన మరణములు లేని ఆ దేవ దేవునే అన్నిటి కంటే గొప్పవాడుగా పండితులు చెప్పిరి.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం. పురుషోత్తమాఖ్యమ్ |

యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌరజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై || 3 ||

అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణస్వరూపుడు , సనాతనుడు , అగు పురుషోత్తముని ప్రాతఃకాలము నందు నమస్కరించుచున్నాను. అనంతస్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనబడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్ |

ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||

మూడు లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవడైతే ప్రాతఃకాలము నందు పఠించునో వాడు మోక్షమును పొందును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం ప్రాతఃస్మరణ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఇలాంటి పవిత్రమైన రోజున మనము అందరమూ ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన మనకి అందించిన అపూరూపమైన ఆస్తులు... శబ్ద సౌందర్యముతో కూడిన స్తోత్రాలు... పఠిస్తూ...హర హర శంకర జయ శంకర.

శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళి :-

ఓం శ్రీశంకరాచార్యవర్యాయ నమః |
ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః |
ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః |
ఓం సుజ్ఞానామ్బుధిచంద్రమసే నమః |
ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం ముక్తిప్రదాయకాయ నమః |
ఓం శిష్యోపదేశనిరతాయ నమః |
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః |

ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః |
ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః |
ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః |
ఓం శిష్యహృత్తాపహారకాయ నమః |
ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః |
ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః |
ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః |
ఓం సాక్షాచ్ఛంకరరూపధృతే నమః |
ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః |

ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః |
ఓం వేదవేదాంతతత్త్వజ్ఞాయ నమః |
ఓం దుర్వాదిమతఖండనాయ నమః |
ఓం వైరాగ్యనిరతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సంసారార్ణవతారకాయ నమః |
ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః |
ఓం పరమార్థప్రకాశకాయ నమః |
ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః |

ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం మహతే నమః |
ఓం శుచయే నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం నిరాతంకాయ నమః |
ఓం నిస్సంగాయ నమః |
ఓం నిర్మలాత్మకాయ నమః |
ఓం నిర్మమాయ నమః |
ఓం నిరహంకారాయ నమః |

ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః |
ఓం సత్త్వప్రధానాయ నమః |
ఓం సద్భావాయ నమః |
ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం సారహృదయాయ నమః |
ఓం సుధియే నమః |
ఓం సారస్వతప్రదాయ నమః |
ఓం సత్యాత్మనే నమః |

ఓం పుణ్యశీలాయ నమః |
ఓం సాంఖ్యయోగవిచక్షణాయ నమః |
ఓం తపోరాశయే నమః |
ఓం మహాతేజసే నమః |
ఓం గుణత్రయవిభాగవిదే నమః |
ఓం కలిఘ్నాయ నమః |
ఓం కాలకర్మజ్ఞాయ నమః |
ఓం తమోగుణనివారకాయ నమః |
ఓం భగవతే నమః |

ఓం భారతీజేత్రే నమః |
ఓం శారదాహ్వానపండితాయ నమః |
ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః |
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః |
ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః |
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః |
ఓం అతీంద్రియజ్ఞాననిధయే నమః |
ఓం నిత్యానిత్యవివేకవతే నమః |
ఓం చిదానందాయ నమః |

ఓం చిన్మయాత్మనే నమః |
ఓం పరకాయప్రవేశకృతే నమః |
ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః |
ఓం క్షేమదాయినే నమః |
ఓం క్షమాకరాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం భద్రప్రదాయ నమః |
ఓం భూరిమహిమ్నే నమః |
ఓం విశ్వరంజకాయ నమః |

ఓం స్వప్రకాశాయ నమః |
ఓం సదాధారాయ నమః |
ఓం విశ్వబంధవే నమః |
ఓం శుభోదయాయ నమః |
ఓం విశాలకీర్తయే నమః |
ఓం వాగీశాయ నమః |
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః |
ఓం కైలాసయాత్రాసంప్రాప్తచంద్రమౌళిప్రపూజకాయ నమః |
ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితాయ నమః |

ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబామనోరథాయ నమః |
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః |
ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠాత్రే నమః |
ఓం మహామతయే నమః |
ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః |
ఓం సర్వదిగ్విజయప్రభవే నమః |
ఓం కాషాయవసనోపేతాయ నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః |

ఓం కమండలులసత్కరాయ నమః |
ఓం గురుభూమండలాచార్యాయ నమః |
ఓం భగవత్పాదసంజ్ఞకాయ నమః |
ఓం వ్యాససందర్శనప్రీతాయ నమః |
ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః |
ఓం సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః |
ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః |
ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః |
ఓం శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయంభూజయసన్నుతాయ నమః |

ఓం తోటకాచార్యసంపూజ్యాయ నమః |
ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః |
ఓం హస్తామలకయోగీంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః |
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః |
ఓం నృసింహభక్తాయ నమః |
ఓం సద్రత్నగర్భహేరంబపూజకాయ నమః |
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః |
ఓం జగత్పూజ్యాయ నమః |
ఓం జగద్గురవే నమః |

English summary
Shri Shankaracharya - Advaita - Brahma is the basis of the universal world. shankara is a human beings, but such a human being, the one and the other, is not known in history! He is an incarnation, a witness Sivasvarupam !!!!!!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X