వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత పద్మనాభ వ్రత విశిష్టత: పూర్ణిమ చతుర్దశి రోజునే ఎందుకు చేయాలి?

అనంతుడు అనేది త్రి మూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి.

|
Google Oneindia TeluguNews

భాద్రపద శుక్ల చతుర్దశి - అనంత పద్మనాభ వ్రతం (05.09.2017)

భాద్రపద శుక్ల చతుర్దశి అనంతుని పూజకు ఉద్దిష్టమైనది. అగుట దీనికి అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరు ఏర్పడింది. -ద్ర జనాటి కార్యకలాపమును అనంతవ్రతమని అంటారు. అనంతుడు అనేది త్రి మూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి.

స్మృతి దర్పణము ఈనాటి వ్రతాలలో అనంత చతుర్ధశీ వ్రతానికి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు పాలీ చతుర్లఠీ వ్రతము, కదలీవ్రతము చేయాలని కలదు. ఉత్కళదేశంలో దీనిని అహోర చతుర్దశి అంటారని ఆమాదేర్ జ్యోతిషీ, త్రయోదశితో కూడిన చతుర్ధశి పనికిరాదు.

పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యము. అనంత వ్రత విషయమై భవిష్యోత్తర పురాణములలోనూ, తిధి విషయమై హేమాద్రిలోనూ కలదు.
భారతీయులు ఆచరించు కామ్యవ్రతాల్లో ఇది ఒకటి. ఈ వ్రతాచరణకు ఉదయ వ్యాపిని అయిన చతుర్దిశి ముఖ్యము. పూర్ణిమ ఘడియలు ఏ కొంచెం ఉన్నా ఈ వ్రతానికి శ్రేష్టమై ఉంటుంది. అనంతుని వ్రతానికి ముఖ్యమైన అంగాలు మూడు అవి వరుసగా
1. యమునాజల పూజనము
2. అనంతుని పూజ
3. ప్రతిసర పూజ

significance of Anantha Padmanabha Vrata

వీనిని వరుస క్రమమున వివరించుకుందాము. ఈనాడు యమునా నదికి ప్రత్యేక పూజ అందడానికి కారణంగా క్రింది కథ చెబుతారు.
యమునా దేవి కథ
యమునా నదీ తీరాన ముత్రా అనే ఊరు . ఆ ఊరులో ఒక బ్రాహ్మణుడు కాపరం చేస్తూ ఉండినాడు. వాని వద్ద బహుళ అనే ఒక ఆవు ఉండేది. అది మిక్కిలి సాధువైనది.

అది ఒకానొక భాద్రపద శుక్ల చతుర్ధశిని యమునానదీ తీరాన పచ్చిక బీటిలో మేస్తూ ఉండినది. హఠాత్తుగా అక్కడికి ఒక పెద్దపులి వచ్చింది. ఆవును అమాంతం మింగివేయడానికి సిద్దపడింది.

ఆవు అప్పడు పెద్దపులితో ప్రార్థనా పూర్వకంగా ఇట్లా అన్నది. 'నాకు ఇంటి వద్ద ఒక చిన్న దూడ ఉంది. ఒకసారి పోయి ఆ లేగను చూచి నేను పెద్దపులి ఆహారమవుతున్న విషయం తెలియచేసి కొన్ని బుద్దులు చెప్పి తిరిగి వస్తాను. ఇందుకు అనుమతించవలసింది.

పెద్దపులి అందుకు సమ్మతించింది. ఆవు ఇంటికి వెళ్లి లేగకు పాలు కుడిపి, బుద్దులు చెప్పిపెద్దపులికి ఆహారం అయ్యే ఉద్దేశంతో తిరిగివచ్చింది. ఈలోగా హఠాత్తుగా ఏదో ప్రమాదం జరిగి పెద్దపులి చనిపోయింది. పెద్దపులి శవం అక్కడ పడి వుంది. దానిని వదలిపోయిన ఆత్మ పూర్వ జన్మలలో పరిపక్వం కావడం వల్ల బాగా జ్ఞానవంతం అయింది.

అది తిరిగి వచ్చిన గోవుతో ఇట్లా అంది. నీవు తిరిగి నీ లేగ వద్దకు వెళ్లిపోవలసింది. ఈనాడు భాద్రపద శుక్ల చతుర్దశి. ఈనాడు పుజిమ్చినవారికి పుణ్యాత్ములకు గోసంపద బాగా వృద్ధి పొందుతుంది. ఆ పుణ్యాత్ముల గోవులకు ఎప్పడు కాని వ్యాప్రూది క్రూరమృగముల పీడ ఉండదు. దీనికి యమునా నది సాక్షిగా, పూట కావుగా ఉండగలదు.

భాద్రపద శుక్ల చతుర్ధశినాడు సంఘటితమైన వరప్రదానానికి పూటకావు కావడం వల్ల యమునానది తోయాలకు ఈనాడు ప్రత్యేక పూజనం ఏర్పాటైంది. ఈ పూజకు సంబంధించిన మంత్రాలలో 'విష్ణురూపి, సర్వకామప్రదాయిని, సర్వపాపప్రణాశిని" మున్నగు విశేషణాలు యమునకు వాడబడ్డాయి. తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, భవనాశని, గంగ, గోదావరి మున్నగు నదులు పేర్కొనబడ్డాయి.

అనంతపద్మనాభ చతుర్ధశి వ్రతమే కాని ఉత్సవం కాదు. ఆదిలో ఈ వ్రతాచరణం యమునా తీరాన ప్రారంభమైనదేమో! ఇది ఇప్పడు హిందూదేశ మంతటా ఆచరణలో ఉంది. రాజపుటానాలో దీనిని సర్వేసర్వత్రా అందరూ ఆచరిస్తారు. వంగదేశంలో కూడా దీని ఆచరణ విస్తారమే. దక్షిణాదిని వైష్ణవులలో ఎక్కువ.

ఆంధ్రదేశంలో బ్రాహ్మణ కుటంబాలలో కొన్నిటియందు దీనిని అతిదీక్షతో జరుపుతారు. యమునా తీరస్తులు కాని వారు తాము వాడుకునే నీటిని కలశంలోనికి గ్రహించి అOదు యమునను ఆహ్వానిస్తారు.
అనంతుని పూజ

అనంతుడు అనగా ఆదిశేషువు, విష్ణువు, రుద్రుడు మున్నగు అర్ధాలు కనిపిస్తున్నాయి. కాని ఇక్కడ పూజను అందేది విష్ణువుకు పాన్పు భూమ్ని మోసేవాడు అయిన ఆదిశేషువు. పద్మాల పిండితో ఏడు పడగలు గల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేయడమున్నూ కలదు.
దీని మిూద కలశను పెడతారు. పూజ మంత్రాలలో సహస్రశిరసేనను" ఫణిస్పప్తభిరావిష్టం' మున్నగు పదాలు ఉన్నాయి.

తోరము

అనంతుని ముందు తోరము ఉంచి పూజించాలి. అది పదునాలుగు ముళ్లు గలదిగా ఉండాలి. కుంకుమాయుక్తమై ఉండాలి. పూజారంభానికి ముందు ముందటి సంవత్సరపు పాతతోరం ధరించాలి.
పూజచేసి దీనిని దక్షిణకరానికి కట్టుకోవాలి. అపుడు పాతతోరాన్ని తీసివేయాలి.

అనంతుని పూజలో పధ్నాలుగు సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది. విష్ణువుకి పాన్పు అయిన ఆ పాముకి ఏడు (పధ్నాలుగులో సగం) పడగలు. పధ్నాలుగోది. తోరం పధ్నాలుగు పోచలతో పోసింది. ఆ తోరానికి పధ్నాలుగు గ్రంధులు. ఈనాటి పధ్నాలుగు రకాల పత్రితో పూజ చేయడం, నైవేద్యానికి పధ్నాలుగు రకముల పండ్లు, పధ్నాలుగు రకాల పిండివంటలు ఉంచడం ఆచారం. వాయన దానానికి పధ్నాలుగు అతిరసములు వాడడO ఆచారమై ఉంది.

గోధుమపిండితో ఇరవైయెనిమిది (రెందు పధ్నాలుగులు) అతిరసములు చేయాలని కలదు. పదునాలుగేసి ఏళ్లకు ఒకసారి వ్రతానికి ఉద్యాపనము చేయాలి.
ఇక పూజకు ఉపయోగించవలసిన పత్రిలో, పళ్లల్లో ముఖ్యమైనవి మొగలి, తులసి, తులసి దళాలు ఈనాడు ఒక సహస్రం పూజకు ఉపయోగిస్తారు.

ఈ అనంతప్రతానికి బంధుమిత్రుల్ని రాత్రి భోజనానికి ఆహ్వానిస్తారు. అనంతునితో బాటు అనంత తోరాలని కూడా పూజిస్తారు. ఆ
తోరం బంగారు జలతారుతోను ఎర్రపటు తోను చేస్తారు. దాని ఖరీదు రూపాయి మొదలు మూడు రూపాయల వరకు ఉంటుంది.

తోర గ్రంథిని పూజించిన తరువాత దానిని ముంజేతికి కట్టుకుంటారు. ఈ తోరాన్ని కొందరు ఏడాదీ వుంచుకుంటారు. మళ్లీ సంవత్సరపు అనంత చతుర్ధశినాడు తిరిగీ కొత్తది కట్టుకుంటారు. ఆ తోరాన్ని జాగ్రత్తగా వుంచడం మంచిదని వారి నమ్మకం. దానిని తగలబెట్టడం కాని, అపవిత్రస్థలాల్లో వుంచడం కాని కూడని పని."

English summary
Anantha Padmanabha Vrata is observed on the 14th day of the Shukla Paksha (waxing phase of moon) in Bhadrapad month. Anantha Padmanabha Vrata 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X