• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు, శివుడు భిక్షాటన ఎందుకు చేస్తారంటే?

|

భారతీయ హిందు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను, నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాసశివరాత్రి అంటారు.ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివున్ని కొలుస్తారు. సూర్యాస్తమ సమయమునకు పరమందు 6 ఘడియలను ప్రదోషకాలమంటారు..

మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహా శివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్రగ్రంధాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము.

సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం.

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు

మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు

శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, మనస్సును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిదర పోకుండా (జాగరణ)తో మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యంగా, శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు. మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.

1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.

శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది.ఒకానోక రోజు బ్రహ్మ, విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారీరువురిలో ఎవరు గొప్పో అని తేల్చుకోవలనుకున్నారు.విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది.

ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘ మాస చతుర్ధశి తిధి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.బ్రహ్మ,విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది,అంతం తెలుసుకోవలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు.మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరుగడం ప్రారంభించాడు.

వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు,చివర ఎదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు.చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గోప్ప అనే పోటీతో వాదోప వాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు.అపుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు.ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం.

శాస్త్రవిధులు

శాస్త్రవిధులు

శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవిధులు:- మహా శివరాత్రి రోజు బ్రహ్మీ మూహూర్తంలో నిద్రలేచి ఇల్లాంత శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి.పూజగదిలో ముగ్గులు వేసుకుని రక రకాల పూలతో అలంకరించుకోవాలి.

లింగకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో,ఆవుపాలతో,పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో,పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను,బిల్వపత్రాలను,తుమ్మిపూలను,గోగుపూలు,తెల్లని,పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమశ్శివాయ అని స్మరింస్తూ పూజించాలి.

తాంభూలం, చిలకడ దుంప (రత్నపూరీ గడ్డ ) అరటి పండు, జామపండు, ఖర్జరపండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్టతో శివ అష్టోత్తరం/పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టాఐశ్వరాలు,సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి.శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివున్ని బోళాశంకరుడని పేరు.భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి.సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు.

కోరిన కోర్కెలు తీరుస్తుంటాడు

కోరిన కోర్కెలు తీరుస్తుంటాడు

మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించు కుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోర్కేలను తీరుస్తూ రక్షించు కుంటాడు. ఈ మహా శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంత జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం, తోటకూర,బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేద వారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి, పశు, పక్ష్యాదులకు కూడా ఏదైన అవి తినే ఆహార పదార్ధాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి.

ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణగావించాలి ఈ పద్దతులలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పా టు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పోందుతారు.ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్ధం మనవంతుగా కర్తవ్య భాద్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు.

భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన

భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన

సాక్షాత్తు పరమ శివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే ధానాలను ఏ రూపంలోనైనవచ్చి బిక్షతీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు.ఈ సూక్షపరమార్ధమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమౌతాము.దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చేలిమేలో నీరును తోడితే తిరి కొత్త నీరు ఏ విధంగా పుట్టుక వస్తుందో అదే విధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యలకు ఏదో రకంగా లభిస్తుంది.

ముఖ్యంగా మీ మీ ప్రాంతాలలో శివాలయాలో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం.ముఖ్యంగా తెలుగు రాష్టాలలో శ్రీరామ నవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రమంతట శ్రీ రామ నవమి వేడుకలు చేసుకోవడం అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీ శైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆరోజే ప్రజలందరు మహా శివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగ సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం.భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంత శివాలయాలను అనుసరించడం సర్వోత్తమమం. జై శ్రీమన్నారాయణ.

--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151

English summary
Maha Shivratri is also called the "the great night of Shiva" and comes just before the arrival of Spring season. It will be celebrated on March 4 and will be extended till March 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more