వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివునిచే పూజించబడిన వినాయకుడి కథ: రంజన్‌గావ్ లోని మహాగణపతి ప్రత్యేకత..

అమరావతిని తనరాజ్యముగా చేసి క్రొనెను. అచ్చటినుండి, త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తి వెళ్ళెను.

|
Google Oneindia TeluguNews

శ్రీ వరద వినాయక కథలో గృత్స్నమడుడు తన తల్లిని శపించి, ఆమెచే ప్రతిశాపమునుపొందినట్లు చదివితిమి. "మహా బలపరాక్రమవంతుడు, త్రిలోక కంటకుడు, క్రూర రాక్షసుడు అగు కుమారుడు జన్మించుగాక" అని ఆమె శాపము. ఇది యిట్లండగా, గ్భతమదుడు అత్యంత భక్తితో విఘ్నేశ్వరుని ధ్యానించి, ఆతనిని ప్రసన్నుని చేసికొనెను.

వినాయకుని వరప్రసాదమువలన, అతడు మునులలో పరమశ్రేషుడైనాడు. ఒకనాడు ఏకాగ్రతతో వినాయకుని జపమునందు మునిగి ఉండగా, అతనికి పర్వతములు సైతము అదిరిపడేటంత పెద్దధ్వనితో ఒక తుమ్ము వచ్చినది. తత్క్షణమే, తన ఎదుట ఒక బాలకుడు కనిపించెను.

Significance of ranjangoan ganpati

ముని శ్రేషుడు, "నీవు ఎవరు?" అని అడుగగా ఆ బాలకుడు, "నీ తుమ్ములో జన్మించినాను. కనుక నీవే నాకు తల్లివి, తండ్రివి" అని జవాబు చెప్పెను. ఆ బాలకుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతసించి, "గణానాంత్వా అనే గణపతి మంత్రమును ఉపదేశించెను. ఈ గణపతి మంత్రమును, ఆ బాలుడు 5 వేల సంవత్సరములు జపించెను. గణపతి సాక్షాత్కరించి, వరములను కోరుకొనుమనెను.

"మూడు లోకములలోను నాకు ఎవరును ఎదురు ఉండరాదు. దేవతలు నాక్టు వశులై ఉండాలి. నేను దేనిని సంకల్పించినను అది తత్క్షణమే సిద్దించాలి, ఇహములో సుఖములనుభవించి పరములో మోక్షమును పొందాలి" అను వరములను అతడు గణపతిని కోరెను. గజాననుడు ఆ వరములను ప్రసాదించెను.

కామగమనముగల మూడు పురములను బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి అతనికిచ్చెను. ఆ పురములు ఒక్క శంకరునిచేత తప్ప ఎవరిచేతను ఛేదింపబడవు. నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణముతో ఈ మూడు పురములను చేదించినప్పడు, నీకు ముక్తి లభించును" అని వరములను అనుగ్రహించెను.

త్రిపురాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో, భూమండలమును అంతయు ఆక్రమించెను. తరువాత ఆతడు దేవలోకముపై దండయాత్రచేసెను. ఇంద్రుని ఓడించెను. అమరావతిని తనరాజ్యముగా చేసి క్రొనెను. అచ్చటినుండి, త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తి వెళ్ళెను.

బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలములో లీనమైపోయెను. విష్ణువు కూడ ఆ రాక్షసునికి కనపడకుండా క్షీరసముద్రమునకు చేరెను. ఈ విధముగా అతడు బ్రహ్మలోకమును, విష్ణులోకమును (రెండిటిని) ఆక్రమించుకొనెను. త్రిపురాసురుడు బ్రహ్మలోకమునకు తన పెద్దకుమారుడైన ప్రచండుని, విష్ణులోకమునకు తన రెండవ కుమారుడైన చండుని, అధిపతులుగా నియమించెను.

ఇక శివలోకమును ఆక్రమించుకొనుటకై అతడు కైలాసమనకు వెళ్ళెను. శివుడు కూడా కైలాసమును వదలి మంథర పర్వతమునకు చేరెను. తరువాత, రసాతలము, సప్త పాతాళ లోకములు త్రిపురాసురుని వశమైనవి.
ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహము పొందుటయే సరియైన మార్గమని ఉపదేశించెను. అప్పుడు దేవతలందరు అత్యంత భక్తితో పరిపూర్ణ శరణాగతితో సంకటమోచన గణేశ్వరుని ప్రార్జించిరి.

శంకరుడు త్రిపురాసురునిచే ఓడింపబడెను. అప్పడు నారదుడు శివునితో, "గణేశుని పూజించి ఆయన అనుగ్రహము పొందక పోవుటచేతనే ఈ పరాజయము నీకు సంభవించినది, కనుక గణేశుని పూజించి, ఆతని అనుగ్రహమును సంపాదించుకొనుము." అని చెప్పెను. అదికాక, వినాయకుడు త్రిపురాసురునకు ఇచ్చిన వరము ప్రకారము, ఆరాక్షసుడు శివునిచేతనే వధింపబడునని గూడ శంకరునకు తెలియచేసెను.

అప్పడు శంకరుడు 100 సంవత్సరముల కాలము ఏకాగ్రతతో గణేశుని గూర్చి తపస్సు ఆచరించెను. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఒక బాణమునిచ్చి తన సహస్రనామములను శివునకు ఉపదేశించెను. శివుడు ఆ సహస్రనామములను జపించి, త్రిపురాసురునిపై యుద్దమునకు బయలుదేరెను.

అప్పడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుజ్ఞములు గాను, మేరువును ధనుస్సుగాను, విష్ణువును బాణముగాను చేసికొనెను. శంకరుడు వినాయక - అష్టకమును పఠించి, విఘ్నేనుశ్వరుని అభయముపొంది, విష్ణువు యొక్క అంశతో గూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగించెను.

ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణించెను. ఆతని శరీరమునుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమాయెను. ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. ఆ రోజు కార్తిక పౌర్ణమి. ఈ విజయమునకు కారణుడైన విఘ్నేశ్వరుని స్వయముగా శంకరుడే ఆక్షేత్రమునందు ప్రతిష్టించెను. ఆ మూర్తియే ఈ మహాగణపతి. ఈ స్థలమే రంజన్ గాము.

ఈ కథ గణేశ పురాణములో 38 నుండి 47 వరకుగల అధ్యాయములలో వివరింపబడినది. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి కోరికలన్నియును సిద్దించును.

గమనిక: రంజన్గామ్ పూణే - అహమద్ నగర్ రహదారిలో పూణే నుండి 50 కిలోమీటర్ల దూరములో ఉన్నది.

English summary
Ranjangaon Ganpati is one among the Ashtavinayak, celebrating eight instances of legends related to Ganesha. This temple's Ganpati idol was inaugurated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X