వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ సనాతన ధర్మంలో 'తిలకం' ప్రాధాన్యత: బొట్టు ఎందుకు పెట్టుకుంటారు?

|
Google Oneindia TeluguNews

హిందు సాంప్రదాయ ప్రకారంగ బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం(బెట్టు) పెట్టుకుంటారు.

నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు,ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు.ఈ బొట్టు(తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు.

పూర్వకాలంలో కాలములో చాతుర్ వర్ణాలవారు అయిన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవారు.

Significance of Sindoor or TILAK

క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వారు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు. వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు.శూద్ర జాతికి చెందిన వారు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు.
విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము భగవత్ ప్రసాదముగా భావించి తర్వాత నుదుటన పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశములో తిలకమును పెట్టుకుంటాము. యోగ పరిభాషలో ఈ నుదుటి ప్రదేశాన్ని "ఆజ్ఞా" చక్రముగా పిలవ బడుతుంది. బొట్టు పెట్టుకున్న ప్రతి వ్యక్తి భావన విమలంగా,నిర్మలంగా ఉంటుంది. ప్రతి మనిషిలోను దైవాన్ని చూస్తూ ,మానవ సేవయే మాధవ సేవ అన్న భావనతో వ్యవహరిస్తారు ఈ భక్తి భావన అన్నికార్యకలాపాలలోనూ వ్యాపించుగాక! నేను అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక అనే సంకల్పంచే బొట్టు పెట్టుకో బడుతుంది.

మనము ఈ వాస్తాలను తాత్కాలికముగా మరచిపోతున్నాం ,కాని ఇతరుల నుదుటిపై ఉన్న బొట్టును చూడగానే మనకు వెంటనే మన భావం గుర్తుకు వస్తుంది. అందుకే ఈ తిలకం ద్వార మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదము, అధర్మ భావననుండి విముక్తి కలిగిస్తూ ,వ్యతిరేక దుష్ట శక్తులనుండి రక్షణ కల్పిసూ,

మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది.

అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందిలు అలంకార ప్రాయమే కాని నిజానికివి ప్రయోజనాన్ని కలిగించవు సరికదా చర్మహానిని కలిగిస్తాయి.

భారతీయులకు ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది. తిలకం అనేది హిందూ మతంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా నడుస్తు వస్తున్నది.

బొట్టు పెట్టుకోవడం ద్వార ఆజ్ఞాచక్రం శక్తిని పెంచుతుంది. శరీరానికి చల్లదనానిచ్చి తేజస్సును పెంచుతుంది. హిందువులు ఏదేశంలో ఉన్నను భరత సంస్కృతి అనేది శాస్తీయ పరంగా ఎంతగోప్పదో తెలుసుకుని, దానిని మరువకుండా ఉన్నప్పుడు ఆచార సాంప్రదాయలను ఆచరించినప్పుడు, మనదేశ హిందూ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

నేటి ఆధునిక మహిళ సోదరినిలు చాలా మంది వివాహమయిన స్త్రీలు కూడా నుదుట తిలకమును ధరించడం మానేశారు.

బొట్టు పెట్టుకోవడం అనేది ఒక అనాగరికంగా, పెట్టుకోకపోవడం ప్యాషన్ గా భావిస్తున్నారు. కొంతమంది అయితే మాడ్రన్ దుస్తులు వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపించము అనే భావనలో కూడా ఉన్నారు.

ఎందరో విదేశీ మహిళలు మన భారతీయ సంస్కృతిపట్ల ఆకర్షితులు అవుతుంన్నారు, మన సాంప్రదాయలను వారు గౌరవించి ఆచరిస్తున్నారు, మనవాల్లు పక్కన పెట్టేస్తున్నారు, వదిలేస్తున్నారు.ఈ బొట్టు సాంప్రదాయమే కాదు ఆరోగ్యదాయినియై రక్షణను ఇస్తుంది,ఇది గమనిద్ధాం.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ ,
జ్యోతిష మూహూర్త సార్వభౌమ
"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) ,
ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.తార్నాక-హైదరాబాద్.

English summary
Sindoor or vermilion holds lot of importance in Indian society. The tradition of application of sindoor in the parting of hair by married Hindu women is considered extremely auspicious and is being carried on since centuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X