వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్య గ్రహణం.. అయ్యప్ప భక్తులకు సూచన

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

అయ్యప్ప స్వాములకు సూచన :- మీ సన్నిధానంలో గ్రహణం కారణంగా 25 వ తేదీ సాయత్రం 7.00 గంటల వరకు పూజలు ముగించుకుని రాత్రి 8 :00 వరకు అల్పాహారం చేసుకోవలెను. పూజ వస్తువులపై దర్భ వేసి ఉంచవలెను. 26 ఉదయం పూజాదికాలు ఉండవు. ఉదయం 8:00 గంటలకు పట్టు స్నానం చేసి జపాలు చేసుకోవలెను. 11:20 తర్వాత తర్వాత మళ్లీ స్నానం చేసి ఇల్లు, సన్నిధానము శుభ్రం చేసుకుని పూజ నిర్వహించి తర్వాత భిక్ష స్వీకరించవలెను.

గ్రహాణ దోష పరిహార ప్రక్రియ కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజులైన శాస్త్ర పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా నడుస్తున్న దశ, అంతర్ధశ, గోచార గ్రహస్థితి ఆధారంగా ఏమైనా దోషం ఉంటే తెలుసుకుని వారిచ్చే సూచనల మేరకు పరిహార జప, దానాదులను చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే కుష్మాండ పూజ చేయించి ఇంటికి , వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.

 Solar eclipse: Advices and practices for Ayyappa Bhakts

గ్రహణ దానాలు:- గ్రహణం తర్వాత మరుసటి రోజు కేవలం గ్రహణ దోషం ఉన్నవారే కాకుండా పన్నెండు రాశుల వారు గ్రహణ దోష నివారణ కొరకు గోధుమలు, ఉలవలు కిలోంపావు చొప్పున తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టి మరుసటిరోజు నీళ్ళను వడగట్టిన తరవాత వాటికి చిక్కగా బెల్లాన్ని పట్టించి ఆవునకు అరటి ఆకులో కాని ,మోదుగ, తామర ఆకులతో కుట్టిన విస్తరిఆకులో మాత్రమే దాన పెట్టాలి. గోమాత మీరు పెట్టిన గ్రాసం తింటున్నప్పుడు మూడు ప్రదక్షిణలు చేయాలి, ఈ విధంగా భక్తీ శ్రద్దలతో ఎవరైతే చేస్తారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.

English summary
Solar eclipse is going to be happen on December 26th. This time Eclipse called Kankana Solar eclipse. This would be most impacted in Part of the Karnataka, Tamil Nadu, Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X