వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26న సూర్య గ్రహణం.. వివిధ రాశులపై ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

డిసెంబర్ 26 తేదీలలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన అన్ని రాశుల వారిపై ప్రభావం ఎలా ఉండబోతుంది, మరియు కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

ధనస్సురాశి ద్వంద్వ రాశి. అగ్ని తత్వ రాశి. రాశి అధిపతి గురుడు. అందులోనే శని కేతువులతో కలిసి ఉండడం ధనస్సురాశి లోకి రవి సంక్రమణం వలన అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్య గ్రహణం ఏర్పడడం కొంత చికాకు, ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశం. జ్ఞానం వైపు అడుగులు సహజంగానే పడవు. రవి మరియు శని ఒకే రాశిలో ఉండటం కూడా వ్యతిరేకమైన ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉంటుంది. మానసికమైన అహం తలెత్తే అవకాశం ఉంది. అమావాస్య రోజుల్లో చంద్రుని వలన బుద్ధి ప్రకాశవంతంగా ఉండక కల్లోలానికి గురవుతారు. ద్వంద్వ రాశులలో గ్రహ సంచారం వలన విద్య ఉద్యోగాలు అభివృద్ధి, చలనము మొదలగు మార్పులను గమనిస్తూ ఉంటాం.

అగ్ని తత్వరాశి అయిన ధనురాశిలో ఈ షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్షలాంటిది. కోరికలను అదుపులో ఉంచుకుంటే ఈ పరీక్ష చక్కగా దాటగలం. అదే సమతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు. కేతువు బంధనాలను విడదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనక క్షణికమైన ఆవేశాలను మనం గెలవాలి. అప్పుడే బంధాలను బాధ్యతలను కాపాడుకోగలం. ఈ వచ్చే కాలాన్ని అంతర్ముఖంగా ఆత్మ శోధన చేసుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తులు తప్పకుండా సానుకూల ఫలితాలు పొందుతారు.

డిసెంబరు నెలలో సూర్య గ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి వారికి జరుగుతున్న దశ, అంతర్దశ, నక్షత్ర ప్రభావము,రాశి,లగ్నంను బట్టి ఫలితాలు నిర్ణయం అవుతాయి. మన భావాలను సానుకూల దృక్పథంతో నడిపించడానికి ఈ గోచార ఫలితాలను పరిశీలించవలసి ఉంటుంది. గోచర గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు పుట్టిన తేది ఆధారంగా వ్యక్తీ గత జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు తెలుసుకుని ఆచరించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

 మేషరాశి వారికి

మేషరాశి వారికి

అష్టమాధిపతి స్వ రాశిలో ఉండటం వలన సానుకూల ఫలితాలు తప్పకుండా వస్తాయి. మానసిక పరమైన ఆలోచనలో మార్పు గోచరిస్తుంది. జనవరి నుండి మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని అభివృద్ధి ప్రయాణం ఆనందంగా గడపండి.

వృషభరాశి వారికి

వృషభరాశి వారికి

అష్టమ భావములలో ఏర్పడుతున్న గ్రహముల కూటమి ప్రభావం వలన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి కుజుడు తన రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిపుచ్చుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.

మిధునరాశి వారికి

మిధునరాశి వారికి

ఆవేశం అదుపులో పెట్టుకుని మృదువైన మాట తీరుతో కాలం గడపండి. తొందరపడి బాంధవ్యాలను తెంచుకోకండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. త్వరలో మీరు స్థిరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో మీ మాట బలం వలన మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటకరాశి వారికి

కర్కాటకరాశి వారికి

ఏ విధంగా ఆలోచనలు ఉంటాయో ఫలితాలు కూడా అదే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక సానుకూల దృక్పథంతో అన్ని అనుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. అదృష్ట కాలాన్ని అనవసరమైన అనుమానాలతో పాడు చేసుకోకండి. మానసికమైన ఆందోళనలు దరిచేరకుండా భక్తీ , ధ్యాన మార్గం అవలంభించండి.

సింహరాశి వారికి

సింహరాశి వారికి

ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు మొదలగు విషయాలలో జాగ్రత్త వహించండి. జనవరి నుండి మీకు మీ సంతానానికి తప్పకుండా లక్ష్యం సాధించడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా ఇప్పుడు వచ్చే అనిశ్చితమైన పరిస్థితిని మనో ధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోవడం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకుని విజయం సాధించడం మీ చేతుల్లోనే ఉంది.

కన్యా రాశి వారికి

కన్యా రాశి వారికి

అర్ధాష్టమ శని తొలగిపోయే రోజులు. ఈ ఒత్తిడిని తట్టుకుని అనుకూలంగా మార్చుకోగలిగితే విజయం మీదే. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.

తులారాశి వారికి

తులారాశి వారికి

ద్వితీయ అధిపతి కుజుడు అద్వితీయము లోనే ఉండటం వలన సుఖమైన కాలం. అభివృద్ధిదాయకం. శాంతి సౌఖ్యం. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తుకు బాటలు వేసుకోండి .

వృశ్చికరాశి వారికి

వృశ్చికరాశి వారికి

రాజ్యాధిపతి కుజుడు సొంత రాశిలో ఉండటం వలన ద్వితీయ అధిపతి గురుడు ద్వితీయంలో ఉండటం వలన రాబోయే సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట సమయం అని చెప్పాలి.

 ధనస్సురాశి వారికి

ధనస్సురాశి వారికి

అత్యంత ఒత్తిడికి , ఆందోళనకు, అనిశ్చితత్వం కనబడుతుంది. ఇది నిజంగా పరీక్షా కాలమే. జరుగుతున్న పరిణామాలను మనసుకు పట్టించుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మీరు తప్పకుండా వచ్చే సంవత్సరం నుండి ప్రశాంతంగా ఉంటారు.

మకరరాశి వారికి

మకరరాశి వారికి

పనులలో గుర్తింపులు పొందలేరు, అత్యధిక వ్యయం. నిరాశ చెందకుండా జనవరి మాసం వరకు కాలం గడపడం వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ ఓరిమే మీకు శ్రీరామరక్ష.

కుంభరాశి వారికి

కుంభరాశి వారికి

అత్యంత అదృష్టం అయినా కాలంగా చెప్పుకోవచ్చును. అన్ని గ్రహాలు కలసివచ్చే రాశులులో ఉండటం వలన అత్యంత లాభదాయకమైన కాలం. పెద్దలను గౌరవించడం వలన మీరు లాభం పొందవచ్చును. గ్రహణ కాలంలో ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.

మీనరాశి వారికి

మీనరాశి వారికి

వృత్తి ఉద్యోగాలలో మంచి అవకాశం వచ్చే కాలం. శాంతి, సౌభాగ్యాలకు వచ్చే సంవత్సరం బాగుంటుంది. నిధానంగా కాలం గడపండి. జనవరి వరకు కొన్ని విషయాలను వాయిదా వేయండి. మీ సృజనాత్మకతను, నిర్ణయాలను వచ్చే సంవత్సరం ఉపయోగించుకోండి. కొత్త సంవత్సరం ప్రారంభంలో 9 10 11 అధిపతులు వారి వారి రాశిలో ఉండటం వలన అత్యంత అదృష్టం అయిన కాలాన్ని ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంకండి.

English summary
Solar eclipse is going to be happen on December 26th. This time Eclipse called Kankana Solar eclipse. This would be most impacted in Part of the Karnataka, Tamil Nadu, Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X