వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9న సూర్య గ్రహణం: ఏం చేయాలి, ఏం వద్దు?

By Pratap
|
Google Oneindia TeluguNews

మాఘ మాసం కృష్ణ పక్షం అమావాస్య బుధవారము అనగా 09 మార్చి 2016 రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభ రాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది.

స్పర్శ కాలం ఉదయం సూర్యోదయానికి ముందు 05.17
సూర్యోదయం ఉదయం (హైదరాబాద్‌) 06.32
మోక్షకాలం ఉదయం 06.48
మొత్తం పుణ్య కాలం 00.16
గ్రహణం 05.17 నుండి మొదలైనా కూడా 06.32 నుండి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి.

నిత్యభోజన ప్రత్యాబ్దీకాలు -

ముందు రోజు రాత్రి భోజనం చేయరాదు మోక్షానంతరం నిత్య భోజన, ప్రత్యాబ్దీకాలు చేసుకోవచ్చు.

Solar eclipse on March 9

గ్రహణ గోచారము

రేవతీ నక్షత్రమువారు ఈ గ్రహణమును చూడరాదు.
మేష, కర్కాటక, వృశ్చిక, ధను రాశులవారికి శుభ ఫలితము
మిథున, సింహ, తులా, మీన రాశుల వారికి మధ్యమ ఫలము
వృషభ, కన్య, మకర, కుంభ రాశుల వారికి అధమ ఫలము

పాటించవలసిన నియమాలు

శుభఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనడానికి సరైన సమయంగా తెలుసుకోవాలి.
మధ్యమ ఫలము ఉన్నవారు మరియు అధమ ఫలము ఉన్నవారు శక్తి కొద్దీ వస్త్ర, ధాన్య, శాకాది, దానాలు చేసుకోవాలి.

గ్రహణ కాలం వరకూ దేవతా మూర్తులమీద, నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి - గ్రహణ అనంతరం తీసి వేయాలి.

మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతా మూర్తులను శుద్ధ పరచుకోవాలి. గ్రహణసమయంలో దేవతా పూజలు అభిశేకాదులు చేయకూడదు.

ఉపదేశిత మంత్రము కానీ ఏదైనా దేవతానామాన్ని జపిస్తే గణనీయ ఫలము అని శాస్త్రవాక్యము.
గర్భవతులు గ్రహణం చూడరాదు.

English summary
Astrologer Maruthi Sharma describes on Solar eclipse to be occurred on March 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X