వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Solar Eclipse: రాశులు ఎలా ఎర్పడుతాయో తెలుసా?.. గ్రహ కారకత్వాలు వాటి ఫలితాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష , జాతక, వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

నక్షత్రాలు ఆకాశంలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ప్రతిరోజూ చంద్రుని దగ్గరలో మనకు కనిపిస్తున్న నక్షత్రం ఆ రోజు నక్షత్రంగా తెలియజేయబడుతుంది. ఆ నక్షత్రాలు 27 ఉండగా , వాని సమూహాలను ఋషులు 12 భాగాలు చేసి రాశులుగా గుర్తించడం జరిగింది . ఇవే మేషాది రాశులు. ఈ రాశులకున్న వేరు వేరు లక్షణాలనే కారకత్వాలు అని పిలుస్తారు. గ్రహాలకు ఉన్నట్టే రాశులకు కుడా కారకత్వాలు ఉంటాయి. ఒక గ్రహం ఉండే రాశిని బట్టి ఫలితాలు క్రమంగా మారుతాయి.

ప్రతి రాశికి ఒక గ్రహం యొక్క ఆధిపత్యం ఉంటుంది.కొన్ని నక్షత్రాలు , నక్షత్రపాదాల సమన్వయంతో రాశి ఏర్పడుతుంది. రాశులకు తత్వాలు, స్వభావాలు, జాతులు అన్ని వేరు వేరుగా ఉంటాయి.ఆయా ప్రత్యేక వర్గానికి చెందిన రాశిని తెలుసుకోవడం ద్వారా ఫలితాలు ఎలా ఉంటాయో నిర్ణయించబడుతుంది. గ్రహాలు వాటి స్వభావాలు, వృత్తులు , ఆరోగ్య, అనారోగ్య మొదలగునవి వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా ఆయా జాతకాలలో ఒక గ్రహం బలంగా అనుకూల స్థానంలో ఉంటే శుభ పలితాలను ఇస్తుంది. ఒకవేళ గ్రహస్థానం ప్రతికూల స్థానంలో ఉన్నటైతే ప్రతికూల ఆనారోగ్య ఫలితాలను ఇస్తాయి.అందుకే ఈ క్రింద తెలిపిన గ్రహకారకత్వాలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేయడమైనది.

Solar System: Planets nature, reactions and its impacts

1. సూర్య గ్రహాము :-
తండ్రి , పుత్రుడు, పెద్ద హోదాలు , రాజకీయ నాయకులు, గౌరవనీయమైన పదవులు, వైద్యుడు, రత్న, సువర్ణ వ్యాపారి, ప్రజాసేవ, రాజనీతి, సామాజికనీతి, మామగారు, ఇంట్లో పెద్దవాడు, కలలు, కోరికలు, ఉహా, ఒక వ్యక్తి యొక్క అంచనాలు, నిరంతరంగా జరిగే సంఘటనలు, గతములో జరిగిన ఫైనాన్సియల్ మేటర్స్, రాజకీయాలు, గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలు, కుడి కన్ను, ఎముకలు, గుండె.శిరస్సు .

2. చంద్ర గ్రహము :-
తల్లి, అత్త, మేనత్త , ఎడమ కన్ను, గుప్తరోగాలు, ముత్రకోశములు, ఛాతి, ఆటలమ్మ, చంచలమైన స్వభావం, వ్యభిచారం, చొర ప్రవృత్తి, మోసం, మార్పులు, ప్రయాణం, పోట్టిఆకారం, భావోదేవ్వేగం, మానసిక సమస్యలు, జీవిత భాగస్వామి మీద ఆసక్తి చూపడం, గర్బాశయం, వ్యవసాయం, పాలు వాటికి సంభందించిన ఉత్పత్తులు, ఆహార పదార్ధాలు, రసాయన వస్తువులు, నూనె వ్యాపారం, కిరాణాకొట్టు, బేకరీ, పశుగ్రాసం, జ్యోతిష్కులు, కాంపౌండర్లు, నావికులు, లాండ్రి, డ్రై క్లినింగ్.

3. కుజ గ్రహాము :-
సోదరుడు, భర్త , భావ, తండ్రి వైపు మగవాళ్ళు, ధైర్యం, ఇల్లు, బిల్డింగ్స్, వాహనాలు, వ్యవసాయరంగం, శక్తి , చరుకుదనం, సైనిక దళం, రక్షణ సంస్థ, సాంకేతికవిద్య, దంతవైద్యం, గ్రానైట్, సాంకేతిక పరికరాలు, గని, లోహం, యంత్రం, రక్తపోటు, గుండెజబ్బు, అండాశయము, మజ్జ , మాంసం, పళ్ళు, కనుబొమ్మలు, వెన్నుపూస, చేతబడి, అగ్నిప్రమాదం, కుక్కకాటు, ఉద్వేగం, క్రూరత్వం, అహంకారం, పొగడ్తలకు లొంగడం, తొందరపాటు, స్వార్ధం, ఖర్చుపెట్టె స్వభావం.

4. బుధ గ్రహము :-
చిన్నచెల్లి లేదా తమ్ముడు, స్నేహితులు, ఎడ్యుకేషన్, పేమ కలగడము, ప్రియుడు, ప్రియురాలు, మేనమామ, డాకుమెంట్స్, అలవాట్లు, వ్యాపార విషయాలు, బ్యాంకు లోన్స్ , అనుకరణ , దాచుకోవడం, జ్యోతిష్యము, వ్యవహార దక్షత , కమ్యూనికేషన్ స్కిల్స్ , హ్యాండ్ రైటింగ్, మధ్యవర్తిగా, జనరల్ నాలెడ్జ్ . ఇంగిత జ్ఞానము, రసికత, హాస్య ప్రియత్వం, వాతతత్వం, ఊపిరితిత్తులు, బట్టతల, టాన్సిల్స్, కుష్టు, పాండురోగం.

5. గురు గ్రహాము :-
జీవకారకుడు, పిల్లల పుట్టుక, పిల్లల సంక్షేమం, బోధకుడు, పండితుడు, పూజారి, కర్తవ్యపరాయనుడు, ఘనుడు, సాత్వికుడు, ధార్మికుడు, సదాచారులు, బ్యాంకు అధికారి, విద్యా సంస్థలలో భోధకుడు, న్యాయశాస్త్రం, మంత్రి, జీవితభీమ అధికారి, ఇంట్లో గౌరవము, సామాజిక గుర్తింపు, వివాహం తరువాత సెక్యూరిటీ, ఆలయ ఉద్యోగాలు, వివాహము ద్వార వచ్చే సంతోషం, జోతిష్య వృత్తి, సంపాదన బాగుటుంది, డబ్బు పొదుపు, పెద్దల ఆశీర్వాదం, కుల దేవత దీవెనలు, గౌరవప్రదమైన ప్రదర్శన, మెదడు, లివర్, పొట్ట, జననేంద్రియ పార్ట్.

6. శుక్ర గ్రహము :-
పాండిత్యం, నటన, నాట్యం, నాటకము, స్త్రీ కారకుడు, మేనత్త, అత్త , భార్య , మొదటి కూతురు, అక్క , వివాహము , పెళ్ళిలో సంతోషము, పెళ్లి కోసము ఎక్కువగా ఖర్చు చేయడము, వైన్ షాప్, రసికత్వం , శృంగార ప్రియత్వం, రాజసం, శుభ కార్యాలు, వినోదాలు, కళ ప్రదర్శనలు, ఇచ్చిన డబ్బు, స్వీకరించబోయే డబ్బు , కోరికలు నెరవేరడం, పొదుపులు, ఆభరణాలు, అందమైన ప్రదర్శన, చర్మం రంగులో మార్పు , మానవ శరీర గ్రంథులు, కిడ్నీ సమస్యలు, సుఖరోగాలు, చక్కరవ్యాధి, కఫ-మేహ-శీత, గర్భాశయ వ్యాధులు, .

7. శని గ్రహము :-
జ్యేష్ట సోదరుడు, అధిక శ్రమ , కూలిపని, చిన్నపరిశ్రమలు, నమ్మకం, లోపం, స్తోమతకు తగ్గ ఉద్యోగం, జాతకుడి జన్మస్థలం, ఇంటి దేవత, దీవెనలు, తీర్చలేని అప్పులు, జీవితకాలం, దీర్ఘాయువు భయం, ఉబ్బసం, వాత ఉబ్బరం, కీళ్ళనోప్పులు, కాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు, కష్టాలు, ఆలస్యము జరగడం, మలిన స్థలాలు, సోమరి, మందగతి, మొండి, కర్మ, అంద వికారము, కాళ్ళు, పంటి సమస్యలు, ఎముకలు, ఎముకలు విరుగుట, మానసిక సమస్యలు, మలబద్దకం, సేవ.

8. రాహు గ్రహము :-
తండ్రి, తాత ( తండ్రి యొక్క తండ్రి ), సాహసం, చోరత్వం, అవినీతి, వివాహంలో సమస్యలు, ప్రతికూల ఆలోచనలు, మరణ భయం, వివాహం కోసం చెప్పిన అబద్ధాలు, ఎడబాటు, వివాహ సమయములో దోపిడీ, కోర్టు కేసులు, వివాహం చేసుకోవాలనే కోరిక ఉండదు, అసంతృప్తి, నిజాయితీ లేని మాటలు, నిస్సహాయ స్థితి. పేగులు, మతిమరుపు, గుప్తరోగాలు, అనుశాస్త్రము, విదేశీ సంబధిత, ఎక్సురేలు, వాహణాలు , శ్రమ , పెట్రోల్ , ఛాయా వృత్తులు.

9. కేతు గ్రహము :-
తల్లి యొక్క తండ్రి ( తాత ) , మేనమామ తరుపు పూర్వీకులు, జ్యోతిష్కులు, ఫకీర్లు, తాంత్రికులు, పూజారి, సాధుసంతులు, వైద్య, న్యాయ, మోక్షమార్గం, దర్జీ, కోర్ట్ కేసులు, ఒంటరి తనము, వివాహము కోసం ఎదురు చూడడం, వివాహానికి సంబంధించిన కోర్ట్ కేసులు, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్న భ్రమలో ఉంటారు, ఒక రకమైన ఘర్షణ, మాటల భయం, ద్యానము, మంత్రం, పిత్త, క్యాన్సర్, పుండ్లు, గాయాలు, ఆత్మహత్య, గుదద్వారం, స్త్రీ పురుష జననేంద్రియాలు, నరాలు, బంధనం, విదేశం, సొరంగాలు, విదేశీ భాషలు.

English summary
Stars are categorised as 27 in solar system. Saints treated them as 12 Zodiac signs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X