వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 4న సోమాతి అమావాస్య: ఏమిటీ మౌని అమావాస్య?

|
Google Oneindia TeluguNews

ఫిబ్రవరి 4వ తేదీన వచ్చేది సోమావతి అమావాస్య .సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు.ఈ అమావాస్యను మౌని అమావాస్య ,శని అమావాస్య అని కూడా అంటారు.రావిచెట్టులో ఎల్లప్పుడు బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు కొలువుదీరి ఉంటారు.ఈ సోమాతి అమావాస్య రోజున రావిచెట్టుకు శక్తి కొలది పూజించి 108 సార్లు ప్రదక్షిణలు చేసి పెదవారికి లేదా అవిటివారికి,పశుపక్షాదులకు సతృప్తి చెందెలాగ తినడానికి ఆహారం అందించిన వారికి గోచార గ్రహాభాదలు కొంతవరకు నివారింపబడుతాయి.కోరికలు నెరవేరుతాయి.

కాల సర్పదోషం ఉన్నవారు, జాతకంలో ఉన్న గ్రహా దోషాలు తొలగిపోవడానికి సోమాతి అమావాస్య రోజున రావి చెట్టు పరిసర ప్రాంతాన్ని శుభ్రపరచి చక్కని అందమైన రంగులతో ముగ్గులు వేసి,రాగి చెంబులో స్వచ్చమైన నీళ్ళనుపోసి అందులో కొన్ని ఆవుపాలు,చక్కర, చిటికేడు పసుపు కుంకుమ,ఎర్రని పువ్వు వేసి ఈ నీళ్లను రావి చెట్టునకు ప్రదక్షిణలు చేసేప్పుడు చెట్టు మొదళ్ళలో సన్నని ధారగా పోస్తూ 108 సార్లు ప్రదక్షిణలు నిధానంగా చేసి నట్లయితే అంతా శుభం కలుగుతుంది.ఈ రోజున పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారు సంతృప్తి చెంది మేలు చేస్తారని పెద్దలు చెబుతారు.

Somvati Amavasya 2019: Know Puja Vidhi Of Mauni Amavasya

ఈ అమావాస్య రోజున పెళ్ళి అయిన వారు,పెళ్ళికోసం ఎదిరిచూసేవారు ఈ రావిచెట్టునకు పై తెలిపిన పూజా విధానాలతో భక్తి శ్రద్ధలతో 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ రాగి చెంబులో తెల్లని ధారం ఉండా వేసి అందులో దారం మునిగే వరకు నీళ్లను,కాస్త పసుపును వేసి ఎడమ చేతిలో రాగిచెంబు పట్టుకుని పసుపు నీళ్ళలో మునిగిన ధారాన్ని కుడి చేతుతో పట్టుకుని ఓం శ్రీ అశ్వత్త వృక్షరాజాయ నమ: అని స్మరిస్తూ రావి చెట్టునకు 108 చుట్లూ చుట్టాలి.దారం చివరి కొసను మొదటి కొసకు ముడివేస్తూ మనస్సులో ఉన్న కోరికను నెరవేర్చమని వేడుకోవాలి ఇలా చేయడం వలన మనస్సులో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి చక్కటి రెమిడీ.

పూజకొరకు మీమీ ఆర్ధిక శక్తి స్థోమత,సామర్ధ్యాలను బట్టి పూలదండలు,కొబ్బరికాయ,పండ్లు,అగరొత్తులు,దీప,దూప,నైవేద్యాలు ఇత్యాదులను సమర్పించెప్పుడు మానసిక సంతృప్తి చెందుతూ చెయాల్సి ఉంటుంది ఇది గమనించాలి.అప్పులు చేసి పూజ చేస్తే ఫలితం ఉండదు.ఎదైన ధర్మబద్దమైన కష్టార్జితంతో చేసే దానికే శుభఫలితాలు ఉంటాయి.

సోమావతి అమావాస్య రోజున శారీరక శక్తి కలిగినవారు ఉపవాసం చేసి శక్తి కొలది పేదలకు,ఆకలితో ఉన్న ఏ జీవరాశులకైన ఆహారపానీయాలు అందిస్తే జాతకంలో ఉండే గ్రహా దోషాలు శాంతిస్తాయని ప్రతీతి.అమవాస్య అంటే కారు చీకటి మరుసటి రోజునుండి శుక్లపక్షం ప్రారంభం అంటే మన ప్రయాణం పౌర్ణమి అంటే వెలుగు వైపు ప్రయాణం చేస్తుంది.అందుకే అమావాస్య రోజు దైవభక్తితో సత్కార్యాలు చేస్తూ భగవత్ ఉపాసకులు కావాలని సూచిస్తుంది.

దైవత్వం అంటే నీవు అందరి పట్ల అన్ని వేళల సేవా దృక్పదంతో మేలుచేస్తూ నీ శక్తి కొలది ఎదుటి వారికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అసలైన మానసిక సంతృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది.మనం ఎంత సంపాధించి అది శాశ్వతం కాదు ఏది నీ వెంట రాదు.కానీ దాన,ధర్మ గుణం నిన్ను వెన్నంటే ఉంటూ దైవత్వం సిద్ధింపజేస్తుంది. ఇంతకు మించిన గొప్ప అనుభూతి ఇంకేముంటుంది.మానవ సేవయే మాధవసేవా అని ఊరికే అనలేదు...... జై శ్రీమన్నారాయణ.

English summary
Somvati Amavasya 2019. Know Puja Vidhi Of Mauni Amavasya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X