హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనాల ఉత్సవాల్లో 'ఫలహార బండి' విశిష్టత: 'రంగం' ప్రత్యేకతలు..

అమ్మవారి గుడికి ప్రదక్షిణలు చేసి, నైవేద్యాలను ఆ అమ్మకు సమర్పించి, ప్రసాదంగా కొంత ఇంటికి తెచ్చుకుంటారు. ఇరుగుపొరుగుతో ఆ మహాప్రసాదాన్ని పంచుకుంటారు.

|
Google Oneindia TeluguNews

ఫలహారపు బండి అంటే ?

బళ్లతో ఫలహారం భకులు బోనాల పండుగ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తమ ఇంట్లోవండి, వాటిని బళ్లలో పెట్టుకొని గుడికి బయలుదేరుతారు. అమ్మవారి గుడికి ప్రదక్షిణలు చేసి, నైవేద్యాలను ఆ అమ్మకు సమర్పించి, ప్రసాదంగా కొంత ఇంటికి తెచ్చుకుంటారు. ఇరుగుపొరుగుతో ఆ మహాప్రసాదాన్ని పంచుకుంటారు. ఇలా ప్రసాదాలను బళ్లపై తీసుకువచ్చే ప్రక్రియనే ఫలహారపు బండుగా పిలుస్తారు.

పోతురాజులు ఎవరు ?

పోతరాజు నృత్యాలు బోనాల ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ.

పోతరాజు జగన్మాతకు సోదరుడని భక్తుల విశ్వాసం. పోచమ్మ, వంటి పలు గ్రామదేవతల రూపంలో అమ్మవారు గ్రామంలో పూజలందుకుంటుంటే, ఆమె సోదరుడైన పోతరాజు గ్రామరక్షణ బాధ్యతలు నిర్వహిస్తాడు. బోనాల రోజున వంశపారంపర్యంగా పోతరాజులుగా వ్యవహరించేవారు.

ఒళ్లంతా పసుపు రాసుకొని, కటివస్తాలు (లంగోటి), కాళ్ళకు గజైలు కట్టుకుని, కళ్ళకు కాటుక, నుదుట కుంకుమ దిదుకుని, నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొన్ని ఉత్సవాలలో పాల్గొంటారు. వీరు నడుం చుటూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపు తాడుతో చేసిన కొరడాను రుళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా నాటం చేసూ మహాభక్తి పారవశ్యంతో సోదరికి తీసుకుపోయే ఫలహారం బళ్లముందు వీరంగాలు వేస్తు, కదలి వెళతారు.

specialities of palaram bandi in telangana bonalu festival

పోతుల బలి

బోనాల చివరి రోజున అంటే పోతురాజు బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్వకాలంలో అమ్మవారికి బలి ఇచ్చేవారు. ఒకే వేటుకు దున్నను ఇచ్చేవారు. ఆ తెగిపడన తలను పోతరాజులు తలకెత్తుకుని, నృత్యాలు చేసూ అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేసేవారు.

Recommended Video

Bonalu Jatara Celebrations Start in Golkonda, Hyderabad | Oneindia Telugu

బలి సామగ్రిని ఆలయం పరిసరాల్లో చల్లేవారు. అసంఖ్యాకంగా జంతువుల బలి కారణంగా వాటి రక్తం ప్రవాహాలుగ " పారేది. బలి జరిగిననాటి రాత్రి పెద వాన కురిసి, ఆలయం ప్రక్షాళితమయ్యేది.

జంతుబలుల నిషేధం అమలులోకి రావడంతో ప్రస్తుతం జంతుబలి స్తానంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఈ కూష్మాండబలి జరిగిన నాటి రాత్రి వాన కురుస్తుంది. ఇది అమ్మవారు ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసిందనడానికి నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు.

రంగం అంటే

ఆదివారంనాడు బోనాలు జరిగితే, మర్నాడు నిర్వహింపబడుతుంది. రంగం అంటే భవిష్యత్తుని వినిపించడం. సోమవారం ఉదయానే ఆలయ ముఖమండపంలో మాతం దీక్షలో ఉన్న అవివాహిత అమ్మవారి ఎదురుగా ఒక పచ్చికుండపై నిలబడి, అమ్మవారి రూపంగా కనబడుతుంది.

ఆషాఢమాసంలోనె ఎందుకు బోనాలు ?

ఆషాఢమాసం వానలు ప్రారంభమవడానికి మొదటి మాసము, తెలంగాణ మొత్తము చెరువుల మీద ఆధారపడి బతికే జనజీవనము వ్యవసాయ జీవనము కొనసాగుతుంది. ఈ కాలములో కురిసే వానలు చెరువులు నింపడానికి దైవప్రార్థన చేస్తారు. అలాకురిసిన వాన వల్ల చెరువులు పొంగ కూడదని దానివల్ల తమ గ్రామము, కుటుంబము, పాడి పశు సంపద, దెబ్బ తింటుందని అమ్మవారికి ఆచెరువు దగ్గర స్థాపన చేస్తారు.

ఆ అమ్మవారికి వానాకాలం ప్రారంభంలో బలి సమర్పిస్తారు. దానినే బోనాలు అంటారు. అందుకే ఆషాఢమాసంలో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా హైదరాబాద్ పట్టణము ఎక్కువగా ఎగుడు దిగుడులున్న ప్రాంతము. ఒకప్పుడు వందకు పైగా చెరువులు, వాటి ఒడ్డున కట్టమైసమ్మ, పోచమ్మ మొదలైన పేర్లతో అమ్మవారి ఆలయాలుకుడా వెలిసాయి.

వీటికి నిజాం కాలము నుండే ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వచ్చింది. నిజాం ప్రభువుకుడా అమ్మవారికి బోనం సమర్పించారని చెపుతారు.

English summary
Bonalu is a festival of the Goddess of power, Mahakali, celebrated in Hyderabad, Secunderabad and parts of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X