• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోర్కెలు తీర్చే శ్రీ వరద వినాయక స్వామి ప్రత్యేకత.. పురాణ గాథ

|

రుక్మాంగదుడను రాజు వేటకై వెళ్ళి అలసిపోయి దప్పికగొని దాహము తీర్చుకొనుటకై వాచకవి అనే ముని ఆశ్రమమునకు వెళ్ళెను. మునీశ్వరుడు స్నానమునకు పోవుచు, రాజును తన ఆశ్రమములో కూర్చొనుమని చెప్పెను.

ఇంతలో మునిపత్ని ముకుంద అతనిని చూచి మోహమునమునింగెను. రుక్మాంగదుడు మహా శీలవంతుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు. ఆమె కోర్కెను తిరస్కరించెను. ఆమె కోపించి, అతనిని కుపురోగి అగునట్లు శపించెను. శాపగ్రస్తుడైన రుక్మాంగదుడు కుపురోగనివారణకై నారదమునీంద్రుని ఉపదేశానుసారము, గణపతిని ధ్యానించి, పూజించి, రోగ విముక్తుడయ్యెను.

speciality and significance of varada vinayaka swami

కాని మునిపతియైన ముకుందకు రుక్మాంగదునిపై మోహము వీడలేదు.

ఇది గ్రహించి ఇంద్రుడు రుక్మాంగదుని రూపములో వచ్చి ముకుంద కోర్కెను తీర్చెను. ముకుందకు మగశిశువు జన్మించెను. అతనికి మునీశ్వరుడు "గృత్స్నమదుడు' అని నామకరణము చేసెను. గృత్స్నమదుడు మునీశ్వరుడాయెను.

ఒకనాడు అత్రి, విశ్వామిత్రుడు మరియు ఇతర మునులతో గృత్స్నమదుడు ఆధ్యాత్మిక వాగ్వివాదమునకు దిగగా, వారు 'నీవు ఋషి పుత్రుడవుకావు, రుక్మాంగద రాజపుత్రుడవు, అందుచే మాపంక్తి కూర్చొనతగవు, అని అతనిని అగౌరవించిరి. గ్భతమదుడు చింతాక్రాంతుడై తన తల్లియైన ముకుందను నిజము చెప్పమని అడిగెను.

ఆమె నిజము చెప్పెను. గృత్స్నమదుడు కోపగించి తన తల్లిని ముళ్ళపండుగల ముళ్ళ వృక్షముగా మారి అందరి చేత వదిలివేయబడుదువు గాక" అని శపించెను. ఆమె కూడ తన కుమారునకు 'త్రిలోకాలకూ కంటకుడైన వాడూ, మహా బలపరాక్రమోపేతుడైన రాక్షసుడు కుమారుడుగా జన్మించుగాక!' అని ప్రతి శాపమిచ్చెను.

అప్పడు ఆకాశవాణి ' గృత్స్నమదుడు ఇంద్రుని పుత్రుడు"-అని పలికెను. తల్లి, కుమారుడు ఆశ్చర్యచకితులైరి. కాని గ్భత్సమదుడు తన స్థితికి చింతించుచు, పుష్పక వనమునకు పోయి, కేవలము వాయువును భక్షించుచు వేయి సంవత్సరములు విఘ్నేశ్వరుని ధ్యానించుచు తపస్సు చేసెను.

ఆ తపస్సునకు మెచ్చి వినాయకుడు "నీవు చాల గొప్ప వేద బ్రాహ్మణుడవుగా, ద్రష్టగా కీర్తిని సంపాదించెదవు" అని వరమునిచ్చెను. గ్భతమదుడు సంతోషించి, "నీవు ఇక్కడనే అనుగ్రహమూర్తివై వెలసి, భక్తుల కోర్కెలను తీర్చుచుండుమని" కోరెను. వినాయకుడు అంగీకరించెను.

ఈ విధముగా ఇచ్చట వరద వినాయక స్వయంభువమూర్తివెలిసెను. తరువాత గ్భతమదుడు గణేశ ఆలయమును నిర్మించి ఆ మూర్తిని అందు ప్రతిష్ఠ చేసెను. ఈ ఆఖ్యానమును ఎవరు వింటారో, పరిస్తారో వారు సకల అభీష్టములను పొంది, గణేశానుగ్రహమువలన మోక్షమును పొందగలరు. శ్రీ గణేశ పురాణమునందలి 27, 28, 36, 37 అధ్యాయములలో ఈ ఆఖ్యానము చెప్పబడినది.

గమనిక : మహాడ్ గ్రామము రాయగడ్ జిల్లాలో ఖిలాపూర్ తాలూకాలో ఉన్నది, పూనా-బొంబాయి రైలు మార్గములో కర్జత్ నుండి యీ గ్రామము 24 కిలోమీటర్ల దూరములోనున్నది.

శ్రీ సిద్ది వినాయక

శ్రీ విష్ణుమూర్తి పాలపైపై యోగ నిద్రలో శయనించి యుండగా, నాభి నుండి బ్రహ్మయు, కర్ణములనుండి మధుకైటభులనురాక్షసులును పుట్టిరి. మధు కైటభులు తమ జన్మస్థానమును యెరుగక, శక్తివలన పుట్టితిమని తలంచి, ఆమెను ప్రార్జించిరి.

శక్తిప్రసాదమువలన వారు మహాబలవంతులై, గర్వించి, లోక కంటకులుగా మారి, సృష్టికర్తయైన బ్రహ్మనే బాధించి, మాటి మాటికి యుద్దమునకు రమ్మని పిలుచుచుండిరి. బ్రహ్మను భక్షించుటకు సన్నద్దులైరి, బ్రహ్మ మిగుల భీతిల్లి విష్ణుమూర్తిని ప్రార్జించెను. కాని విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనక పోవుటచే, బ్రహ్మ యోగనిద్రను ప్రార్జించి, విష్ణువును విడిచివెళ్లమని కోరెను.

యోగనిద్ర వెడలగానే, విష్ణువు మేల్కొని బ్రహ్మకు అభయమిచ్చెను. విష్ణువు మధుకైటభులతో ఐదువేల సంవత్సరములు భీకర యుద్ధముచేసెను. కాని వారే గెల్చుచుండిరి. అప్పడు విష్ణుమూర్తి శక్తిని, విఘ్నేశ్వరుని పూజించెను. శక్తి ఆ మధుకైటభులను మోహితులుగా చేసెను. విఘ్నేశ్వరుడు ఆ యుద్దమునందు సిద్ది అగునట్లు, దానవసంహారము నిరాటంకముగా జరుగునట్లు, విష్ణువును అనుగ్రహించెను.

అప్పడు విష్ణువు మధుకైటభులను యుద్దమునకు పిలిచి, "దానవులారా! మీరు నన్ను శరణువేడుకొనుడు" అని పలికెను. ఆ దానవులు గర్వాంధులై విష్ణువుతో పరిహాసముగా "నీవే మమ్ము ప్రార్ధించి వరమును పొందుము" అని పలికిరి. అటైన "మీరు నాచేత మృతులగునట్లు వరమీయుడు" - అని విష్ణువు వారిని కోరెను. దానవులు నివ్వెరపోయి, ఆడిన మాట తప్పలేక, మృత్యువునుండి తప్పించుకొనుటకై ఉపాయముగా "మమ్ము జలము లేనిచోట చంపుము" అని కోరిరి. కాని సర్వము జలమయమై యుండెను.

అందుచే విష్ణువు తన విశ్వరూపమును దాల్చి తన యూరువులను పెంచి, వానిపై ఆ దానవులను చంపెను. గణపతివలన కార్యసిద్ధి అయిన స్థలమగుటచే, ఇది సిద్ధక్షేత్రమయ్యెను. ఈ సిద్ధక్షేత్రమే ప్రస్తుత సిద్ధిటేక్ గ్రామము. గజాననుని అనుగ్రహమునకు ఎంతగానో సంతోషించిన మహావిష్ణువు, తానే ఈ క్షేత్రమునందు స్ఫటికమయమైన దేవాలయమును నిర్మించి స్వయంభువు గణపతిని అందు ప్రతిష్టించెను. ఈ గణపతియే సిద్ధిటేక్ యందలి సిద్దివినాయకుడు.

శ్రీ మహావిష్ణువుచే నిర్మింపబడిన ఈ దేవాలయము కాలాంతరమున శిథిలముకాగా, పీష్వాల కాలమునందు, ఆలయపునర్నిర్మాణము జరిగినది.

గమనిక: సిద్ధిటేక్ గ్రామము పూణేకు 96 కిలోమీటర్ల దూరములో అహమద్ నగర్ జిల్లాలో కర్జత్ తాలూకాలో భీమానదీ ఆవలి ఒడ్డున ఉన్నది. భీమానది యచ్చట పూణే జిల్లా అహమద్ నగర్ జిల్లాలకు సరిహద్దుగానున్నది.

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్‌ - భజనకు బదులుగా చేయవలసినవి

జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో,

జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో. ॥జయ॥

మూషికవాహన! నమో నమో, మునిజనవన్దిత! నమో నమో,

మాయారాక్షసమదాపహరణా! మన్మథారిసుత! నమో నమో ॥జయ॥

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక! నమో నమో,

విశ్వసృష్టిలయకారణ శంభో! విమలచరిత్రా! నమో నమో. ॥జయ॥

గౌరీప్రియసుత నమో నమో, గఙ్గానన్దన! నమో నమో,

గన్ధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమో నమో. ॥జయ॥

నిత్యానన్దా! నమో నమో, నిజఫలదాయక! నమో నమో,

నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథనుత నమో నమో. ॥జయ॥

English summary
Astrologer explains about significance of Varada Vinayaka Swamy for Oneindia.com readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more