• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రావణ మాసంలోనూ ముహూర్తాలు లేవు.. ఎందుకో తెలుసా..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ఆషాఢ శుద్ధ అష్టమి మంగళవారం అనగా 9.7.2019 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి మంగళవారం అనగా 18.9.2019 వరకు దాదాపుగా 69 రోజులపాటు శుభ ముహూర్తాలు లేవు. సాధారణంగా ఆషాఢంలో అనగా ఒక నెల రోజులు ఏ శుభకార్యాలు చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే. కాని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కూడా శుభ ముహూర్తాలు లేవు. కారణం ప్రస్తుతం శుక్ర మూఢం నడుస్తున్నది.

మూఢం అనగా శూన్య మాసం అని కూడా అంటారు. ఈ సంవత్సరంలో ఏ శుభ కార్యాలు చేయరు. కానీ అన్నప్రాసనలు లాంటివి చేసుకోవచ్చు. శుక్రబలం గురు బలం అనేవి వివాహ, ఉపనయనాలకు తప్పనిసరి. ఈ సమయంలో ఈ శుక్రుడు రవి ఇద్దరూ ఒకే రాశిలో ఉంటారు. రవితో ఏ గ్రహం కలిసినా అది అస్తంగత్వం అవుతుంది.

sravana month also no muhurthas

అనగా తాను ఇచ్చే శుభ కిరణాలను భూమిపై ప్రసరింపజేయదు. ఆ శుభ కిరణాలు లేనప్పుడు దానినే అస్తంగత్వం అంటారు. ఈ కాలంలో శుభ గ్రహమైన శుక్రుడు బలహీనపడతాడు. ఈ బలహీనమైనప్పుడే అస్తంగత్వం చెందుతాయి.

శుభగ్రహమైన శుక్రునికి సంబంధించిన మూఢం అనగా శుక్ర మౌఢ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహ కారకుడు. వివాహ భావనలు ఇప్పుడు లోపిస్తారు. స్త్రీ పురుషుల మధ్యలలో ఆ ఆలోచనలు అంత అనుకూలంగా ఉండవు. ఒకరిని ఒకరు ఆకర్షించుకునే శక్తి ఇప్పుడు తక్కువగా ఉంటుంది. వివాహం అయిన వారికి కూడా వైవాహిక జీవనం అంత సాఫీగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇద్దరి మధ్యలో ఆకర్షణలు తగ్గుతాయి.

భాద్రపద మాసంలో మాములూగానే ముహూర్తాలు మళ్ళీ కార్తీకంలో ఉంటాయి. అందరూ కార్తీకమాసం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మార్గశిరంలో కూడా ఈ సంవత్సంలో ముహూర్తాలు లేవు. మార్గశిర మాసంలో కూడా మళ్ళీ మూఢమి వస్తుంది.

రవి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుంచి దక్షిణాయనం మొదలౌతుంది.ఈ దక్షిణాయనంలో ఎక్కువగా నోములు వ్రతాలు మాత్రమే చేస్తారు. ఏ పని చేసినా శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవడం అనే ప్రక్రియ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉంటుంది.

ఈ సమయంలో మూఢం కూడా రావడం వలన మానవ ప్రయత్నాలు అధికంగా చేయాలి. దైవం వైపు దృష్టి ఎక్కువగా నిలిపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేసే దీక్షలు అవి ఎక్కువ ఫలితాలనిస్తాయి. శరీరాన్ని కూడా బద్ధకించ కుండా ఉంచుకోవాలి.

ప్రస్తుత కాలంలో ఎవరి జాతకాలలోనైనా శుక్ర గ్రహం అనుకూలంగా లేకపోతే వారు కొంత జాగరూకులై ఉండాలి. ఈ 2 మాసాలు కూడా నిమ్మకాయ పులిహోర, అలంకరణ వస్తువులు, పూలు, డ్రై ఫ్రూప్ట్స్ వంటివి అధికంగా దానం చేయాలి.

ఈ సంవత్సరంలో వివాహాలు చేసుకోవాలనుకునేవారు, ఇళ్ళు కట్టుకోవాలనుకునేవారు, ఉపనయనం చేయాలను కునేవారు, అందరూ నిరంతరం ఏదో ఒక దైవ నామస్మరణలో ఉంటూ ఎవరి పుణ్యబలాన్ని వారు పెంచుకుంటూ మంచి సమయం కోసం వేచి చూడాల్సిందే. ఆ సమయం వచ్చినప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయకుండా పనులు పూర్తి అవుతాయి. ఇప్పుడు చేసే దైవిక ప్రయత్నాలు అప్పటికి ఉపయోగపడతాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ashadham means that a month does not do any good work. That is something that everyone knows. But this year's Sravanam month also has no good moments. The reason is currently running Venus superstition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more