వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్రహ్మణ్య షష్టి నవంబర్29: షష్టినాడు ఇలా పూజలు చేస్తే పట్టిందల్లా బంగారమే!!

|
Google Oneindia TeluguNews

నవంబర్ 29వ తేదీ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య షష్టి . అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు. ఇక ఈ సుబ్రమణ్య షష్టిని, స్కంద షష్టి, సుబ్బరాయ షష్టి అని కూడా పిలుస్తారు.

ఆ దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య షష్టి పూజలు చెయ్యండి

ఆ దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య షష్టి పూజలు చెయ్యండి


సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేసే వారికి కుజ దోషం పోతుందని ప్రధానంగా చెబుతారు. అంతేకాదు సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు సుబ్రహ్మణ్య షష్టి నాడు పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. నాగదోషం ఉన్నవారు కూడా సుబ్రమణ్య స్వామికి సంబంధించి పూజలు చేయడం వల్ల నాగ దోషం తొలగి పోతుందని చెబుతారు. చైత్ర శుద్ధ షష్టి నుంచి పూజను ప్రారంభించి, సంవత్సరమంతా షష్ఠినాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే నాగ దోషం తొలగి పోతుందని చెబుతారు. ఇక షష్టి ఆదివారం కలిసి వచ్చే రోజున షష్టి పూజను ప్రారంభించి ఆరు వారాల పాటు ఆదివారం నాడు షష్ఠి పూజలు నిర్వహించినట్లయితే నాగ దోషం పూర్తిగా తొలగిపోతుందని చెబుతున్నారు.

పాము పడగకు పూజలు చేస్తే నాగదోష హరణం

పాము పడగకు పూజలు చేస్తే నాగదోష హరణం

ఆదివారం, షష్టి కలిసి వచ్చే రోజున షష్టి పూజలను ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు మార్గశిర శుద్ధ షష్టి నాడు కూడా పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. సాధారణంగా సుబ్రహ్మణ్య షష్టి పూజలో భాగంగా పాము పడగ కు పూజాదికాలు నిర్వహిస్తారు. ఆరు వారాల పాటు అత్యంత నిష్టతో పూజలు చేసి, ఆపై సుబ్రహ్మణ్య దేవాలయం లో ఆ పాము పడగను సమర్పిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
ఇక సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామి వారికి తెల్లని పుష్పాలతో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, చిమ్మిడి నివేదించి అత్యంత భక్తి శ్రద్ధలతో షష్టి పూజలు చేస్తే కుజ దోష నివారణ జరుగుతుందని చెబుతారు.

సుబ్రహ్మణ్య స్వామి పూజలతో బుద్ధి కుశలత

సుబ్రహ్మణ్య స్వామి పూజలతో బుద్ధి కుశలత


సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేస్తే బుద్ధికుశలత వస్తుందని చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పూజ లో ప్రధాన భాగంగా భక్తి భావంతో పూజలు నిర్వహించడమే కాకుండా, ఎవరినీ దుర్భాషలాడకుండా ఉండాలని ప్రధాన నియమంగా చెబుతున్నారు. సుబ్రహ్మణ్య షష్టి నాడు ఆలయాలకు వెళ్లి పుట్టలో పాలు పోసి పూజలు చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెపుతున్నారు. అలా సాధ్యం కాని వారు ఇంట్లోనే పాము పడగకు పాలు పోసి అభిషేకం చేసి పూజలు చేయవచ్చని, వెండి పాముపడగ లేకపోతే, గోధుమ పిండితో అయినా పాముపడగ తయారుచేసి పూజలు చేసి సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించవచ్చు అని సూచిస్తున్నారు.

సుబ్రహ్మణ్య స్వామి పూజలతో పట్టిందల్లా బంగారం

సుబ్రహ్మణ్య స్వామి పూజలతో పట్టిందల్లా బంగారం


సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని దీక్షగా చేస్తే అది మన జీవితంలో ఎంతగానో పని చేస్తుందని చెబుతున్నారు. ఏదైనా పని అనుకుని, ఆ పనిలో విజయం సాధించడం కోసం ముందుకు నడవాలి అని భావించేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రమణ్య స్వామికి పూజలు చేస్తే కచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అని చెబుతున్నారు. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజల అనంతరం దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని చేసేవారు దుప్పట్లు, కంబళ్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం లోపు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుంది అని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు.


disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Vastu tips: వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చైనా ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుక్కోండి!!Vastu tips: వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చైనా ఈ వీధిపోటు ఉన్న స్థలాన్ని కొనుక్కోండి!!

English summary
Subrahmanya Shashti falls on November 29. Lord Subrahmanya is worshiped on that day for the prevention of Kuja and Naga doshas and for progeny. It is said that if you perform this puja before the evening of Shashti day, you will be wealthy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X