• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రవి సింహ సంక్రమణం ఆగస్టు16 తేదిన ఏ ఏ రాశులపై ప్రభావం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆగస్టు 16 తేది రోజున రవి కర్కాటకరాశి నుండి మఖ నక్షత్రం మొదటి పాదం, సింహరాశిలోకి రాత్రి 7:11 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. ఈ రాశిలోకి రవి ప్రవేశం వలన ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనుంది. వ్యక్తీ గత జాతక ఆధారంగా గ్రహ స్థానాల ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో హెచ్చు తగ్గు ఫలితాలు ఉంటాయి. కొందరికి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

జ్యోతిషశాస్త్ర ప్రకారంగా రవిని గ్రహ రాజుగా నిర్ణయించారు. మనకు సూర్యుడు ఉదయం, మధ్యాహాన్నం, సాయంత్రం సమయాలలో ఆకాశంలో గమనిస్తే ఎప్పుడు ఒకే చోట కాకుండా సూర్యుడిలో చలనం గమనిస్తుంటాం. చాలా వరకు సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుంటారు. వాస్తవానికి సూర్యుడు స్థిరంగా ఒకే చోట ఉంటాడు. భూమియే తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇదే క్రమంలో మిగితా గ్రహాలూ, ఉపగ్రహాలు అన్ని సూర్యుని చుట్టూ తిరగడం వలన సూర్యున్ని నవగ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అంటారు.

Sun enters Leo from August 16th,Who will be effected according to horoscope

శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితం అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. అంతే కాకుండా తలపెట్టిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో ఆగస్టు 16 నుండి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహరాశిలోకి రవి సంచారం వలన కొన్ని రాశులు ప్రయోజనం పొందనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల జీవితంలో ఫలితాలు అనేవి కొంచెం హెచ్చు తగ్గులు కనబడుతాయి. ఇంకొందరి వ్యక్తీ గత జాతక గ్రహాల స్థాన ప్రభావంగా ఫలితాలు జీవితంలో చాలా మార్పులకు కారణం అవుతుంటాయి, అవేమిటో గమనిద్దాం.

​వృషభరాశి వారికి :- రవిగ్రహ సంచారం వలన ప్రయోజనం కలిగిస్తుంది. ప్రభుత్వ పథకాల వలన ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. ఉద్యోగ స్థానంలో కలిసి పనిచేసే కొలీగ్స్ నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని చవిచూస్తారు. కుటుంబ వాతావరణం కూడా సంతోషకరంగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలిసి ప్రయాణాలు సాగించే అవకాశముంది. బందుమిత్రుల సహకారాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

మిథునరాశి వారికి :- రవిగ్రహ సంచారం వలన లాభసాటిగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ సామాజిక స్థాయి పెరగుతుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. తోబుట్టువుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే వారు అనుకున్న మైలురాయిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహకారాలు మెండుగా లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

సింహరాశి వారికి :- రవిగ్రహ సంచారం ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో అనేక సానుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఎంచుకున్న రంగంలో పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది. మీ పనులు కొంత స్థంభన కలిగిన వాటికి అవి ప్రభుత్వ సాయంతో పూర్తవుతాయి. తలపెట్టిన అన్ని పనులు సకాలంలో నెరవేరడం మూలానా మానసిక ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెంచుతుంది. జ్యోతిష సూత్రాలకు అనుగుణంగా నడచుకుంటే ప్రయోజనం చేకూరుస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

English summary
According to science the development of a person's life begins when the sun is strong in the horoscope. Apart from that all the tasks in the head are easily completed. The sun will enter Leo from August 16 in this order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X