• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూర్యుడు తులారాశిలో ప్రవేశం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం-ట్రంప్‌కు తప్పని ఇబ్బందులు-బంగారంపైనా..!

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

17 అక్టోబరు 2020 శనివారం రోజున సూర్యుడు చిత్తా నక్షత్రం మూడవ పాదం, భారత కాలమానం ప్రకారం ఉదయం 07.05 నిమిషాలకు తులారాశిలోకి ప్రవేశం చేశాడు. సూర్యునకు తులారాశి శత్రు క్షేత్రం అవుతుంది, సూర్యుడు తులా రాశిలో నవంబర్ 16 వరకు ఉంటాడు. తులారాశిలో సూర్యుడు సంచరించడాన్ని తులా సంక్రాంతి అని పిలుస్తారు.

 ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం

ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం

సూర్యుడు తులా రాశిలో ఉండగా ఫలితం ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం ఎదురుకాబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా చంద్రుడు, బుధుడు తిరోగమనం వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి. తులారాశిలో సూర్యుడు స్థానచలనం వల్ల రాజకీయ నాయకులకు, అధికారులు, పెద్ద పారిశ్రామిక వేత్తలకు నష్టం కలిగే అవకాశముంది. ఈ నెల రోజులలో రవి శుభ ఫలితాలను ఇవ్వలేదు. సూర్యుడు తులారాశిలో మార్పు చెందినప్పుడు ఆర్థిక మాంద్యం, రాజకీయ, సామాజిక ఒడిదుడుకులు ఏర్పడతాయి.

 ట్రంప్‌కు ఇబ్బందులు.. చైనా సరిహద్దులో అలజడి

ట్రంప్‌కు ఇబ్బందులు.. చైనా సరిహద్దులో అలజడి

వాతవారణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు బంగారానికి అధిదేవత కాబట్టి బంగారం ధరలు పెరుగును, ధాన్యాల ధరలు పెరుగుతుయి. భారతదేశం మకరరాశికి చెందినది తులారాశిలో ఉన్న రవివలన భారతదేశానికి సంబంధించిన మకరరాశి చతుర్ధ దృష్టి వలన వేధా స్థానం అవుతుంది రవి వేధన వలన రాబోయే నెల రోజుల్లు ఇండియా మరియు చైనా సరిహద్దులలో ఆవంచనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముంది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తులారాశిలో సూర్యుడు ఉన్న కారణం వలన ప్రతికూలంగా ఉంటుంది. ట్రంప్ రాశి అయిన సింహంలో శని, గురుడు కేంద్రీకృతమై ఉండటం వల్ల పదవీగండం ఉండే అవకాశముంది. ఈ ఫలితంగా ప్రపంచ మార్కెట్లపై ప్రభావముంటుంది.

 ఎవ్వరికీ అనుకూలం కాదని చెబుతున్న జ్యోతిష్యశాస్త్రం

ఎవ్వరికీ అనుకూలం కాదని చెబుతున్న జ్యోతిష్యశాస్త్రం

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహ 'రాజు' అధిపతిగా భావిస్తారు. సూర్యుడు తన స్థానంలో మార్పు చేసుకుంటున్న ఫలితంగా ప్రజలపై ప్రభావం పడుతుంది. జ్యోతిషం ప్రకారం సూర్యుడు. ఏదైనా రాశిచక్రంలో మార్పు చెందినట్లయితే లేదా సంక్రాంతి చెందినట్లయితే ఆర్థిక మాంద్యం, రాజకీయ, సామాజిక ఒడిదుడుకులు, వాతవారణంలో మార్పులు లాంటివి సంభవిస్తాయి. సూర్యుడు తుల రాశిలో మార్పు చెందినప్పుడు బంగారం మరియు ధాన్యాల ధరలు పెరుగుతుయి.నాయకులకు, అధికారులకు, పారిశ్రామిక వేత్తలకు ప్రముఖులకు అంత అనుకూలం కాదనే చెప్పాలి, నష్టం జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. సూర్యుడు మరియు గురు గ్రహాలకు జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక స్థానముంది. వీటిని బంగారు కారకాలుగా పరిగణిస్తారు. తులా రాశిలో సూర్యుడి ప్రయాణం వలన బంగారం ధర పెరిగే అవకాశముంది. పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారంలో మదుపు చేసేందుకు మక్కువ చూపిస్తారు.

 బంగారం ధరలపై ఎఫెక్ట్

బంగారం ధరలపై ఎఫెక్ట్

తులారాశిలో సూర్యుడు, మకరం పదో పాదంలో శని ప్రయాణిస్తుండటం, మీనం ఎనిమిదో పాదంలో అంగారకుడు ఉండటం వల్ల రాబోయే నెల వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడు, బుధుడుపై శని, అంగారకుడి చెడు దృశ్యం ఉండటం వల్ల గోధుమ, బియ్యం, పప్పు ధాన్యాలు ధరలు కూడా పెరుగుతాయి.​సూర్య సంక్రాంతి జాతకంలో మేషంలోని ఆరో పాదంలో అంగారకుడు, మకర శని వలన మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. కుజుడు ఆరో స్థానం గమనిస్తే ఇది సరిహద్దులో యుద్ధాన్ని సూచిస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాశి అయిన వృశ్చికంలో సూర్యు, చంద్రులు భ్రమిస్తున్నారు. ఫలితంగా మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రధాని జాతకరీత్యా ఆయన రాశిలో 12వ పాదంలో సూర్యుడు కదలనున్నాడు. ఇండియా చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులు. శని, అంగారక గ్రహాలు కూడా ఉన్న నేపథ్యంలో యుద్ధాన్ని సూచిస్తుంది.

  గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత
   పారిశ్రామిక సినిమా రంగంవారిపై ఎక్కువ ప్రభావం

  పారిశ్రామిక సినిమా రంగంవారిపై ఎక్కువ ప్రభావం

  సూర్యుడు తానున్న రాశి నుండి 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలకు చెడు ఫలితాలు ఇస్తాడు. అంటే తులా, వృశ్చిక, మకర, కుంభ, మేష, వృషభ, మిధున, కన్యా రాశుల / లగ్నాన వారు కొంత జాగ్రత్తలతో వ్యవహరించడం అవసరం. ఈ రాశులు లేదా లగ్నాల సంబంధితమైన రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలలోని ప్రముఖులపై ప్రభావం ఎక్కువ చూపనున్నది. వ్యక్తిగత జాతక ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉంటాయి. సూర్య గ్రహం అనుకూలతల కొరకు ద్వాదశ రాశుల వారు సూర్య సహస్ర నామం లేదా సూర్యాష్టకం చదువుకోవాలి. జిల్లేడు ఆకులతో సూర్యున్ని పూజించాలి. ఆదివారం మఖ, కృత్తిక, స్వాతి, రేవతి, పుష్యమి నక్షత్రాలు కలిసిన ఆది 'భాను'వారం చేస్తే శ్రేష్టం.

  English summary
  It should be understood that the result will be a major crisis in the economy while the sun is in Libra.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X