వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘంటానాధం: దేవాలయాల్లోని గంట వల్ల ఏం జరుగుతుంది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలోజర్ -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఘంటా నాధం దేవాలయాలలో మ్రోగించే గంట సకలశుభాలకు సంకేతం. ప్రత్యేక పూజాసమాయాలలో మ్రోగించే గంట, మన మనసులను ఆధ్యాత్మికానందంతో నింపుతుంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందనీ, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి ఉండటంవల్ల గంట దైవస్వరూపమని మన పెద్దల నమ్మకం.

Temple bell sound effect

గంటకు ఉండే పిడిలో ప్రాణశక్తి ఉంటుంది. ఈ పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది, వృషభ మూర్తులతో దర్శనమిస్తుంటుంది. కంచుతో తయారయ్యే గంటను మ్రోగించినపుడు 'ఓం' అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది. గంట గరుడునికి ప్రతీకగా పేర్కొంటారు. ఆలయంలో మ్రోగించిన గంటానాదం నలుదిక్కులా వ్యాపించి, దుష్టశక్తులను దూరంగా తరిమివేస్తుందట.

తద్వారా మన మనసులు పవిత్రమై, దైవం పట్ల మన మనసు లగ్నమవుతుంది. సాధారణంగా ఆలయాలలో గంటానాదం అర్చన, ఆవాహనం, దూపసేవ, దీపసేవ, అర్ఘ్యం, నైవేద్యం, పూర్ణాహుతి సమయాలలో మ్రోగించబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్క పూజ గంటానాదం లేనిదే పూర్తి కాదన్నది నిజం.

ప్రతి పూజ ప్రారంభ సమయంలో గంటను మోగిస్తారు గంటను మ్రోగించటం భగవంతుడికి ఆహ్వానం పలుకుతునట్లు భావిస్తారు.

పూజ ప్రారంభంలో ఈ క్రింది మంత్రం చెబుతూ ఘంటానాదం చేస్తాము.

శ్లో!! ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం !
......కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం !!
అంటే, ఘంటానాదం వలన దేవతలకు స్వాగతం తెలుపుతూ రాక్షసులకు గమనం చెప్పడం.
అనగా మనం దేవతా మందిరం లోకి ప్రవేశించగానే, పై మంత్రం చెప్తూ ఘంటానాదం చేయాలి.
ఇంకా.... దేవతలకి అభిషేకం చేసే సమయంలో, యజ్ఞోపవీతం వేసే సమయంలో, ధూపం వేసే సమయంలో, హారతి నీరాజనం ఇచ్చే సమయంలో ఘంటానాదం చేయాలి !

.

ఘంట మంత్రం:- "ఘంటాంతు తాడయేద్ధీమాన్ అస్త్రమంత్రం సముచ్చరన్"
ఈ గంటను ప్రయత్న పూర్వకంగా క్రమపద్ధతి లో మ్రోగించుట వలన మన దైవిక పూజ సాఫల్యమగును.

పూజా సమయంలో వివిధ ఉపచారములలోను గంటను మ్రోగిస్తారు.
ముఖ్యముగా నైవేద్య సమయమున నీరాజనం సమయమున ఘంటనాదం చేసెదరు.
ఈ ఘంటకు అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు గంట లో శబ్దాన్ని పుట్టించే నాళమునకు ఆదిశేషుడు గంటనుండి ఉత్పన్నమయి శబ్దమునకు ఓంకారం ప్రతిధ్వనిస్తుంది.

ఆ శబ్ద తరంగాలు చుట్టూ వున్న పరిసరాల్లో ధ్వనించటం ద్వారా శాంతి చేకూరుతుంది.

పూర్వం రాజులు, చక్రవర్తులు, ప్రజలు గుడిలోని నైవేద్య ఘంటనాధం వినిపిస్తే కాని బుజించేవారు కాదు.
పూజలలో ఉపయోగించే ఘంటను మూడు రకాలు గా విభజించారు.

చేతి ఘంట:
పూజ సమయంలో చేతితో కదిలించుచు మ్రోగించే ఘంట.
జేగంట గుండ్రముగా వున్న కంచు పలకపై చక్కతో కొట్టుట ద్వారా మ్రోగించునది ఈ గంటను ఆలయములో బలిహరణ సమయమున ఊరేగింపు ఉత్సవముల సమయము లో ఉపయొగించదెరు.
వ్రేలాడు గంట:
ఈ గంట దేవాలయములలో అందరికి తెలిసిన గంట
ఈ గంటను దేవాలయము లో ప్రవేశించు సమయమున మృదువుగా ఒకవైపు మాత్రమే తగులునట్లు మ్రోగించాలి. తీవ్ర ధ్వనితో మ్రొగించరాదు.

దేవాలయము బయటకి వచ్చునప్పుడు మ్రొగించరాదు. ఘంటనాదం దేవతలకు ఆహ్వానం పలకటమే కాదు రాక్షస శక్తులను పారద్రోలుతుంది.
పూజలో గంటను ఎడమచేతి వైపు వుంచుకోవలెను కుడి చేతితో ఉపచారములు చేయుచు ఎడమచేతితో శ్రావ్యముగా గంటవాయించవలెను.

గంట మ్రోగుతున్నప్పుడు, శబ్దం శ్రావ్యంగా ఉండాలన్న విషయంపైనే అందరి దృష్టి నిమగ్నమవుతోంది.

ఆలయ ప్రధానద్వారం దగ్గర మహాగంట ఉంటుంది. ప్రాత:కాలంలో పూజారి అలయ ప్రవేశం చేస్తున్నప్పుడు ఈ మహాగంట మూడుసార్లు మ్రోగించబడుతుంది. ఇది ప్రాత:కాలంలో అందరినీ మేలుకోలపడమేకాక, సమస్త దుష్టశక్తులను దూరంగా ప్రారద్రోలుతుంది. సాధారణంగా మహా గంటానాదం ఆలయం చుట్టుప్రక్కల ప్రదేశాలలో 10 కిలోమీటర్ల విస్తీర్ణం మేర వినబడుతుంది. నైవేద్యాన్ని సమర్పిస్తున్నపుడు, మ్రోగుతున్న గంటానాదం మహామంగళహారతి వరకు కొనసాగుతుంది.

మానసిక ప్రశాంతత వస్తుందట.

గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయని, మానసిక రుగ్మతలను దూరంచేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయని అంటారు.గంట శబ్ధం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి.

శివునికైతే నంది గంట(నంది ఆకారం చెక్కబడిన గంట), విష్ణువుకైతే ఆంజనేయుడు - గరుత్మంతుడు చెక్కబడిన గంటలు ఉపయోగించాలట.

రోజువారిగా ఇంట్లో పూజించేటప్పుడు ఇలాంటి భేదం పాటించాల్సిన అవసరం లేదని అంటారు. ఘంటానాదం వలన మనము ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొంది, మనస్సును భగవంతునిపైన లగ్నం చేయగలుతాము. అంటే ఘంటానాదం చంచలమైన మన మనస్సును దైవంపై కేంద్రీకృతమయ్యేందుకు ఉపకరిస్తుంది.

English summary
Ghanta is the Sanskrit term for a ritual bell used in Hinduistic religious practices. The ringing of the bell produces what is regarded as an auspicious sound.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X