వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్ఞాన (కర్మ) ఇంద్రియాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

The 5 sense organs in our body are EYES, TONGUE, NOSE, EARS and SKIN

*పంచేంద్రియములు అనగా:-
1.చర్మం,
2.నాలుక,
3.ముక్కు,
4.కనులు,
5.చెవులు అనేవి పంచేంద్రియములుగ పిలువబడుతాయి.

*జ్ఞానేంద్రియములు అనగా:-
1.చర్మం (స్పర్శ)
2.నాలుక (రుచి)
3.ముక్కు (వాసన)
4.కనులు (రూపం)
5.చెవులు (శబ్ధం)

స్పర్శ,శబ్ధ,రూప,రస,గంధ(వాసన)లు అని మనిషి శరీరం ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలతో కలిసి మనస్సు అధీనంలో పని చేస్తుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి. వార్తలు తెలియజేస్తుంటాయి. వీటికి తమ స్వంత ఆలోచనలు కోరికలు ఉండవు,కేవలం మనస్సు చెప్పినట్లుగా స్పందిస్తుంటాయి.

మనస్సు చాలా విచిత్రమైనదని ముందే అనుకున్నాం మనం. ఈ మనస్సు తనకు అనుసంధానమై అనుబంధమైన ఈ దశేంద్రియాలను చూసుకుని ఎక్కువగా గొప్పలు పోతూవుంటుంది. అనేకసార్లు దెబ్బలుకూడా తింటూవుంటుంది.ఇంతకీ ఈ మనస్సు గొప్పేంటి అంటారా? చెవులు ద్వారా అతి సున్నితమైన శబ్దాలని వింటుంది. కనుల ద్వారా ప్రకృతిలోని అందాలని చూస్తుంది. ముక్కుద్వారా సువాసనల్ని గ్రహిస్తుంది. నాలుకద్వారా రుచుల్ని గ్రహిస్తుంది. చర్మం ద్వారా స్పర్శజ్ఞానం పొందుతుంది.

ఈ ఐదింటి ద్వారా కలిగిన జ్ఞానాన్ని తన కర్మేంద్రియాలైన నోరు, కాళ్ళు, చేతులు మొదలైన వాటిద్వారా తన మనసులో కలిగిన కోరికలకు కార్యరూపం ఇస్తుంది, అనుభవిస్తుంది.ఇబ్బంది ఎక్కడుందంటే,తన జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన విషయాల్ని అతిగా వాడుకొని కష్టాలు కొనితెచ్చుకుంటుందీ మనస్సు.

ఉదాహరణకి చెవులద్వారా ఎన్నో వినదగన విషయాలను విని ఇతరులకు చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. తనంత జ్ఞానవంతురాలు మరొకరు లేరని విర్రవీగుతుంది.మరొక ప్రక్క వినకూడని విషయాలను విని అనవసరం అయినా అవసరం లేని వ్యక్తుల చెవుల్లో ఊదుతుంది. దాంతో వ్యక్తుల మధ్య గొడవలు రేగి వారు దెబ్బలాడుకుంటారు కొన్నిసందర్భాలలో చెప్పిన వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పవు మరి! ఇది ఈ మనస్సుయొక్క విచిత్రమైన తత్త్వం.మనిషి యొక్క సూక్ష్మశరీరాన్ని స్థూల శరీరం వరకు విస్తరింపజేస్తుంది.మనస్సు శరీర పరిదికి తెలిసేలా చేస్తుంది.

English summary
The 5 sense organs in our body are EYES, TONGUE, NOSE, EARS and SKIN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X