వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశేషాలు: సంక్రాంతి పురుషుడు రాక్షస

మకరరాశిలో సూర్యుడు ప్రవేశించేదినం మకరసంక్రాతి. ఈనాటి నుంచి సూర్యుడు కర్కటకరాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు మకరసంక్రాతి వరకు దక్షిణాయనము.

By Pratap
|
Google Oneindia TeluguNews

నిరుపమ లీల బాలికలు నిశ్చల భక్తిని యుక్తి సంకురా
తిరి నెలంటేడ గొబ్బిలులు బీర్తురు వాకిళులందు వ్రుగులన్
బొలిసారి బొమ్మలన్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలో
బరువడినారంగించెదరు పచ్చడి బెల్లము ఫుల్లమిచ్చలన్,
తెలుగునాడు - దాసు శ్రీరాములు

మకరరాశిలో సూర్యుడు ప్రవేశించేదినం మకరసంక్రాతి. ఈనాటి నుంచి సూర్యుడు కర్కటకరాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు మకరసంక్రాతి వరకు దక్షిణాయనము.

ఉత్తరాయణము పుణ్యకాలమనీ, దక్షిణాయణము అంతమంచిది కాదనీ అంటారు. వివాహాలు, ఉపనయనాలు సాధారణంగా ఉత్తరాయణంలోనే చేస్తారు. ఉత్తరాయణంలో చనిపోయిన వారు వెంటనే స్వర్గలోకంలోకి వెళ్లిపోతారు. దక్షిణాయనంలో చనిపోయేవారు ఉత్తరాయణం వచ్చే వరకు స్వర్గద్వారాల వద్ద వేచి వుండాలి. కాగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణం పుణ్యాత్ములకే కాని లభించదంటారు.

మకర సంక్రాతి పర్వం అతి పురాతనమైందిగా కనిపిస్తుంది.

గుణవంతురాలు, పతివ్రత ఐన కృపి అనే స్త్రీ వుండేది. ఋషి తుల్యుడైన ద్రోణాచార్యుల భార్య ఆమె. ఆ భార్యాభర్తలు ఒక ఆశ్రమంలో వుంటూ వుండేవారు.

ఒకనాడు ద్రోణాచార్యుడు బయటికి వెళ్లాడు. ఆశ్రమంలో కృపి ఒక్కర్తీ కూచుని వుంది. ఆ సమయంలో దుర్వాసముని సమిధల కొరకు అన్వేషణ సాగిస్తూ మార్గవసాత్తు అచ్చటికి వచ్చాడు. వచ్చిన మునిని కృపి పూజించింది. తమ పేదతనాన్ని చెప్పకుంది. ఒక ముసలి ఆవు తప్ప తమకు ప్రపంచంలో ఏమిూ ఆస్తి లేదని చెప్పకుంది. తమకు పిల్లలు కూడా లేరని చెప్పకుంది. తమకు భాగ్యప్రదమైన సాధనమేదేనా చూపించమని కోరింది.

ఆమె ప్రార్థనా మృదూక్తులకు ముని దయార్ధ హృదయుడైసంక్రాతి పర్వాన్ని జరుపమని ఉపదేశించాడు. ఆ వ్రత విధానం ఇది. సంక్రాంతినాడు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మడికి పెరుగుదానం చేయాలి. నందుని భార్య ఐన యశోద ఇట్లే బ్రాహ్మడికి పెరుగు దానం చేసింది. ఆదానానికి ఫలితంగానే ఆమెకు శ్రీకృష్ణుడు కొడుకుగా లభించాడు. ఆ కొడుకు వారి పేదతనాన్ని బాపి తన తండ్రి ఐన నందుని గొల్లకులానికి రాజుని చేశాడు.

-ఈ సంగతులన్నీ చెప్పి ఆ మిూదట బుషి కృపితో ఆనాడే మకరసంక్రాంతి అనే సంగతి జ్ఞాపకం చేశాడు. దగ్గరవున్ననదికి వెంటనే వెళ్లి శరీరానికి పిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. వచ్చి తనకు పెరుగు దానం చెయ్యమన్నాడు.

అట్లా దానం చేయడం వల్ల ఆమెకు చక్కని కొడుకు పుడతాడనీ, అతడు తండ్రియొక్క మూడు విధాలయిన ఋణాలు తీరుస్తాడనీ చెప్పాడు.

అందు మిూద కృపి దుర్వాసుడు చెప్పినట్లు చేసింది కాలక్రమాన్ని ఆమెకు ఒక చక్కని కొడుకు పుట్టాడు. అతడే అశ్వత్థామ. ఆ కొడుకు పుట్టినప్పటినుంచి కృపి చీకు, చింతా లేకుండా వుండేది.

The features of Makara sankranthi

సంక్రాంతి పురుషుడి రూపము, రాకవలన ఫలితములు

ద్విముఖం కృష్ణవర్ణం చ సురూపం చ త్రినేత్రకమ్ |
చతుర్వక్త్రం చాతి శీర్షం లమ్బభ్రూ దీర్ఘనాసికమ్ II
లంబకర్ణం రక్తదంతం మహాఫనోర విరూపిణమ్ |
అష్టబాహం త్రిపాదం చ శ్యామం చ త్వజవాహనమ్ II
దశ యోజన మౌన్నత్యం ద్వాదశ స్మృతమ్ II
ఏవం రూపం తు విశ్లేయం సంక్రాని పురుషస్య హి II

ఈ సంక్రాంతి పురుషునకు "రాక్షస" అను పేరు. ఈ సంక్రాంతి పురుషుడు నిర్మలమైన నీటిచే సన్మానము చేసి,
నల్లని వస్త్రములను ధరించి, లాక్ష గంధమును పూసుకొని, చంపక పుష్పమును మరియు గోమేధికముతో కూడిన
ఆభరణములను ధరించినవాడై సీసపాత్రలో క్షీరమును సేవించి రేగిపండ్లను ఫలహారముగా తీసుకొని, ఏనుగు
వాహనమును ఎక్కి ధనుస్సును మరియు బంగారువర్ణము గల గొడుగును ధరించి ఆగ్నేయదిక్కుగా ప్రయాణము
చేయుచూ ఆశ్చర్యముతో కూడినవాడై కూర్చుని యుండును.

సంక్రాంతిపురుషుని ఈ రకమైన స్థితి వలన అందరకు కీడు కలుగును. ప్రజలకు, ముఖ్యముగా ఆగ్నేయదిశలోని దేశాలలోని వారికి అంతటా శుభములు జరుగుచున్నను భయములు, ఘర్షణలు మాత్రము పెరుగును. కీర్తి సంపాదించుకుందురు. పశువులచే హాని పెరుగును. సీస లోహమునకు విలువ తగ్గును. బంగారమునకు విలువ బాగా పెరుగును. ప్రజలకు ఆహారలోపములచే అనారోగ్యములు పెరుగుచున్నను సుఖముగానే ఉందురు. పరిపాలకులకు అంతర్గత, బహిర్గత ఘర్షణలు పెరుగుతాయి. అయినను మొత్తంమీద అందరకు క్రమశుభాభివృద్ధి అందగలదు.

పక్షఫలమ్:-
శ్లో| కృష్ణపక్షే యదా పొపే మకర స్టే దివాకరే !
సుభిక్షం క్షేమ మారోగ్యం జంతూనా మశుభప్రదమ్ II
పుష్య కృష్ణమున మకర సంక్రాంతి అగుట వలన దేశము సుభిక్షముగాను, క్షేమముగాను, ఆరోగ్యముగాను ఉండును. జంతువులకు నాశనము కలుగును.
తిథిఫలం : సుభిక్షము, వారఫలం : అంతర్గత యుద్ధములు కలుగును. నక్షత్రఫలం : అనిష్టములు, లగ్నఫలం : జనక్షయము, కాలఫలం : అధికారులకు హాని.

సంక్రాంతి పురుషోత్పత్తికాలే దానం స్వశక్తితః |
ఫలం కాంస్యాది ధాన్యాని దీయతే దోషనాశనమ్ |
ఫలాని మూలాన్యజినం సువర్ణం గ్రామాంశుకాద్యం సతిలేక్లు గావః |
ధాన్యం ఖరాంశో ర్మకర ప్రవేశ ఏతాని దానాని విశేషితానమ్ |

English summary
The astrologer described the importance of Makara Sankranthi and its mythological story.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X