వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read: మనం తినే ఆహారం - ఐదు రకాల దోషాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనం తినే ఆహరం ఆకలిని మాత్రమే తీర్చదు. దాని ప్రతిఫలం తిన్నది అరిగే వరకు దాని స్వభావం మనిషిపై చూపుతుంది. అందుకే వడ్డన చేసేప్పుడు ఎదుటి వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్న ఇష్ట పూర్వకంగా ప్రేమగా వడ్డన చేయాలి. అలాగే మనం తినేప్పుడు కూడా ప్రశాంతమైన మనస్సుతో భగంతుని కృపవలన ఈ ఆహరం ద్వార నాకున్న ఆకలిని వీరి ప్రమేయంతో తీర్చుకోగలుగుతున్నాను అనుకోవాలి. అన్నం తిన్నాకా తప్పక అన్నధాతకు, వడ్డించిన వారికి, స్థల యజమానికి, సేవ చేసిన వారికి అంటే ధాన్యం పండించే వారికి, కూరగాయలు పండించే రైతుకి, వంట తయారు కావడానికి సహాయపడే వ్యక్తులకు, నీ ఆకలి తీర్చే ఆహార పదార్ధం తినడానికి సిద్దంగా నీ నోటికి అందెందుకు కారణమైన ప్రతి ఒక్కరికి తప్పక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక మనం తినే ఆహారంలో ఎలాంటి ప్రభావం కలుగుతుందో చూద్దాం.

The food we take have five types of bugs..? what are they

1 . అర్ధ దోషం.
2 . నిమిత్త దోషం.
3 . స్ధాన దోషం.
4 . గుణ దోషం.
5 . సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని మన పూర్వీకులు,పెద్దలు చెపుతారు.

అర్ధ దోషం:-ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూసాడు. భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది, ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ముఖ్యం.

నిమిత్త దోషం:- మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది. ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు వున్నవారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.

స్ధాన దోషం:- ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుధ్ధ రంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.

గుణ దోషం:- మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

సంస్కార దోషం :- దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి, అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు.

ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి. వడ్డించే సమయంలో అవతలి వ్యక్తీ ఎవరైనా సరే ప్రేమ పూర్వకంగా మాత్రుహృదయంతో వడ్డన చేయాలి. తినే ఆహార పదార్ధం ఎవ్వరికి ఇచ్చిన ఇష్ట పూర్వకంగా ఇవ్వాలి. అది భిక్షగాల్ల కైనా ఇచ్చేప్పుడు సాక్షాత్తు భగవంతునికే సమర్పిస్తున్నాను అనే భావన చెంది ఇవ్వాలి. ఈ నియమాలు పాటించిన వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయి.

English summary
The food we eat not only satisfies hunger. Its nature shows on man until its carrion is eaten. That is why when serving, the relationship with the other person should be served with love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X