వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి పర్వదినం విశిష్టత ఏమిటంటే...

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

'మకర సంక్రాంతి' సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో,ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది.

ఈ పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి వారం పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ.

The importance of makara Sankranti

సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో స్వీట్స్ తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.నువ్వులముద్దలు, అరిసెలు, సకినాలు, చెగోడిలు, పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన పిండి వంటకాలు చేసుకుని కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.

గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.ఇక హరిదాసులు హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి ముక్కువరకు తిరుమణి నామంతో,కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.


ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు వివరణ చెబుతూ "మకరం" అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు.

వాస్తవానికి ఖగోళ ప్రకారంగా డిసెంబర్ 22 తారీకు నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది,కాని మనకు ధనర్మాసం ఈ రోజుతో పూర్తి అవ్వడం వలన సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్య దినాలుగా పరిఘనలోకి తీసుకుంటారు.పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు.అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాపితామహుడు ఈ పర్వదినం వరకు ఎదిరి చూసి ఉత్తరాయణం లో రథసప్తమి"మాఘ శుద్ధ సప్తమి" నాడు మొదలుకోని తన పంచప్రాణాలను రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి మొక్షం పొందాడు.

జగద్గురువు

ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు.
పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రం లో కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది.ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది.ఈ విధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలను చోటు చెసుకుంది.

English summary
Astrologer explained the importance of Makara Sankranti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X