వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మకర సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం?

తెలుగువారికి ఇష్టమైన పండుగ మకర సంక్రాంతి. ఈ పర్వదినం నాటికి ధనధాన్యాలు ఇళ్లకు వస్తాయి. ఈ పండుగ వెనక ఉన్న కథేమిటి...

By Pratap
|
Google Oneindia TeluguNews

ఈనాడు దాశరథి రాముని పూజ చేసి ఉపవాసము ఉండాలని చతుర్వర్గ చింతామణి, ఈనాటి నుంచి ఉత్తరాయణము. సూర్యుడు ఉత్తర గతుడు అవుతాడు. ఉత్తరాయణము దేవకర్మలకు అర్హమైన కాలము. ఈ ఆయనంలో చనిపోయిన పుణ్యాత్ముడు దేవమహిమను పొంది సూర్యసాయుజ్యమును అందునని వేదవచనము.

ఏడాదికి వచ్చే పన్నెండు సంక్రాతులలోనూ మకర సంక్రాంతి తెలుగువారికి బాగా పరిచితమైనది. సంక్రాతి అంటే మకర సంక్రాతి అర్థమవుతుంది.

బొమ్మల కొలువులు - ఓలలాడింపు దృశ్యాలు.
సంకురమయ్య ఫూజలు
పశువులకు మువ్వల పట్టేళ్ల
సూర్యుని సంచారమును పట్టి ఏర్పడిన పండుగ ఆడపిల్లలు తెల్లవారుజామున, గొబ్బిళ్ళు
ముగులకు ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం ఉంది. బాలికల చిత్రకళాభిజ్ఞత,
గొబ్బిళ్లకు కామంచి పళ్లు విధాయకంగా పెట్టడం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
సంక్రమయ్య ఏమి ఎక్కివస్తాడు? సంక్రాంతి రైతుల పండుగ.

The importance of Makara sankranthi and Kanuma

నిరుపమ లీల బాలికలు నిశ్చల భక్తిని యుక్తి సంకురా
తిరి నెలంటేడ గొబ్బిలులు బీర్తురు వాకిళులందు వ్రుగులన్
బొలిసారి బొమ్మలన్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలో
బరువడినారంగించెదరు పచ్చడి బెల్లము ఫుల్లమిచ్చలన్,
తెలుగునాడు - దాసు శ్రీరాములు

మకరరాశిలో సూర్యుడు ప్రవేశించేదినం మకరసంక్రాతి. ఈనాటి నుంచి సూర్యుడు కర్కటకరాశిలో సూర్యుడు ప్రవేశించింది మొదలు మకరసంక్రాతి వరకు దక్షిణాయనము. ఉత్తరాయణము పుణ్యకాలమనీ, దక్షిణాయణము అంతమంచిది కాదనీ అంటారు. వివాహాలు, ఉపనయనాలు సాధారణంగా ఉత్తరాయణంలోనే చేస్తారు. ఉత్తరాయణంలో చనిపోయిన వారు వెంటనే స్వర్గలోకంలోకి వెళ్లిపోతారు. దక్షిణాయనంలో చనిపోయేవారు ఉత్తరాయణం వచ్చే వరకు స్వర్గద్వారాల వద్ద వేచి వుండాలి. కాగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణం పుణ్యాత్ములకే కాని లభించదంటారు.
మకర సంక్రాతి పర్వం అతి పురాతనమైందిగా కనిపిస్తుంది.

గుణవంతురాలు, పతివ్రత ఐన కృపి అనే స్త్రీ వుండేది. ఋషి తుల్యుడైన ద్రోణాచార్యుల భార్య ఆమె. ఆ భార్యాభర్తలు ఒక ఆశ్రమంలో వుంటూ వుండేవారు. ఒకనాడు ద్రోణాచార్యుడు బయటికి వెళ్లాడు. ఆశ్రమంలో కృపి ఒక్కర్తీ కూచుని వుంది. ఆ సమయంలో దుర్వాసముని సమిధల కొరకు అన్వేషణ సాగిస్తూ మార్గవసాత్తు అచ్చటికి వచ్చాడు. వచ్చిన మునిని కృపి పూజించింది. తమ పేదతనాన్ని చెప్పకుంది. ఒక ముసలి ఆవు తప్ప తమకు ప్రపంచంలో ఏమిూ ఆస్తి లేదని చెప్పకుంది. తమకు పిల్లలు కూడా లేరని చెప్పకుంది. తమకు భాగ్యప్రదమైన సాధనమేదేనా చూపించమని కోరింది.

ఆమె ప్రార్థనా మృదూక్తులకు ముని దయార్ధ హృదయుడైసంక్రాతి పర్వాన్ని జరుపమని ఉపదేశించాడు. ఆ వ్రత విధానం ఇది. సంక్రాంతినాడు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మడికి పెరుగుదానం చేయాలి. నందుని భార్య ఐన యశోద ఇట్లే బ్రాహ్మడికి పెరుగు దానం చేసింది. ఆదానానికి ఫలితంగానే ఆమెకు శ్రీకృష్ణుడు కొడుకుగా లభించాడు. ఆ కొడుకు వారి పేదతనాన్ని బాపి తన తండ్రి ఐన నందుని గొల్లకులానికి రాజుని చేశాడు.

-ఈ సంగతులన్నీ చెప్పి ఆ మిూదట బుషి కృపితో ఆనాడే మకరసంక్రాంతి అనే సంగతి జ్ఞాపకం చేశాడు. దగ్గరవున్ననదికి వెంటనే వెళ్లి శరీరానికి పిండి రాసుకుని స్నానం చేసి రమ్మన్నాడు. వచ్చి తనకు పెరుగు దానం చెయ్యమన్నాడు.

అట్లా దానం చేయడం వల్ల ఆమెకు చక్కని కొడుకు పుడతాడనీ, అతడు తండ్రియొక్క మూడు విధాలయిన ఋణాలు తీరుస్తాడనీ చెప్పాడు.

అందు మిూద కృపి దుర్వాసుడు చెప్పినట్లు చేసింది కాలక్రమాన్ని ఆమెకు ఒక చక్కని కొడుకు పుట్టాడు. అతడే అశ్వత్థామ. ఆ కొడుకు పుట్టినప్పటినుంచి కృపి చీకు, చింతా లేకుండా వుండేది.

కనుమ పండుగ విశేషాలు

కనుమపండుగ = పశుపూజ

మకర సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమపండుగనాడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే తంతులను పరికింపగా
అది పశుపక్షిపూజకు కూడా ఉద్దిష్టమైన పండుగగా కనిపిస్తుంది.

పశువూజ :

కనుమును అరవవారు మాటు పొంగలి అంటారు. మాట్లు అనగా పశువు అని అర్థం. మాటు పొంగలి
అనగా పశువులకు పొంగలి వండి పెట్టేరోజు అని అర్థం. వ్యవసాయదారుడికి పశువే ధనం. వాటి శ్రమ
మూలంగా ఆయేటిపంట చేతికి వచ్చిన సంక్రాంతి తరుణంలో కృతజ్ఞతాసూచకంగా వాటికి కొత్తబియ్యంతో
పొంగలి వండిపెట్టే ఆచారం ఏర్పడి ఉంటుంది.

తెలుగు మాగాణిలో

ఈ పండుగ వేదకాలము నుంచి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. "ఉద్వషభోత్సవమును గూర్చి అవడుత్సవము' అను
పేరుతో అధర్వ వేదమున గలదు. దాని విధి నిషేధాదికము శ్రాత సూత్రమున ఉన్నది. అది పంటలు పండి ధాన్యము నింటికడకు దెచ్చికొనిన తర్వాత వ్యవసాయకులు చేసే కర్మగా చెప్పబదినది. ఆ పరిస్థితి గోదావరి మండలమున మకర సంక్రమణము వెళ్లిన మరునాడు గొల్లలను, కొందరు వ్యవసాయకులును చేసే పశువుల పండుగకు సరిపోవుచున్నది.
కనుమనాడు గోపూజ చేయడం ఈనాడు తెలుగు మాగాణిలో కంటె తమిళనాట ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు.

English summary
Astrologer Maruthi Sharma explained the back ground of Makara sankranthi and Kanuma festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X