• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూలై 27న సంపూర్ణ చంద్ర గ్రహణం

By Srinivas
|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

స్వస్తిశ్రీ విలంబి నామ సంవత్సరం ఆషాఢమాసం పూర్ణిమ రోజు 27 జూలై 2018 శుక్రవారంరోజు మకరరాశిలో ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలలో కేతుగ్రస్తంగా మేష,వృషభ,మిధున లగ్నాలలో చంద్రునికి తూర్పుభాగంలో గ్రహణం స్పర్శించి పిదప సంపూర్ణంగా చంద్ర గ్రహణం మనకు కనిపిస్తుంది.

ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండములలో కనపడును.

భారతదేశ కాలమాన ప్రకారం సంపూర్ణ చంద్ర గ్రహణ సమయములు

చంద్ర గ్రహణ స్పర్శ : రాత్రి 11 గంటలు 54 నిమిషాలు

సంపూర్ణ స్థితికి గ్రహణం రాక : రాత్రి 01గంటలు 00 నిమిషాలు

చంద్ర గ్రహణ మధ్యకాలం : రాత్రి 01గంటలు 52 నిమిషాలు

సంపూర్ణ స్థితి నుండి విడుపు ప్రారంభం : రాత్రి 02 గంటలు 43 నిమిషాలు

చంద్ర గ్రహణ ముగింపు (మోక్షకాలం) : రాత్రి 03 గంటలు 49 నిమిషాలు

అద్యంత పుణ్యకాలం : 3 గంటల 55 నిమిషాలు ( మొత్తం 235 నిమిషాలు )

ఈ గ్రహణం భారత కాలమానానికి చూస్తే నిద్రించే సమయంలో ఉన్నది కనుక ఎక్కువ శాతం నిద్రలో ఉంటారు కాబట్టి చూడడానికి ఆసక్తి చూపరు.

 The July 27, 2018 Blood Moon

ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు.లేని పోని అనుమానలు పడవద్దు,అను మానాలు చెప్పే వారి మాటలను నమ్మవద్ధు.గర్భవతులు ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు,కాని టివిలలో చూడవచ్చు.మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు అనే అపోహలకు బయపడకండి.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహణ సమయంలో కాలక్రుత్యాలు చేసుకోవచ్చును.

గ్రహణ సమయానికి కనీసం 3 మూడు గంటల ముందుగా ప్రతి ఒక్కరు ఆహారం స్వీకరించినచో,గ్రహణ ప్రారంభ సమయానికి తిన్న ఆహారం జీర్ణమగును. గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా తుడుచుకుని.స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంజ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి.

శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోశ నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి,ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,చాదస్తాలకు పోయి ఇబ్బంది పడకూడదు.

ఇంట్లో పూజ అయిన తర్వాతనే గుడికి,దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మకరరాశి వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం,తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి.గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.ఈ విషయాలను శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఆచరించండి.

నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది. కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.రోజు అగర్బత్తి,దూపం మొదలగునవి తప్పక చూపించాలి.

తిరుపతి వెంకన్న స్వామి ఆలయం జూలై 28 న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 27 తేదీ రోజు ఆర్జితసేవలు రద్దు చేయబడినవి.సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The total phase of the "blood moon" eclipse of July 27 will last 1 hour and 43 minutes, during which Earth's natural satellite will turn a spectacular red or ruddy-brown color. From start to finish, the entire celestial event will last nearly 4 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more